Urvashi Rautela: అఖిల్ ఆమెను వేధించాడా? ఆ ట్వీట్‌పై ఊర్వశీ రౌతేలా ఆగ్రహం, అతడిపై పరువు నష్టం దావా
‘ఏజెంట్’ మూవీలో ఐటెమ్ సాంగ్ చిత్రీకరణ సమయంలో హీరో అఖిల్.. నటి ఊర్వశీ రౌతేలాను వేదించాడంటూ ఓ సినీ విమర్శకుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
అక్కినేని అఖిల్‌కు మన టాలీవుడ్‌లో రాముడు మంచి బాలుడు అనేంత ఇమేజ్ ఉంది. అయితే, ఆ సినీ విమర్శకుడు చేసిన ఒక్క ట్వీట్.. దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. అతడి ‘అసభ్యకర’ ట్వీట్ నటి ఊర్వశీ రౌతేలాకు ఆగ్రహం కలిగించింది. అతడికి గట్టి సమాధానమే చెప్పింది. ఇంతకీ ఏమైంది? అఖిల్ ఏం చేశాడు? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ ట్వీట్ ఏమిటీ? ఊర్వశీ రౌతేలా ఎందుకు స్పందించిందనేగా మీ సందేహం?
ఫేక్ వార్తలను క్రియేట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు సినీ విమర్శకుడు ఉమైర్ సాంధు. సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుంటూ ఎప్పుడూ ఏదో ఒక కొత్త కథలు అల్లడం అతడికి అలవాటు. వాటిపై ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పరువు నష్టం దావాలు వేస్తామని కూడా హెచ్చరించారు. కానీ, అతడు తగ్గేదేలే అంటూ గాసిప్స్‌ను పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఉమైర్ దక్షిణాది తారలపై ఫోకస్ పెట్టాడు. అఖిల్ అక్కినేని టార్గెట్ చేసుకుంటూ ఇటీవల ఓ ట్వీట్ చేశాడు. నటి ఊర్వశీ రౌతేలాతో అఖిల్ అక్కినేని అసభ్యకరంగా ప్రవర్తించాడని పేర్కొన్నాడు. ఆ ట్వీట్ వైరల్ కావడంతో ఊర్వశీ రౌతేలా స్పందించక తప్పలేదు.
ఉమైర్ ట్వీట్‌లో ఏముంది?
‘‘యూరప్‌లో జరిగిన ‘ఏజెంట్’ ఐటెం సాంగ్ షూటింగ్ సమయంలో అఖిల్ అక్కినేని.. బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలాను వేదించాడు. అతడు పరిపక్వత లేని నటుడని, అతడితో నటించడానికి చాలా అసౌకర్యంగా ఫీలయ్యానని ఆమె చెప్పింది’’ అని ఉమైర్ సాండు ట్వీట్టర్‌లో పేర్కొన్నాడు.
#AkhilAkkineni “ Harassed ” Bollywood Actress #UrvashiRautela during Item Song Shoot of #Agent in Europe. As per her, He is very immature kind of actor & feeling uncomfortable working with him. pic.twitter.com/4MR48Vtgxc
— Umair Sandhu (@UmairSandu) April 18, 2023
దీనిపై ఊర్వశీ రౌతేలా ఘాటుగానే స్పందించింది. అతడి ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘‘నా లీగల్ టీమ్ ద్వారా మీకు పరువు నష్టం నోటీసులు పంపించాను. మీలాంటి అపరిపక్వత, అసభ్యకర జర్నలిస్టు ట్వీట్ వల్ల నేను చాలా అసౌకర్యానికి గురయ్యాను.’’ అని పేర్కొంది. వీరి గొడవ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
DEFAMATION LEGAL NOTICE HAS BEEN SERVED BY MY LEGAL TEAM. DEFINITELY DISGRUNTLED BY INDECENT JOURNALIST LIKE YOU FOR YOUR SPURIOUS / RIDICULOUS TWEETS. YOU’RE NOT MY OFFICIAL SPOKESPERSON. AND YES YOU’RE VERY IMMATURE KIND OF A JOURNALIST WHO MADE ME VERY UNCOMFORTABLE. pic.twitter.com/v755qXnQuq
— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) April 23, 2023
సాండు ట్వీట్‌పై అక్కినేని అభిమానులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు రాతలు రాయొద్దని తిట్టిపోస్తున్నారు. అంతేకాదు, ఉత్తరాది ప్రేక్షకులు సైతం అతడి ట్వీట్లపై మండిపడుతున్నారు. ఇలాంటి తప్పుడు ట్వీట్లు పెట్టడం మానుకోవాలని, లేకపోతే ఇబ్బందుల్లో పడతావని హెచ్చరిస్తున్నారు. కొందరైతే.. ఆ ఐటెమ్ సాంగ్ షూటింగ్ హైదరాబాద్‌లో జరిగిందని, యూరప్‌లో జరిగిందని రాశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. అఖిల్, ఊర్వశీ రౌతేలాకు మద్దతు తెలుపుతున్నారు.
A crazy mass song to all the wild ones out there ✊🏻✊🏻🔥
— Akhil Akkineni (@AkhilAkkineni8) April 22, 2023
Here’s the #WildSaala Song Promo…
Full Song Out Tomorrow…#AgentOnApril28th #Agent
pic.twitter.com/iCxq6Pmb0u
అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్' ను ఏకే ఎంటర్ టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్ లపై నిర్మించారు. ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ మూవీకి సంబంధించిన ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, పాటలు అత్యంత ఆసక్తిని రేకెత్తించాయి. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఐటెమ్ సాంగ్‌తో ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఊర్వశీ రౌతేలా ఈ మూవీలో కూడా ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.
'ఏజెంట్' ట్రైలర్ ను కాకినాడలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఏప్రిల్ 19న మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ విషయానికొస్తే ఆద్యంతం యాక్షన్ సీన్స్ తో నింపేశారు. ముఖ్యంగా ఫైట్ సీన్స్ ను చాలా స్టైలిష్ గా డిజైన్ చేయడంతో అఖిల్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక మరో ఆసక్తికరమైన అంశమేమిటంటే.. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అఖిల్ ఇరగదీశాడనే తెలుస్తోంది. బీస్ట్ లుక్ లో కనిపించనున్న అఖిల్.. ఈ సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటాడని ఆయన అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రెండేళ్లుగా చిత్రీకరిస్తున్న ఈ మూవీ గతేడాది ఆగస్టు 12నే విడుదల కావల్సి ఉండేది. కానీ, అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 28న మూవీని విడుదల చేస్తున్నారు.