Tollywood News Today : మహేష్ మాస్ స్టిల్, విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్, 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ బిజినెస్ - నేటి టాప్ సినీ విశేషాలివీ
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత లోయస్ట్ ప్రీ రిలీజ్ రికార్డ్ 'భోళా శంకర్'దే - బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'భోళా శంకర్' (Bholaa Shankar Movie). సంక్రాంతి హిట్ 'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరు నుంచి వస్తున్న చిత్రమిది. అందుకని, అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఆ సినిమా స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. బహుశా, సంక్రాంతి సీజన్ కాకపోవడం ఒక కారణమైతే, తమిళంలో అజిత్ హీరోగా దర్శకుడు శివ తీసిన 'వేదాళం' రీమేక్ కావడం మరో కారణం ఏమో!? అసలు, 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది? బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత కలెక్ట్ చేయాలి? వంటి వివరాల్లోకి వెళితే... (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి)
త్వరలో విజయ్ దేవరకొండ పెళ్లి - 'ఖుషి' ట్రైలర్ లాంచ్‌లో రౌడీ బాయ్ ఏం చెప్పారంటే?
పెళ్లి ఎప్పుడు? జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కచ్చితంగా ఎదురు అయ్యే ప్రశ్న! అందులోనూ అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోలు తప్పకుండా ఈ ప్రశ్న ఎదుర్కోవాలి. రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వంటి కథానాయకుడికి పెళ్లి, భార్య భర్తల మధ్య వైవాహిక సంబంధం నేపథ్యంలో సినిమా చేసినప్పుడు ఆ ప్రశ్న లేకుండా ఎలా ఉంటుంది? 'పెళ్లి అంటే మీ మనసులో ముందు ఏం గుర్తుకు వస్తుంది?' అని 'ఖుషి' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో విజయ్ దేవరకొండకు ఓ ప్రశ్న ఎదురైంది (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి).
నయా లుక్‌తో తారక్ మెస్మరైజ్ - నెట్టింట్లో ఫోటో వైరల్
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. అద్భుత నటనతో టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేస్తున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నయా లుక్ తో అభిమానులను అరించారు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ దగ్గర తన జుట్టుకు కొత్త హంగులు అద్దుకున్నారు (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి).
‘డాన్ 3’లో హీరోగా రణవీర్ కన్ఫర్మ్, మరింత ఆగ్రహంలో షారుఖ్ ఫ్యాన్స్
ఫ్రాంచైజ్ సినిమాలకు హాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉండేది. అందుకే బాలీవుడ్ కూడా అదే తరహాలో ఫ్రాంచైజ్ చిత్రాలు తెరకెక్కించడం మొదలుపెట్టింది. కానీ ఇలాంటి చిత్రాలను ఒకే దర్శకుడు, ఒకే నటుడితో చేయడం అనేది ఎప్పుడూ సాధ్యం కాదు. ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే ఫ్రాంచైజ్‌లను ముందుకు తీసుకెళ్లాలంటే ఒక్కొక్కసారి దర్శకుడు, నటుడు.. ఇలా ఎవరైనా మారుతూ ఉండవచ్చు. తాజాగా బాలీవుడ్‌లో ‘డాన్’ ఫ్రాంచైజ్ విషయంలో కూడా అదే జరిగింది. షారుఖ్ ఖాన్ స్థానంలోకి రణవీర్ సింగ్ డాన్‌గా వస్తాడని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ప్రేక్షకుల అయోమయానికి చెక్ పెడుతూ ‘డాన్ 3’ మేకర్స్.. టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో ‘డాన్’గా రణవీర్ సింగ్ ప్రేక్షకులను పలకరించాడు. అంతే కాకుండా దర్శకుడు ఫర్హాన్ అక్తర్.. షారుఖ్ ఫ్యాన్స్‌ను కాస్త తృప్తిపరచడం కోసం స్పెషల్ నోట్ కూడా విడుదల చేశాడు (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి).
మహేష్ బాబు బర్త్‌డే గిఫ్ట్ - 'గుంటూరు కారం' నుంచి మరో మాస్ స్టిల్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఘట్టమనేని (Mahesh Babu) హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'గుంటూరు కారం' (Guntur Kaaram Movie). గురూజీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ రోజు మహేష్ బాబు పుట్టిన రోజు (mahesh Babu Birthday) సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. సూపర్ స్టార్ అభిమానులు 'గుంటూరు కారం' చిత్ర బృందం ఓ కానుక అందించింది. సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసింది (పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి).
View this post on Instagram
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial