True Lover OTT Release Date: ఒకేసారి మూడు ఓటీటీల్లోకి రాబోతున్న 'ట్రూ లవర్'- స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే
True Lover OTT Release: 'బేబీ' తరహాలో రియలస్టిక్ లవ్‌స్టోరీగా ఇటీవల వచ్చిన చిత్రం 'ట్రూ లవర్'. గత నెల థియేటుర్లోకి వచ్చిన ఈ చిత్రం ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్‌ఫాంలో రిలీజ్ కాబోతోంది.
True Lover OTT Platform and Streaming Details: రియలస్టిక్ లవ్‌స్టోరీలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. రీసెంట్‌గా తెలుగులో వచ్చిన బేబీ మూవీ వచ్చిన రెస్పాన్స్, వసూళ్లే దీనికి ఉదహరణ. ప్రస్తుతం కాలం యువతను బేస్ తీసుకుని నిజ జీవితంలో ప్రేమకథలో కనిపించే కామన్ పాయింట్‌తో వచ్చిన చిత్రమే బేబీ. ఈ సినిమా ఊహించని విధంగా విజయం సాధించింది. దాదాపు రూ. 90కోట్ల దగ్గరగా వసూళ్లు చేసింది. బేబీలానే రీసెంట్‌గా మరో రియలస్టిక్ లవ్‌స్టోరీ వచ్చింది. అదే 'ట్రూ లవర్'. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో 'లవర్' పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు.
‘బేబీ’ సినిమాను నిర్మించిన SKN, దర్శకుడు మారుతి తెలుగులో ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.ఫిబ్రవరి 10న థియేటర్లో రిలీజైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.అయినా, ఈ సినిమాకు అంతంత మాత్రమే వసూళ్లు వచ్చాయి. తమిళంలో మోస్తారు వసూళ్లు చేసిన ఈ సినిమా తెలుగులో కేవలం రూ. 2కోట్లతోనే సరిపెట్టుకుంది. దీంతో విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీసు ఫోటీ నుంచి తప్పుకుంది. యూత్‌ను ఆకట్టుకునే కంటెంట్ ఉండటంతో ఈ మూవీ ఓటీఈ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో మూవీ ఓటీటీ రిలీజ్‌పై తాజాగా ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ఓటీటీకి రావాల్సింది. ఎందుకింత ఆలస్యం చేశారో తెలియదు. కానీ, ఇప్పుడు లవర్ చిత్రాన్ని ఏకంగా మూడు ఓటీటీల్లో విడుదల చేయబోతున్నారు. హాట్‌స్టార్, సింప్లీ సౌత్, టెంట్ కొట్టా అనే మూడు ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి లవర్ సినిమాను తీసుకువస్తున్నారు. మార్చి 27 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో లవర్ అందుబాటులోకి రానుంది.
Also Read: తిరుపతిలో అభిమానుల ఫోన్లు లాగేసుకున్న హీరో విశ్వక్ సేన్ - షాకైన ఫ్యాన్స్
లవర్ కథ విషయానికి వస్తే..
తమిళ నటుడు, గుడ్‌నైట్ ఫేం మణకందన్ హీరోగా ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన లవ్‌స్టోరీ 'ట్రూ లవర్'. తెలుగులో ఈ సినిమాను లవర్ పేరుతో రిలీజ్ అయ్యింది. ఫిబ్రవరి 10న తమిళ్, తెలుగులో థియేటర్లో రిలీజ్ అయ్యింది. ఇందులో మ్యాడ్ ఫేం గౌరి ప్రియ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో అరుణ్ పాత్రలో మణికందన్, దివ్య పాత్రలో శ్రీ గౌరి ప్రియ ప్రేమికులుగా నటించారు. ఈ చిత్రంలో ఇద్దరు ప్రేమికుల పరిచయం, ప్రేమ, బ్రేకప్ నేపథ్యంలో 'ట్రూ లవర్'' చాలా సహజంగా చూపించాడు దర్శకుడు.
అయితే, అరుణ్ చిన్న ఉద్యోగం చేయడం, పెద్దగా డబ్బులేకపోవడంతో ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నానని ఇంట్లో చెప్పేందుకు దివ్య ఆలోచిస్తుంది. ఇంతలోనే డబ్బుకు ఇచ్చిన విలువ ప్రేమకు ఇవ్వడం లేదని అరుణ్ అనడంతో ఆమెకు బాగా కోపం వస్తుంది. బాధపడుతుంది. ఈ నేపథ్యంలోనే డబ్బున్న అబ్బాయి మదన్ బ్యాచ్ తో పరిచయం ఏర్పడుతుంది. వారితో స్నేహాన్ని అరుణ్ తట్టుకోలేడు. దివ్యపై మరింత కోప్పడుతాడు. చివరకు దివ్య అరుణ్ తో ప్రేమను కంటిన్యూ చేస్తుందా? ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఎమోషన్ తోనే నిండిపోయింది. మూవీ టేకింగ్ చాలా రియలెస్టిక్ గా కనిపిస్తోంది. సంగీతం కూడా ఆకట్టుకుంటోంది.