Devil: కళ్యాణ్ రామ్ 'డెవిల్'తో లిరిసిస్ట్‌గా మారిన ఫిమేల్ సింగర్!
Devil Telugu Movie Songs: 'డెవిల్' సినిమాలో 'దూరమే తీరమై...' పాటను తాజాగా విడుదల చేశారు.
Nandamuri Kalyan Ram's Devil movie songs: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా 'డెవిల్'. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉప శీర్షిక. ఇదొక పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిరించారు. అంతే కాదు... ఈ సినిమాతో ఆయన దర్శకుడిగానూ పరిచయం అవుతున్నారు. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. తాజాగా సినిమాలో 'దూరమే తీరమై...' పాటను విడుదల చేశారు.
గేయ రచయితగా సమీరా భరద్వాజ్!
'దూరమే తీరమై...' పాట ప్రత్యేకత ఏమిటంటే? దీనిని ఫిమేల్ సింగర్ సమీరా భరద్వాజ్ రాశారు. స్వయంగా పాడారు కూడా! 'అర్జున్ రెడ్డి', 'సరైనోడు', 'శతమానం భవతి' వంటి పలు హిట్ సినిమాల్లో ఆమె పాటలు పాడారు. 'నాలో కొత్త కోణం చూడండి' అంటూ ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
'డెవిల్' సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఆల్రెడీ విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. సినిమాపై అంచనాలు పెంచాయి. డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని దర్శక నిర్మాత అభిషేక్ నామా ధీమాగా ఉన్నారు.
Also Read: 'కెజియఫ్'లో చేసిన తప్పే మళ్ళీ 'సలార్'కు...
'డెవిల్' చూసిన అగ్ర నిర్మాత 'దిల్' రాజు!
Dil Raju watched Devil movie: 'డెవిల్'ను తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాత 'దిల్' రాజు చూశారని తెలిసింది. సినిమా యూనిట్ ఆయన కోసం స్పెషల్ షో వేసింది. షో పూర్తి అయిన తర్వాత బావుందని హీరో, దర్శక నిర్మాతను 'దిల్' రాజు మెచ్చుకోవడం మాత్రమే కాదు... సినిమా రైట్స్ కూడా తీసుకుంటానని చెప్పారట.
'బింబిసార' విడుదలకు ముందు సైతం 'దిల్' రాజుకు ఇదే విధంగా... ప్రత్యేకంగా సినిమా షో వేశారు హీరో కళ్యాణ్ రామ్. ఆయన డెసిషన్, రివ్యూ పర్ఫెక్ట్ అని! ఆ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు 'దిల్' రాజు! ఇప్పుడు 'డెవిల్' ఆంధ్ర రైట్స్ తీసుకున్నారట. నైజాంలో సినిమాను సునీల్ నారంగ్ కు చెందిన గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేయనుంది. సీడెడ్ రైట్స్ కూడా అమ్మేశారట.
Also Read: పది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!
View this post on Instagram
Devil movie actress name: 'డెవిల్'లో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ నటించారు. ఈ జోడీ ఆల్రెడీ 'బింబిసార'లో నటించింది. ఇప్పుడు 'డెవిల్'తో మరో హిట్ మీద కన్నేసింది. ఇప్పటికే విడుదలైన పాటల్లో కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇంకా ఈ సినిమాలో మణిమేఖల పాత్రలో రాజకీయ నాయకురాలిగా మాళవికా నాయర్ కనిపించనున్నారు. రోజీగా బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నరౌజి నటించారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : గాంధీ నడికుడియార్, కూర్పు : తమ్మిరాజు, కథా విస్తరణ : ప్రశాంత్ బారది, కాస్ట్యూమ్ డిజైనర్ : విజయ్ రత్తినమ్ ఎంపీఎస్‌ఈ, కథ - కథనం - సంభాషణలు : శ్రీకాంత్ విస్సా, ఛాయాగ్రహణం : సౌందర రాజన్, సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్, నిర్మాణ సంస్థ : అభిషేక్ పిక్చర్స్, సమర్పణ : దేవాంశ్ నామా, నిర్మాణం & దర్శకత్వం: అభిషేక్ నామా.