Payal Rajput Goes Bold : ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా - 'మంగళవారం'లో పాయల్ బోల్డ్ లుక్
Ajay Bhupathi's Mangalavaaram Movie : 'ఆర్ఎక్స్ 100' తర్వాత దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'మంగళవారం'. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
'ఆర్ఎక్స్ 100' సినిమాతో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput)ను తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం చేశారు దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi). ఆయనకూ అదే తొలి సినిమా. తొలి చిత్రంతో ఇద్దరూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తున్నారు.
'మంగళవారం'లో పాయల్!
'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగు చిత్రసీమలో కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టిన అజయ్ భూపతి, తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా 'మంగళవారం' (Mangalavaaram Movie). దీంతో ఆయన నిర్మాతగానూ మారారు. 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన అజయ్ భూపతి... ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు ఈ రోజు అధికారికంగా వెల్లడించారు. ఆమె ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.
పాయల్ లుక్ చూస్తే...
సెమీ న్యూడ్ అనొచ్చా!?
Payal Rajput First Look : 'మంగళవారం' చిత్రంలో శైలజ పాత్రలో పాయల్ కనిపించనున్నట్లు ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా చిత్ర బృందం తెలిపింది. దీనిని సెమీ న్యూడ్ లుక్ అని కొందరు అనే ఆవకాశం కూడా ఉంది. ఎందుకంటే... పాయల్ ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేదు. వెనుక నుంచి ఫోటో తీశారు. అయితే, పాయల్ కళ్ళల్లో కన్నీటి పొర కనబడుతోంది. ఆమె వేలిపై సీతాకోక చిలుక ఉంది. జడలో మల్లెపూలు ఉన్నాయి. లుక్ ద్వారా ఎమోషన్స్ బయటపెట్టే ప్రయత్నం చేశారు అజయ్ భూపతి.
పాయల్ క్యారెక్టర్ గుర్తు ఉంటుంది - అజయ్ భూపతి
దర్శక - నిర్మాత అజయ్ భూపతి మాట్లాడుతూ ''గ్రామీణ నేపథ్యంలో 1990లలో సాగే కథతో సినిమా తీస్తున్నాం. మన నేటివిటీతో కూడిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు పాయల్ క్యారెక్టరైజేషన్ గుర్తు ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్ సినిమా. సినిమాలో 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యం ఉంటుంది'' అని అన్నారు.
'ఆర్ఎక్స్ 100'లో ఇందు...
'మంగళవారం'లో శైలజ!
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ నటించిన తొలి సినిమా 'ఆర్ఎక్స్ 100'. ఆ సినిమాలో ఇందు క్యారెక్టర్, క్లైమాక్స్ ట్విస్ట్ థియేటర్లలో ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయి. దాంతో క్యారెక్టర్ అందరికీ గుర్తు ఉండిపోయింది. ఆ తరహాలో 'మంగళవారం' చిత్రంలో శైలజ క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు గుర్తు ఉంటుందని నిర్మాతలు స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం తెలిపారు. ఇంకా వారు మాట్లాడుతూ ''ఇప్పటికి 75 రోజులు షూటింగ్ చేశాం. ఎక్కువ శాతం నైట్ షూట్స్ ఉన్నాయి. వచ్చే నెలలో ఆఖరి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.
Also Read : విజయ్ వర్మతో తమన్నా - అవును, వాళ్ళిద్దరూ మళ్ళీ దొరికేశారు!
View this post on Instagram
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న చిత్రమిది. ఇది పాన్ ఇండియా సినిమా కాదు, సౌత్ ఇండియన్ సినిమా అన్నమాట. ఈ చిత్రానికి కళా దర్శకత్వం : రఘు కులకర్ణి, సౌండ్ డిజైనర్ అండ్ ఆడియోగ్రఫీ : జాతీయ పురస్కార గ్రహీత రాజా కృష్ణన్, ఛాయాగ్రహణం : దాశరథి శివేంద్ర, సంగీతం : 'కాంతార' ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్, నిర్మాతలు : స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, అజయ్ భూపతి, కథ - కథనం - దర్శకత్వం : అజయ్ భూపతి.
Also Read : గోల్డెన్ బికినీలో రాయ్ లక్ష్మి - గోవాలో హాట్ లేడీ