అన్వేషించండి

TVK Vijay - Jiiva: జీవాకు విజయ్ ఓదార్పు... ఆర్బీ చౌదరి పార్థీవ దేహాన్ని చూసి కన్నీరు మున్నీరు

TVK Vijay - RB Choudary: ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి పార్ధీవ దేహానికి టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ తమిళ హీరో విజయ్ బుధవారం నివాళులు అర్పించారు జీవాని ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రముఖ చలనచిత్ర నిర్మాత ఆర్.బి. చౌదరి (RB Choudary) రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త తెలిసి టీవీకే పార్టీ అధినేత, తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడు విజయ్, చెన్నైలోని టి నగర్‌లో ఉన్న ఆర్.బి. చౌదరి నివాసానికి బుధవారం రాత్రి చేరుకున్నారు. చౌదరి తనయుడు, హీరో జీవాను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భావోద్వేగానికి లోనైన జీవా...
కన్నీటి పర్యంతానికి లోనైన విజయ్
సీనియర్ నిర్మాత ఆర్.బి. చౌదరి మే 5, 2026న మరణించారు. రాజస్తాన్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భౌతిక కాయాన్ని చెన్నైలోని టి నగర్‌లో ఉన్న ఆయన నివాసానికి తీసుకువచ్చారు. తండ్రి మరణం వల్ల జీవా తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఆయనను విజయ్ ఓదార్చారు. ఆ క్రమంలో విజయ్ కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఆయన కూడా భావోద్వేగానికి లోనయ్యారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Nadu (@abpnadu)

విజయ్, జీవా మధ్య మంచి అనుబంధం ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత విజిల్ వేస్తూ సెలబ్రేట్ చేశారు జీవా. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మే 5న జీవా తండ్రి మరణించారు.

Also ReadSA Chandrasekhar - ఎవరీ ఎస్ఏ చంద్రశేఖర్? తండ్రితో దళపతి విజయ్‌తో గొడవలు, కోర్టు దావా ఏమిటి?

'స్నేహితుడు'లో విజయ్, జీవా...
చౌదరి నిర్మాణంలోనూ సూపర్ హిట్!
శంకర్ దర్శకత్వం వహించిన 'నన్బన్' గుర్తు ఉందా? తెలుగులో 'స్నేహితుడు'గా డబ్ చేశారు. అందులో విజయ్, జీవా కలిసి నటించారు. అది హిందీ సినిమా '3 ఇడియట్స్' రీమేక్. అంతే కాదు... 'పూవే ఉనక్కాగ' (1996)తో విజయ్‌ భారీ హిట్ అందుకున్నారు. ఆయన కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా అది. ఆ సినిమా నిర్మాత ఆర్.బి. చౌదరియే.

Also ReadSpirit Release Date Update - 'స్పిరిట్' వాయిదా పడుతుందా? క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ సినిమా టీమ్

ఆర్.బి. చౌదరి తనయుడిగా, కథానాయకుడిగా జీవా తమిళ చిత్రసీమలో అడుగు పెట్టారు. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. విజయాలు అందుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందిన 'యాత్ర' సీక్వెల్ 'యాత్ర 2' సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో నటించారు. ఆర్.బి చౌదరికి భార్య మహజబీన్, జీవా కాకుండా మరో ఇద్దరు కుమారులు రమేష్, సురేష్ ఉన్నారు.

Also ReadPalash Muchhal - కులం పేరుతో తిట్టాడు... స్మృతి మాజీ ప్రియుడు పలాష్ మీద అట్రాసిటీ కేసు

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget