Ustaad Bhagat Singh Glimpse : 'గబ్బర్ సింగ్'కు 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ గిఫ్ట్ - హరీష్ శంకర్ గట్టిగా ప్లాన్ చేశారుగా!
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' మే 11న విడుదలైంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.
![Ustaad Bhagat Singh Glimpse : 'గబ్బర్ సింగ్'కు 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ గిఫ్ట్ - హరీష్ శంకర్ గట్టిగా ప్లాన్ చేశారుగా! Ustaad Bhagat Singh first glimpse on May 11th, On the occasion of Pawan Kalyan Harish Shankar's Gabbar Singh 11th anniversary Ustaad Bhagat Singh Glimpse : 'గబ్బర్ సింగ్'కు 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ గిఫ్ట్ - హరీష్ శంకర్ గట్టిగా ప్లాన్ చేశారుగా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/26/34250a9b2f66863c5a9edf5d7435ed811682477846829313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Powerstar Pawan Kalyan) కథానాయకుడిగా నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా 'గబ్బర్ సింగ్' విడుదల తేదీ గుర్తు ఉందా? మే 11! తమ అభిమాన కథానాయకుడిని ప్రేక్షకులు అందరూ ఎలా అయితే చూడాలని కోరుకుంటున్నారో, ఆ విధంగా చూపించిన క్రెడిట్ దర్శకుడు హరీష్ శంకర్ సొంతం.
పవన్ కళ్యాణ్ ఖాతాలో ఇండస్ట్రీ హిట్స్, సూపర్ హిట్స్ ఉన్నాయి. ఆ సినిమాల్లో 'గబ్బర్ సింగ్'ది స్పెషల్ ప్లేస్! అందుకనే, ప్రతి ఏడాది మే 11 వచ్చిందంటే చాలు... పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. సోషల్ మీడియాలో ట్రెండ్స్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది 'గబ్బర్ సింగ్' రిలీజ్ డేట్ మరింత స్పెషల్ కాబోతోంది. ఎందుకంటే...
మే 11న 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్!
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh Movie). మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. 'గబ్బర్ సింగ్' విడుదలైన మే 11న ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులకు, ప్రేక్షకులకు సూపర్ కిక్ ఇచ్చేలా ఆ గ్లింప్స్ ఉండబోతుందని తెలిసింది. అన్నట్టు... ఈ ఏడాదికి 'గబ్బర్ సింగ్' విడుదలై 11 ఏళ్ళు!
Also Read : వైఎస్ జగన్ కథను తప్పకుండా చెబుతా - దర్శకుడు మహి వి రాఘవ్
పవన్... శ్రీలీల... ఫస్ట్ షెడ్యూల్!
ఇటీవల హైదరాబాదులో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. అందులో కథానాయిక శ్రీలీల (Sreeleela) కూడా పాల్గొన్నారు. హీరో హీరోయిన్లతో కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ భారీ ఫైట్ తెరకెక్కించారు. స్టంట్ కొరియోగ్రాఫర్లు రామ్ - లక్ష్మణ్ (Ram Laxman Masters) నేతృత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ తీసినట్లు 'ఉస్తాద్ భగత్ సింగ్' యూనిట్ తెలియజేసింది. వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా... హై వోల్టేజ్ భారీ యాక్షన్ సీన్లు తీశారు. అవి సినిమాలో హైలైట్ అవుతాయట! కొంత మంది చిన్నారులతో వినోదభరిత సన్నివేశాలు సైతం తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్, శ్రీలీల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్లు తీసినట్లు చిత్ర బృందం పేర్కొంది. నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి పలువురు నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు.
పవన్... స్పెల్ బైండింగ్ మ్యానరిజమ్!
పవన్ కళ్యాణ్ అంటే ఆయన మేనరిజమ్స్ కూడా అభిమానులకు గుర్తుకు వస్తాయి. హరీష్ శంకర్ సైతం పవర్ స్టార్ ఫ్యాన్ కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'లో స్పెషల్ మేనరిజమ్స్ క్రియేట్ చేశారట. అదిరిపోయే డైలాగ్స్, స్పెల్ల్ బైండింగ్ మ్యానరిజంలతో పవన్ కళ్యాణ్ ను విభిన్న కోణంలో చూపించి ప్రేక్షకులకు విందు అందించడం గ్యారెంటీ అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఆల్రెడీ రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోస్టర్లు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా - 'మంగళవారం'లో పాయల్ బోల్డ్ లుక్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)