అన్వేషించండి

Movies Releasing This Week: ఈవారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్... ఆ రెండు మాత్రం చాలా స్పెషల్

నవంబర్ 12 నుంచి వీకెండ్ వరకు కొన్ని కొత్త సినిమాలు థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోతున్నాయి. అవేంటో చూసేద్దాం పదండి.

గత వారం బాక్స్ ఆఫీసు దగ్గర చిన్న సినిమాల హడావిడి నడిచింది. కానీ నవంబర్ మూడో వారంలో మాత్రం పెద్ద సినిమాల హడావిడి కనిపించబోతోంది. అయితే థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా రిలీజ్ కాబోతున్న ఆ సినిమాల లిస్ట్ ఏంటో తెలుసుకుందాం పదండి. ఇక ఈ వారం నవంబర్ 14 టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కీలకంగా మారబోతోంది. ఒకే డేట్ రోజున 'మట్కా' మూవీతో పాటు తమిళ పాన్ ఇండియా సినిమా 'కంగువ' కూడా థియేటర్లలో సందడి చేయబోతోంది. 

మట్కా 
ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మూవీ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ క్రైమ్ డ్రామాను నవంబర్ 14న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా, విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్ళూరి సంయుక్తంగా నిర్మించారు. 1958లో శరణార్థిగా బర్మా నుంచి వైజాగ్ వచ్చిన బాలుడు అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ 'మట్కా' కింగ్ గా ఎలా మారాడు ? అనే ఆసక్తికర కథనాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. మెగా ఫ్యాన్స్ ఈ మూవీ రిలీజ్ గురించి ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

కంగువ 
ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సిన పెద్ద సినిమా 'కంగువ'. తమిళంతో పాటు అన్ని భాషల ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ఈ సినిమాలో సూర్య హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'కంగువ' మూవీలో దిశా పటాని, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ కూడా నవంబర్ 14న 'మట్కా' మూవీ తో క్లాష్ కాబోతోంది. 

ఉషా పరిణయం 
ఇక ఈ వారం డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న మరో చిన్న తెలుగు సినిమా 'ఉషా పరిణయం'. శ్రీ కమల్ హీరోగా, తన్వి ఆకాంక్ష హీరోయిన్ గా, కే విజయ్ భాస్కర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ ఈటీవీ విన్ లో ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. 

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ 
'ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్' పుస్తకం ఆధారంగా ఇదే పేరుతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ నవంబర్ 15న సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనిని లారీ కాలిన్స్, డొమినిక్ లాఫియర్ రాశారు. 1947లో స్వాతంత్రం వచ్చిన సమయంలో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సిరీస్ కొనసాగుతుంది. 

ఆహా 
ఆ తర్వాత చెప్పుకోవాల్సిన ప్రత్యేకమైన షో 'అన్ స్టాపబుల్ సీజన్ 4'. ఎందుకంటే నవంబర్ 15న అల్లు అర్జున్ అతిథిగా వచ్చిన స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. 

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 
నవంబర్ 12న డెడ్ పూల్ అండ్ ఓల్వరిన్
నవంబర్ 15న ఆన్ ఆల్మోస్ట్ క్రిస్మస్ స్టోరీ 

అమెజాన్ ప్రైమ్ వీడియో 
నవంబర్ 12న ఇన్ కోల్డ్ వాటర్ అనే వెబ్ సిరీస్ 
నవంబర్ 14న క్రాస్ అనే వెబ్ సిరీస్ 

నెట్ ఫ్లిక్స్ 
నవంబర్ 13న హాట్ ఫ్రాస్టీ అనే వెబ్ సిరీస్ 
నవంబర్ 13న ఎమిలియా పెరేజ్ అనే సిరీస్, 
నవంబర్ 15న కోబ్రా కై అనే సిరీస్, మైక్ టైసన్ వర్సెస్ పాల్ జాక్ అనే హాలీవుడ్ మూవీ 

లయన్స్ గేట్ ప్లే 
నవంబర్ 15న ఆపరేషన్ బ్లడ్ అనే తెలుగు డబ్బింగ్ మూవీ

Read Also : Devi Sri Prasad: 'కంగువ' హిట్టైతే బన్నీది తప్పు... లేదంటే దేవి శ్రీ ప్రసాద్‌ది తప్పు - ఇండస్ట్రీలో లేటెస్ట్ డిస్కషన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget