Jr NTR Latest Look: నయా లుక్‌తో తారక్ మెస్మరైజ్ - నెట్టింట్లో ఫోటో వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నయా లుక్ తో కనిపించాడు. హెయిర్ స్టైలిష్ ఆలీమ్ హకీమ్ దగ్గర తన జుట్టుకు కొత్త మెరుగులు అద్దుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
![Jr NTR Latest Look: నయా లుక్‌తో తారక్ మెస్మరైజ్ - నెట్టింట్లో ఫోటో వైరల్ Jr ntr latest look with new hair style photo goes viral in social media Jr NTR Latest Look: నయా లుక్‌తో తారక్ మెస్మరైజ్ - నెట్టింట్లో ఫోటో వైరల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/09/b61a142fdff0a89912471333302fdc271691572582849544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. అద్భుత నటనతో టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేస్తున్నారు.
సరికొత్త లుక్ లో జూనియర్ ఎన్టీఆర్
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నయా లుక్ తో అభిమానులను అరించారు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ దగ్గర తన జుట్టుకు కొత్త హంగులు అద్దుకున్నారు. హెయిర్ స్టైల్ తో పాటు గడ్డానికి మెరుగులు దిద్దించుకున్నారు. నల్లటి కళ్లజోడు పెట్టుకుని దిగిన ఈ ఫోటోను హకీమ్ తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. “మ్యాన్ ఆఫ్ మాస్ కు హెయిర్ సెట్ చేయడం అద్భుతం అనిపించింది. షూటింగ్స్ లో ఎప్పుడూ సరదాగా ఉండటంతో పాటు హై ఆక్టేన్, పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉండటం నాకు చాలా నచ్చుతుంది” అని రాసుకొచ్చారు.
Had an amazing time yesterday doing hair for our Man Of Masses 👑 @tarak9999 🔥🔥🔥
— Aalim Hakim (@AalimHakim) August 9, 2023
🎥
It is always fun shooting with @jrntr .. I love his high-octane and positive energy 💥🔥❤️#NTRJr#manofmassesntr #ntrjr #actor #indianfimindustry #star #superstar #aalimhakim #hakimsaalim pic.twitter.com/QI0qlhTMuO
ఈ ఫోటో చూసి ఎన్టీఆర్ అభిమానులు వారెవ్వా అంటున్నారు. అతడి హెయిర్ స్టైల్, గడ్డం చాలా సూపర్ స్టైలిష్ గా ఉందని చెప్తున్నారు. నిజానికి ‘రాఖీ’ సినిమా తర్వాత తన బాడీని పూర్తి స్థాయిలో మార్చుకున్నారు ఎన్టీఆర్. అంతకు ముందు బొద్దుగా ఉండగా, ‘యమదొంగ’ మూవీ సమయంలో స్లిమ్ గా తయారయ్యారు. అప్పటి నుంచి తన బాడీని ఫిట్ గా మెయింటెయిన్ చేస్తున్నాడు. గత కొంతకాలంగా హెయిర్ స్టైల్ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ నయా లుక్ కొరటాల మూవీ కోసమేనని తెలుస్తోంది.
కొరటాల శివతో సినిమా చేస్తున్న ఎన్టీఆర్
ఇక ‘RRR’ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నారు. ఈ చిత్రంతో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మొదటిసారిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. తమిళ రాక్‌స్టార్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ‘దసరా’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన షైన్ టామ్ చాకో కూడా ‘దేవర’లో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘దేవర’.. 2024 ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఇప్పటికే కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ మాస్ ఎంటర్‌టైనర్‌గా అలరించింది. వీరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కూడా మంచి హిట్ అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. ‘దేవర’పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఆకట్టుకున్నాయి.
Read Also: మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు: రజినీ చెప్పిన ఆఖరి పంచ్ వైసీపీ నేతలకేనా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)