Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలయ్యతో స్టెప్పులేసిన ఊర్వశి... లుక్కు చూశారా? సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Urvashi Rautela in Daaku Maharaaj: నట సింహం నందమూరి బాలకృష్ణతో 'డాకు మహారాజ్'లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే మూవీలో ఫస్ట్ లుక్ రిలీజైంది.
Daaku Maharaaj 3rd Single Release Date: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ అయింది. అయితే, కొత్త ఏడాది మొదలైన ఐదు రోజులకు అది రానుంది. బాలయ్య కొత్త సినిమా 'డాకు మహారాజ్ సినిమాలోని మూడో సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఇంతకీ ఆ పాట ఎప్పుడు వస్తుంది? అందులో ఎవరు స్టెప్పులు వేశారు? వంటి వివరాల్లోకి వెళితే...
అమెరికాలో ఇండియా కంటే ఒక్క రోజు ముందు!
'డాకు మహారాజ్' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ప్రగ్యా జైస్వాల్ ఒకరు అయితే... శ్రద్ధా శ్రీనాథ్ మరొకరు. న్యూ ఇయర్ గిఫ్ట్ కింద విడుదల కానున్న పాటలో బాలకృష్ణతో స్టెప్పులు వేసింది వాళ్ళిద్దరూ కాదు... బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా.
నందమూరి బాలకృష్ణతో 'డాకు మహారాజ్' సినిమాలో ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) స్పెషల్ సౌంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆ పాటలోని ఆవిడ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఎప్పటిలానే ఊర్వశి గ్లామర్ లుక్ మెయింటైన్ చేశారు. అయితే.... ఆవిడ కంటే బాలయ్య మరింత అందంగా ఉన్నారని అభిమానులు అందరూ చెబుతున్నారు.
''కొత్త ఏడాదికి మాస్ ధమాకా వచ్చింది. అమెరికాలో జనవరి 4వ తేదీన, ఇండియాలో జనవరి 5వ తేదీన 'డాకు మహారాజ్' సినిమాలో మూడో పాటను విడుదల చేయనున్నాం. సంగీత దర్శకుడు తమన్ మాస్ బ్లాస్ట్ అందించారు. ఇక దబిడి దిబిడే'' అంటూ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో పేర్కొంది.
Also Read: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
The New Year gets its MASS DHAMAKA 😎
— Sithara Entertainments (@SitharaEnts) December 29, 2024
Set to turn theatres into electrifying concerts! 💥#DaakuMaharaaj 𝟑𝐫𝐝 𝐒𝐢𝐧𝐠𝐥𝐞 on 4th Jan (USA) & 5th Jan (India) 🔥
A @MusicThaman Mass Blast! 💥
ఇంకా దబిడి దిబిడే…🥁🕺🏻
𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @thedeol… pic.twitter.com/v3tV9dMZUC
బాలయ్యతో పాటు అమెరికా వెళుతున్న టీం!
'డాకు మహారాజ్' ఈవెంట్ ఒకటి అమెరికాలో చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోనే ఈ మూడో పాటను విడుదల చేయనున్నారు. బాలయ్య తో పాటు యూనిట్ కీలక సభ్యులు అందరూ ఆ వేడుక కోసం త్వరలో అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
'వాల్తేరు వీరయ్య' విజయం తరువాత బాబి కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దీనికి సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య నిర్మాతలు. ఇందులో బాబి డియోల్ విలన్ క్యారెక్టర్ చేశారు. చాందిని చౌదరి కీలక పాత్ర చేసింది.
Also Read: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... కాంట్రవర్సీని క్యాష్ చేసుకోవడమా? శవాల మీద పేలాలు ఏరుకోవడమా?