శరత్‌బాబు మృతిపట్ల చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్ తదితర సినీ ప్రముఖుల సంతాపం
ప్రముఖ నటుడు శరత్ బాబు మరణంపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆయనకు నివాళులు అర్పించారు.

50 వసంతాల పాటు టాలీవుడ్‌లో దిగ్గజ నటుడిగా వెలుగొందిన శరత్ బాబు సోమవారం ఈ లోకాన్ని విడిచారు. తన తోటి కళాకారులు, అభిమానులు, బంధువులను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శరత్ బాబు గత కొద్ది రోజులుగా కిడ్నీస్ ఫెయిల్యూర్, బ్లడ్ ఇన్ఫెక్షన్‌తో బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం ఇటీవలే హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌కు తరలించారు. సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైన శరత్ బాబు 2 గంటల సమయంలో కన్ను మూశారు. శరత్ బాబు పార్థీవ శరీరాన్ని చెన్నైకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. శరత్ బాబు మరణంపై తెలుగు సినీ పరిశ్రమ, ఆయన అభిమానాలు దీగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఆయనతో కలిసి పనిచేయడం మరిచిపోలేని అనుభూతి: బాలకృష్ణ
శరత్ బాబు గారు విలక్షణమైన నటనతో చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా తనదైన ముద్ర వేశారు. శరత్ బాబు గారు క్రమశిక్షణ, అంకితభావం గల నటులు. ఆయనతో కలసి పని చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. శరత్ బాబు గారి మరణం పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. -నందమూరి బాలకృష్ణ
శరత్ బాబు వెండి తెర జమిందార్: చిరంజీవి
వెండితెర 'జమిందార్', ప్రముఖ నటుడు శరత్ బాబు గారి మరణ వార్త కలచివేసింది. అందం హుందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న శ్రీ శరత్ బాబు గారితో నాకు ఎంతో అనుబంధం వుంది. అనేక చిత్రాలలో ఆయన నా సహనటుడుగా ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులందరికీ నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి !
వెండితెర 'జమిందార్', ప్రముఖ నటుడు
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 22, 2023
శరత్ బాబు గారి మరణ వార్త కలచివేసింది.
అందం హుందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న
శ్రీ శరత్ బాబు గారితో నాకు ఎంతో అనుబంధం వుంది. అనేక చిత్రాలలో ఆయన నా సహనటుడుగా ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులకు,
అభిమానులందరికీ నా… pic.twitter.com/za0FpSyeJV
భారతీయ సినీ రంగం ఆయన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది: ఎన్టీఆర్
‘‘ప్రముఖ నటుడు శరత్ బాబు మరణ వార్త విని చాలా బాధపడ్డాను. భారతీయ సినీ రంగానికి ఆయన అందించిన కళా సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. శరత్ బాబు కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ - జూనియర్ ఎన్టీఆర్
Sad to hear about the passing of veteran actor Sarath Babu garu. His contributions to Indian cinema will be remembered forever. My heartfelt condolences go out to his family and friends. Om Shanti.
— Jr NTR (@tarak9999) May 22, 2023
ఆయన గొంతు. నటన గుర్తుండిపోతాయి: నాని
శరత్‌బాబు గారి గొంతు, ఆయన నటనలోని ఉనికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. థాంక్యూ సర్ - నాని
Sarath babu Gaaru’s voice, presence and warmth in his performances will always be cherished. Thank you sir 🙏🏼
— Nani (@NameisNani) May 22, 2023
ఆయన ఆప్యాయత, ప్రోత్సాహాన్ని మరిచిపోలేను: ప్రకాష్ రాజ్
‘‘ఎప్పుడూ నవ్వుతూ ఉండే శరత్‌బాబును కలుసుకోవడం చాలా అద్భుతంగా భావిస్తున్నా. నా కెరీర్‌లో ఆయన ఆప్యాయత, ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. శరత్‌బాబుకు ధన్యవాదాలు. RIP’’ - ప్రకాష్ రాజ్
Wonderful to have met this ever smiling soul.. will cherish his warmth and encouragement throughout my career.. thank you dearest #SarathBabu for everything . RIP 🙏🏿🙏🏿🙏🏿 pic.twitter.com/mSdmX8vN87
— Prakash Raj (@prakashraaj) May 22, 2023
విభిన్న భావోద్వేగాలు పలికించిన నటులు శరత్ బాబు: పవన్ కళ్యాణ్
విభిన్న భావోద్వేగాలు పలికించిన నటులు శ్రీ శరత్ బాబు గారు #PawanKalyan #RIPSarathBabu pic.twitter.com/SqOQeassmx
— Vamsi Kaka (@vamsikaka) May 22, 2023
#RIPSarathBabu garu 💔 pic.twitter.com/FPiX9Y9QQ6
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) May 22, 2023
Saddened about the passing away of Versatile Actor Sarath Babu Garu.
— Sai Dharam Tej (@IamSaiDharamTej) May 22, 2023
You'll be cherished forever with your work and immemorable contributions to the world of cinema.
May his soul rest in peace 🙏
Deepest condolences to family, friends and dear. pic.twitter.com/kTrLuiqVxu





















