Tollywood Entertainment News : నానితో శృతి, సమంత గుడిపై & అఖిల్ 'ఏజెంట్'పై ట్రోల్స్ - ఈ రోజు టాప్ 5 ఎంటర్టైన్మెంట్ న్యూస్
తెలుగు చిత్రసీమలో ఈ రోజు టాప్ 5 ఎంటర్టైన్మెంట్ న్యూస్‌తో ఏబీపీ దేశం మీ ముందుకు వచ్చింది.
గుడి ఓకే, అందులో సమంత ఎక్కడ? - ట్రోల్స్ చూస్తే నవ్వు ఆగదు!
సమంత కోసం ఆమె వీరాభిమాని, గుంటూరులోని బాపట్లలో ఆలపాడు గ్రామానికి చెందిన సందీప్ గుడి కట్టారు. ఈ సంగతి తెలిసిందే. సమంత పుట్టిన రోజు (Samantha Birthday) సందర్భంగా నిన్న (ఏప్రిల్ 28, శుక్రవారం) గుడి ఓపెన్ చేశారు. కేక్ కట్ చేయడంతో పాటు గ్రామస్థులు, అభిమానులను పిలిచి గ్రాండ్ ఈవెంట్ చేశారు. అక్కడి వరకు బావుంది. ఆ తర్వాతే అసలు కథ మొదలు అయ్యింది. అయితే, గుడిలో సమంత రూపమే ఒక రేంజ్ ట్రోలింగ్ మెటీరియల్ అయ్యింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మహేష్ కోసం 'అరవింద...'లో బసిరెడ్డి కంటే భయంకరంగా జగపతిబాబు
'శ్రీమంతుడు' తర్వాత 'మహర్షి'లోనూ జగపతి బాబు (Jagapathi Babu) నటించారు. అయితే, ఆ సినిమాలో ఆయనది విలన్ క్యారెక్టర్. కార్పొరేట్ క్రిమినల్ రోల్ చేశారు. ఇప్పుడు మహేష్ బాబుతో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు. మహేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తెరకెక్కిస్తున్న తాజా సినిమా (SSMB 28)లో జగపతి బాబు కీలక పాత్ర చేస్తున్నారు. తన క్యారెక్టర్ గురించి ఆయన చెప్పిన మాటలు వింటే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ! త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనూ జగపతి బాబుది సూపర్ హిట్ కాంబినేషన్! 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంలో ప్రతినాయకుడు బసిరెడ్డి పాత్రలో నటించారు. పగ ప్రతీకారం కోసం కన్న కుమారుడి ప్రాణాలు తీసిన బసిరెడ్డి పాత్రలో జగపతి బాబు భయంకరమైన విలనిజం చూపించారు. ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం దాన్ని మించిన భయంకరమైన పాత్రను త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రియేట్ చేశారని ఆయన చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు - 'ఏజెంట్' ట్రోల్స్‌పై స్పందించిన అమల
యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్' సినిమా నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. భారీ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది. ఇది ఎన్నో అంచనాలు పెట్టుకున్న అక్కినేని అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ తల్లి అమల తాజాగా దీనిపై స్పందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నానితో శ్రుతీ హాసన్ - మెయిన్ హీరోయిన్ కాదు కానీ...
తెలుగులో శృతి హాసన్ (Shruti Hassan) కొత్త సినిమాకు సంతకం చేశారు. ఆమె సంతకం చేయడమే కాదు... చిత్రీకరణ కూడా స్టార్ట్ చేశారు. నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా, 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయికగా ఓ సినిమా రూపొందుతోంది. హీరోగా నాని 30వ సినిమా (Nani 30 Movie) ఇది. ఇందులో శ్రుతీ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే... ఆమె మెయిన్ హీరోయిన్ కాదని, కీలక పాత్ర చేస్తున్నారని తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సిస్టర్ సెంటిమెంట్ 'బిచ్చగాడు 2'లో కోర్టు కేసు ఏమిటి? - ట్రైలర్ చూశారా?
తనదైన మార్క్ చిత్రాలతో సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోని. 2016లో తమిళంలో ‘పిచ్చైక్కరన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్, సంచలన విజయాన్ని అందుకున్నారు. సినీ చరిత్రలో ఎవరూ చేయని సాహసంతో మెప్పించాడు. ఇదే మూవీని తెలుగులో ‘బిచ్చగాడు’ టైటిల్‌తో విడుదల చేశాడు. ఆ టైటిల్ చూసి మొదట్లో అంతా ఇదేం పేరు అనుకున్నారు. కానీ, సినిమా చూసిన ప్రతి ఒక్కరు విజయ్ నటనకు ఫిదా అయ్యారు. ఆయనను మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ గా‘బిచ్చగాడు-2’ వస్తోంది. మే 19న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి