News
News
వీడియోలు ఆటలు
X

Shruti Hassan In Nani 30 : నానితో శ్రుతీ హాసన్ - మెయిన్ హీరోయిన్ కాదు కానీ... 

సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో సీనియర్ హీరోలతో నటించిన శ్రుతీ హాసన్... ఇప్పుడు యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుని వెళుతున్నారు.

FOLLOW US: 
Share:

తెలుగులో శృతి హాసన్ (Shruti Hassan) కొత్త సినిమాకు సంతకం చేశారు. ఆమె సంతకం చేయడమే కాదు... చిత్రీకరణ కూడా స్టార్ట్ చేశారు. అయితే... అందులో ఆమె మెయిన్ హీరోయిన్ కాదని, కీలక పాత్ర చేస్తున్నారని తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే... 

నానితో శ్రుతీ హాసన్
నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా, 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయికగా ఓ సినిమా రూపొందుతోంది. హీరోగా నాని 30వ సినిమా (Nani 30 Movie) ఇది. ఇందులో శ్రుతీ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పుడు నాని 30 సినిమా షూటింగ్ జరుగుతోంది. అందులో శ్రుతీ హాసన్ కూడా జాయిన్ అయ్యారు. ఈ రోజు ఆమె ఫస్ట్ డే షూటింగ్ అని తెలిసింది. ఇప్పటి వరకు నాని, శృతీ హాసన్ ఒక్క సినిమా కూడా చేయలేదు. వాళ్ళ కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ ఇది.

Also Read గుడి ఓకే, అందులో సమంత ఎక్కడ? - ట్రోల్స్ చూస్తే నవ్వు ఆగదు!

డిసెంబర్ 21న నాని 30వ సినిమా
నాని 30వ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతునున్నారు. దీనిని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు అనౌన్స్ చేశారు. డిసెంబర్ 22 శుక్రవారం వచ్చింది. వీకెండ్ ఎలాగో ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. డిసెంబర్ 25, సోమవారం క్రిస్మస్ హాలిడే. ఆ రోజు కూడా థియేటర్ల దగ్గర సందడి ఉంది. నాని సినిమా గురువారం విడుదల కానుంది కనుక లాంగ్ వీకెండ్ (ఐదు రోజులు) మంచి వసూళ్ళు వచ్చే అవకాశం ఉంది. అయితే... నానికి ఇదేమీ సోలో రిలీజ్ కాదు. పోటీలో 'సైంధవ్' సినిమా కూడా ఉంది. 

వెంకటేష్ 'సైంధవ్' డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు తెలిపారు. అది యాక్షన్ ఎంటర్టైనర్ కావడం, 'హిట్' విజయాల తర్వాత యువ దర్శకుడు శైలేష్ కొలను తీస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అసలు మ్యాటర్ ఏంటంటే... ఆ సినిమాలో నాని గెస్ట్ రోల్ చేస్తున్నారని సమాచారం.

Also Read మహేష్ కోసం 'అరవింద...'లో బసిరెడ్డి కంటే భయంకరంగా - జగపతి బాబు

విచిత్రం ఏమిటంటే... నానికి జోడీగా 'జెర్సీ'లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఉన్నారుగా! ఆమె వెంకటేష్ 'సైంధవ్'లో నటిస్తున్నారు. ఇంతకు ముందు ఓ సినిమాతో వచ్చిన హీరో హీరోయిన్లు, ఇప్పుడు వేర్వేరు సినిమాలతో రానున్నారు. 

జెర్సీ, శ్యామ్ సింగ రాయ్ తర్వాత...
డాటర్ సెంటిమెంట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఆల్రెడీ విడుదల చేసిన వీడియోస్ చూస్తే అది తెలుస్తుంది. నాని 30 చిత్రానికి సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహకుడు. నానితో ఆయనకు మూడో చిత్రమిది. 'జెర్సీ', 'శ్యామ్‌ సింగ రాయ్' చిత్రాలకూ ఆయన పని చేశారు. ఆ రెండు సినిమాల్లో సినిమాటోగ్రఫీ వర్క్ బావుందని పేరు వచ్చింది. ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Published at : 29 Apr 2023 03:53 PM (IST) Tags: Shruti Haasan Mrunal Thakur Nani Nani 30 Movie

సంబంధిత కథనాలు

మే నెలలో డబ్బింగ్ సినిమాలదే హవా - ఈ మూవీస్‌కు పాజిటీవ్ రెస్పాన్స్!

మే నెలలో డబ్బింగ్ సినిమాలదే హవా - ఈ మూవీస్‌కు పాజిటీవ్ రెస్పాన్స్!

Mentoo Movie: ఓటీటీలోకి ‘మెన్ టూ’ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mentoo Movie: ఓటీటీలోకి ‘మెన్ టూ’ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అవికా గోర్ '1920 హారర్ ఆఫ్ ది హార్ట్' ట్రైలర్ చూశారా - వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!

అవికా గోర్ '1920 హారర్ ఆఫ్ ది హార్ట్' ట్రైలర్ చూశారా - వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!

ఆ ఐదేళ్లు నేను చెన్నైవాడిని కాదని చెప్పుకోవడమే సరిపోయేది: రానా

ఆ ఐదేళ్లు నేను చెన్నైవాడిని కాదని చెప్పుకోవడమే సరిపోయేది: రానా

వచ్చేస్తోంది తమన్నా కొత్త వెబ్ సీరిస్ - స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే!

వచ్చేస్తోంది తమన్నా కొత్త వెబ్ సీరిస్ - స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే!

టాప్ స్టోరీస్

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు