అన్వేషించండి

Chiranjeevi Trisha : టాలీవుడ్‌లోకి త్రిష 'మెగా' రీ ఎంట్రీ - చిరంజీవితో...

త్రిష మళ్ళీ తెలుగుకు వస్తున్నారు. చిరంజీవితో సినిమా చేయనున్నారు. అది ఏ సినిమా? దర్శకుడు ఎవరు? ఇతర వివరాలు ఏమిటి? అనేది చూస్తే...

త్రిష (Trisha Krishnan) తెలుగు సినిమా చేసి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? ఆమె నటించిన సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే, తెలుగు హీరోల పక్కన త్రిష నటించి ఎన్ని ఏళ్ళు అవుతుంది? అంటే... సుమారు ఎనిమిదేళ్లు! నట సింహం నందమూరి బాలకృష్ణ 'లయన్' తర్వాత త్రిష స్ట్రయిట్ తెలుగు సినిమా చేయలేదు. కమల్ హాసన్ 'చీకటి రాజ్యం', 'నాయకి' తదితర ద్విభాషా సినిమాలతో సందడి చేశారు. 'పొన్నియిన్ సెల్వన్' వంటివి ఎలాగో తెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'మెగా' రీ ఎంట్రీ ఇవ్వడానికి త్రిష రెడీ అవుతున్నారని తెలిసింది. 

చిరంజీవికి జోడీగా త్రిష!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా ఆయన కుమార్తె సుష్మితా కొణిదెల ఓ సినిమా నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి 'సోగ్గాడే చిన్ని నాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం', 'బంగార్రాజు' చిత్రాల ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల (Kalyan Krishna Kurasala) దర్శకత్వం వహించనున్నారు. ఆల్రెడీ కథ, కథనాలు లాక్ చేసేశారట. ఇందులో చిరు జోడీగా త్రిష పేరు పరిశీలనలో ఉంది. ఆమె ఎంపిక దాదాపు ఖాయమైనట్టే. 

ఇంతకు ముందు 'స్టాలిన్' సినిమాలో చిరంజీవి, త్రిష జంటగా నటించారు. వాళ్ళ జోడీ మీద అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఈ సినిమాతో హిట్ అందుకోవాలని ఆశిద్దాం! సుమారు 17 ఏళ్ళ తర్వాత చిరు, త్రిష జోడీ కుదిరింది. 

చిరంజీవి తనయుడిగా సిద్ధూ జొన్నలగడ్డ
చిరంజీవి సినిమాలో యువ కథానాయకుడు సిద్ధూ జొన్నలగడ్డ సైతం ఉన్నారు. ఆయనది కుమారుడి పాత్ర అని సమాచారం. చిరు, డీజే టిల్లు మధ్య సీన్లు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతున్నాయని తెలిసింది. సిద్ధూ జొన్నలగడ్డ జోడీగా యంగ్ సెన్సేషన్ శ్రీ లీల పేరు పరిశీలనలో ఉంది. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. 

ప్రస్తుతం 'భోళా శంకర్' సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు చిరు చేతిలో ఉన్న సినిమా అదొక్కటే. దాని తర్వాత రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు అడ్డం పడిన తెలుగు కమ్యూనిటీ  

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమాతో పాటు 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు సినిమాల షూటింగులు సమాంతరంగా చేస్తారట.   

ఇప్పుడు త్రిష చేస్తున్న సినిమాలకు వస్తే... తమిళ స్టార్ హీరో విజయ్, 'విక్రమ్' ఫేమ్ లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందుతున్న 'లియో'లో నటిస్తున్నారు. సుమారు 15 ఏళ్ళ తర్వాత విజయ్, త్రిష జంటగా నటిస్తున్న చిత్రమిది. ఇది కాకుండా తమిళ సినిమా 'ది రోడ్', మలయాళ సినిమా 'రామ్ : పార్ట్ 1'లో కూడా త్రిష నటిస్తున్నారు. 'పొన్నియిన్ సెల్వన్'లో త్రిష లుక్, ఆమె నటన ప్రశంసలు అందుకోవడంతో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

Also Read ప్రభాస్ అడగలేదు, మేమే కొన్నాం - 'ఆదిపురుష్' రైట్స్‌పై టీజీ విశ్వప్రసాద్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Embed widget