అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Tripti Dimri: రణబీర్ ఇంటి పక్కనే మకాం పెట్టేసిన ‘యానిమల్’ బ్యూటీ - చేసింది 6 సినిమాలే.. ఏకంగా అన్ని కోట్ల బంగ్లా కొనేసింది!

Tripti Dimri: ‘యానిమల్’తో స్టార్‌డమ్ సంపాదించుకున్న తృప్తి దిమ్రీ.. కెరీర్ మొత్తంలో చేసింది ఆరు సినిమాలే. అయినా బాలీవుడ్ బడా సెలబ్రిటీలు ఉండే ఏరియాలో ఏకంగా ఒక బంగ్లా కొనేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Tripti Dimri: కొంతమంది సినీ సెలబ్రిటీల లైఫ్ మారిపోవడానికి ఒక్క సినిమా చాలు. ఆ ఒక్క సినిమాతోనే వారు ఎనలేని స్టార్‌డమ్‌నను చూడడంతో పాటు క్రేజ్‌ను బట్టి రెమ్యునరేషన్ కూడా పెంచేస్తారు. ఇప్పుడు అదే తోవలో వెళ్తోంది ‘యానిమల్’ బ్యూటీ తృప్తి దిమ్రీ. ఈ భామ బాలీవుడ్‌లో 6 సినిమాలు చేసిందంటే చాలామంది నమ్మలేరు. ఎందుకంటే చాలామంది ప్రేక్షకులు తనను మొదటిసారిగా ‘యానిమల్’ సినిమాలోనే చూశారు. ఆ సినిమానే తన లైఫ్‌ను పూర్తిగా మార్చేసింది. దీంతో ఏకంగా కోట్ల విలువ చేసే బంగ్లాను కొనేసి రణబీర్ కపూర్ ఇంటి పక్కనే మకాం పెట్టేసింది ఈ భామ.

బంగ్లా ధర ఎంతంటే.?

ముంబాయ్‌లోని బాండ్రా ఏరియాలోనే దాదాపుగా బాలీవుడ్ సెలబ్రిటీలు అంతా ఉంటారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్.. వీరంతా ఉండేది అదే ఏరియాలోనే. బీ టౌన్‌లో కాస్త స్టార్‌డమ్ వచ్చిందంటే చాలు.. ఎవరైనా అదే ఏరియాకు షిఫ్ట్ అయిపోతారు. ఇప్పుడు తృప్తి దిమ్రీ కూడా అదే చేసింది. ఆ ఏరియాలో ఒక బంగ్లా కొనేసింది. కేవలం 6 సినిమాల్లోనే నటించి.. స్టార్ స్టేటస్ సంపాదించుకొని.. బాండ్రాలో బంగ్లా కొనే రేంజ్‌కు తృప్తి ఎదిగిపోయిందని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అంతే కాకుండా ఈ బంగ్లా రేట్ తెలిసి కూడా అందరూ షాక్ అవుతున్నారు. తృప్తి దిమ్రీ కొనుగోలు చేసిన బంగ్లా విలువ ఏకంగా రూ.14 కోట్లు అని సమాచారం.

రెండు ఫ్లోర్లు..

బాండ్రాలోని కార్టర్ రోడ్ అనేది చాలా పాపులర్. అక్కడే తృప్తి దిమ్రీ బంగ్లాను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. అక్కడే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రేఖ ఇళ్లు కూడా ఉన్నాయి. రణబీర్ కపూర్, ఆలియా భట్ కూడా బాండ్రాలోనే ఉంటారు. ఇక తృప్తి కొత్త బంగ్లా విషయానికొస్తే.. అది 2,226 స్క్వేర్ ఫీట్‌లో కట్టిన రెండు ఫ్లోర్ల బిల్డింగ్ అని తెలుస్తోంది. 2017లో ‘పోస్టర్ బాయ్స్’ అనే మూవీతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది తృప్తి. కానీ ఆ మూవీ వల్ల తన కెరీర్ ఏమీ ముందుకు వెళ్లలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘లైలా మజ్ను’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇందులో తన యాక్టింగ్‌కు మంచి మార్కులు పడినా అప్పటికీ తనను ఎక్కువగా ప్రేక్షకులు గుర్తించలేదు.

తృప్తి ఆస్తులు..

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’లో తృప్తి కనిపించేది కాసేపే అయినా ఆ సినిమా వల్ల తనకు ఒక్కసారిగా స్టార్‌డమ్ దక్కింది. దీంతో అసలు తన ఆస్తుల విలువ ఎంత ఉంటుందని ప్రేక్షకులు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. మొత్తంగా తృప్తి ఆస్తుల విలువ రూ.20 నుండి 30 కోట్లు ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు. ఇవన్నీ తను కేవలం సినిమాల నుండి మాత్రమే సంపాదించలేదు. తనకు సినిమాల్లో వచ్చిన క్రేజ్ వల్ల ఎన్నో పాపులర్ బ్రాండ్స్ తనతో ప్రమోషన్ చేయించడానికి ముందుకు వచ్చాయి. అంతే కాకుండా తను సోషల్ మీడియా ద్వారా కూడా బాగానే సంపాదిస్తోందని సమాచారం. మొత్తానికి చాలా తక్కువ టైమ్‌లోనే బాండ్రా షిఫ్ట్ అయిపోయేంత పాపులారిటీ సంపాదించుకుంది తృప్తి దిమ్రీ.

Also Read: దీపికా... ఆ తెలుగేంటి? 'కల్కి'లో డబ్బింగ్ మార్చండ్రా బాబు - ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్న టాలీవుడ్ ఆడియన్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Embed widget