Tripti Dimri: హీరోయిన్ తమ్ముడ్ని వదిలేసి వ్యాపారవేత్తతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?
‘యానిమల్’ బ్యూటీ తృప్తి దిమ్రీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టారు.
Tripti Dimri boyfriend name: ఒక్క సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన నటీనటులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి యాడ్ అయిపోయింది తృప్తి దిమ్రీ. హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించినా కూడా తనకు కావాల్సినంత గుర్తింపు దక్కలేదు. కానీ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’లో సెకండ్ హీరోయిన్ పాత్రతో ఆమెకు ఎనలేని ఆదరణ లభించింది. అందుకే ప్రస్తుతం బాలీవుడ్‌లో మాత్రమే కాదు... టాలీవుడ్‌లో కూడా ఎక్కడ చూసినా తృప్తి పేరే వినిపిస్తోంది. తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాత్రమే కాదు... పర్సనల్ లైఫ్ గురించి కూడా తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా తన బాయ్‌ఫ్రెండ్ ఎవరు అనే విషయంపై సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి.
తృప్తి రిలేషన్‌షిప్‌పై రూమర్స్..
‘యానిమల్’ చిత్రంతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది తృప్తి దిమ్రీ. అయితే ఈ భామ ఒకప్పుడు హీరోయిన్ అనుష్క శర్మ సోదరుడు కర్నేష్ శర్మతో రిలేషన్‌షిప్‌లో ఉందని రూమర్స్ వైరల్ అయ్యాయి. దానికి తగినట్టుగా వీరిద్దరూ కూడా పలుమార్లు సన్నిహితంగా కనిపించారు. అంతే కాకుండా వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ గత కొన్నాళ్ల నుండి వీరిద్దరు కలిసి కనిపించడం లేదు. దీంతో బ్రేకప్ అయిపోయిందని రూమర్స్ మొదలయ్యాయి. ‘యానిమల్’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న సమయంలో తృప్తికి రిలేషన్‌షిప్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురయ్యింది. తన రిలేషన్‌షిప్ మునిగిపోయిందని, ఇప్పుడు తన సింగిల్ అని ప్రకటించింది. ఇక కర్నేష్ శర్మతో విడిపోయిన తర్వాత ప్రస్తుతం తృప్తి... ఒక బిజినెస్‌మ్యాన్‌తో డేటింగ్‌లో ఉందని సమాచారం. తనే సామ్ మర్చంట్.
మోడల్ టు బిజినెస్‌మ్యాన్..
తాజాగా తృప్తి దిమ్రీ ఒక పెళ్లికి వెళ్లింది. ఆ పెళ్లిలో పలువురు ఫ్రెండ్స్‌తో తను దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో తృప్తి.. సామ్ మర్చంట్‌తో క్లోజ్‌గా సెల్ఫీ దిగి.. దానిని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో వీరిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ప్రచారం మొదలయ్యింది. ఇక తృప్తి ఫ్యాన్స్ అంతా అసలు ఈ సామ్ ఎవరు అని కనిపెట్టే పనిలో పడ్డారు. గోవాలోని ‘వాటర్స్ బీచ్ లౌంజ్ అండ్ గ్రిల్’ అనే రెస్టారెంటుకు ఓనరే ఈ సామ్ మర్చంట్. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి.. నటుడిగా మారకుండా వ్యాపారంపై వైపు అడుగులేశాడు. తను మోడల్‌గా ఉన్న సమయంలో పలు పోటీల్లో కూడా విజయాన్ని సాధించాడు. దీంతో తనకు బాలీవుడ్‌లో కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి.
View this post on Instagram
అప్పటినుండి బ్రేకప్ రూమర్స్..
ఇక తృప్తి దిమ్రీ విషయానికొస్తే.. ‘యానిమల్’ కంటే ముందు ‘బుల్‌బుల్’, ‘కళ’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాలకు కర్నేష్ శర్మ నిర్మాతగా వ్యవహరించాడు. అప్పటినుండి వీరి మధ్య ప్రేమ మొదలయ్యింది. అందుకే వీరు క్లోజ్‌గా దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ‘కళ’ చిత్రం విడుదలయిన తర్వాత వెంటనే ‘యానిమల్’ ఆఫర్‌ను అందుకుంది తృప్తి. అప్పటినుండి కర్నేష్‌తో తన ఫోటోలు ఏమీ బయటికి రాలేదు. దీంతో వీరు విడిపోయారని రూమర్స్ మొదలయినా.. తాజాగా బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు సామ్ మర్చంట్‌తో డేటింగ్ రూమర్స్‌పై తృప్తి ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: కళ్యాణ్ రామ్ 'డెవిల్'తో లిరిసిస్ట్‌గా మారిన ఫిమేల్ సింగర్!