Mahesh Babu Birthday : మహేష్ బాబు బర్త్‌డే గిఫ్ట్ - 'గుంటూరు కారం' నుంచి మరో మాస్ స్టిల్
Guntur Kaaram Movie, Mahesh Bday Special Still : సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా సినిమా 'గుంటూరు కారం' నుంచి ఓ అప్డేట్ వచ్చేసింది.
![Mahesh Babu Birthday : మహేష్ బాబు బర్త్‌డే గిఫ్ట్ - 'గుంటూరు కారం' నుంచి మరో మాస్ స్టిల్ Mahesh Babu's new still from Guntur Kaaram released on his birthday Mahesh Babu Birthday : మహేష్ బాబు బర్త్‌డే గిఫ్ట్ - 'గుంటూరు కారం' నుంచి మరో మాస్ స్టిల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/09/ed7a01c1eac35555da24ba3b1e335f981691520099274313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సూపర్ స్టార్ మహేష్ బాబు ఘట్టమనేని (Mahesh Babu) హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'గుంటూరు కారం' (Guntur Kaaram Movie). గురూజీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ రోజు మహేష్ బాబు పుట్టిన రోజు (mahesh Babu Birthday) సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది.
మహేష్ బర్త్ డే గిఫ్ట్ ఏమిటంటే...
Guntur Kaaram New Poster : సూపర్ స్టార్ అభిమానులు 'గుంటూరు కారం' చిత్ర బృందం ఓ కానుక అందించింది. సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసింది. అది ఎలా ఉందో ఇక్కడ చూడండి.
ఇప్పటి వరకు విడుదలైన 'గుంటూరు కారం' స్టిల్స్, ఇప్పుడు విడుదలైన స్టిల్ చూశారా? ఒక్క కామన్ పాయింట్ ఉంది. అది ఏమిటంటే... మహేష్ బాబు నోటిలో బీడీ! మాస్ అప్పీల్ విషయంలో మహేష్ & త్రివిక్రమ్ అసలు వెనకడుగు వేయడం లేదు.
Also Read : రికార్డుల వేటకు రజనీ 'జైలర్' రెడీ - ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంత రావచ్చు?
View this post on Instagram
కల్ట్ క్లాసికల్ హిట్స్ 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. సుమారు 13 ఏళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు. అందుకని, ఘట్టమనేని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.
సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి...
Guntur Kaaram Release Date : సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో 'గుంటూరు కారం' సినిమా విడుదల కానుంది. ఆల్రెడీ విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది. మహేష్ బాబు చాలా రోజుల తర్వాత మాస్ అవతారంలో కనిపించడం కొత్తగా ఉంది. ముఖ్యంగా గళ్ళ షర్టు వేసి బీడీ కాలుస్తూ కారు నుంచి దిగే సన్నివేశం అయితే... హైలైట్ అసలు.
మహేష్ బాబు సరసన శ్రీ లీల, మీనాక్షీ చౌదరి!
'గుంటూరు కారం'లో మహేష్ సరసన యువ కథానాయికలు శ్రీ లీల, మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. సూపర్ స్టార్ సినిమా వాళ్ళిద్దరికీ తొలిసారి అవకాశం వచ్చింది. ఆ కారణంతో ఇద్దరూ ఆనందంతో ఉన్నారు.
Also Read : 'జైలర్' థియేట్రికల్ బిజినెస్ ఎంత? రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా?
నిజం చెప్పాలంటే... ఈ సినిమాలో మొదట హీరోయిన్ పూజా హెగ్డే. త్రివిక్రమ్ లాస్ట్ రెండు సినిమాలు 'అల వైకుంఠపురములో', 'అరవింద సమేత వీర రాఘవ'లో ఆమె నటించారు. 'గుంటూరు కారం' వాళ్ళ కలయికలో హ్యాట్రిక్ అవుతుందని అంతా భావించారు. అయితే... అనివార్య కారణాల హీరోయిన్ మార్పు జరిగింది. శ్రీ లీల మెయిన్ హీరోయిన్ కాగా... పూజా హెగ్డే తప్పుకొన్న తర్వాత రెండో కథానాయిక అవకాశం మీనాక్షీ చౌదరి తలుపు తట్టింది.
'గుంటూరు కారం' చిత్రానికి జాతీయ పురస్కార గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ కాగా... ఎఎస్ ప్రకాష్ కళా దర్శకునిగా, పిఎస్ వినోద్ ఛాయాగ్రాహకుడు పని చేస్తున్నారు. సంగీత సంచనలం, కొన్ని రోజులుగా త్రివిక్రమ్ సినిమాలకు అద్భుతమైన బాణీలు, నేపథ్య సంగీతం అందిస్తున్న ఎస్. తమన్ ఈ సినిమాకూ సంగీతం అందిస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)