Entertainment Top 5 Stories: దేవర ట్రైలర్‌లో ఎన్టీఆర్ నట విశ్వరూపం, కంగనాకు 'ఎమర్జెన్సీ' సినిమా కష్టాలు - నేటి సినిమా అప్‌డేట్స్
ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన జూనియర ఎన్టీఆర్ దేవర సినిమా ట్రైలర్ వచ్చేసింది. మరోవైపు ఎమర్జెన్సీ సినిమా కోసం కంగనా రనౌట్ తన బంగ్లాను సైతం అమ్మేసుకుంటున్నారు.
ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం... దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్
Devara Trailer | ప్రజెంట్ జనరేషన్ హీరోల్లో నటన, భాష మీద కమాండ్ ఉన్న అతి కొద్ది మందిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. పెర్ఫార్మన్స్ విషయంలో ఆయనకు పేరు పెట్టడానికి లేదు. సరైన క్యారెక్టర్ పడితే విజృంభిస్తారు. సిల్వర్ స్క్రీన్ మీద నట విశ్వరూపం చూపిస్తారు. ఆ విశ్వరూపానికి చిన్నపాటి ఉదాహరణ అన్నట్టు ఉంది 'దేవర' ట్రైలర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే... రోమాంచితం. 'దేవర' ట్రైలర్ చూస్తే అభిమానులకు గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
డైరెక్టుగా ఓటీటీలోకి శోభితా ధూళిపాళ సినిమా 'లవ్ సితార'... స్ట్రీమింగ్ ఎప్పుడు? రిలీజ్ ఎక్కడంటే?
ఈ మధ్యకాలంలో ఓటీటీ లవర్స్ పెరిగిపోయారు. ఓటీటీలో వచ్చిన ఏ సినిమానూ వదిలే ప్రసక్తే లేదన్నట్లుగా చూసేస్తున్నారు. దీంతో ఆ అదరణ చూసిన ఓటీటీ సంస్థలు కొత్త కొత్త, మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాయి. జీ 5 కూడా మంచి మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. దాంట్లో భాగంగా నాగ చైతన్యకు కాబోయే భార్య శోభితా ధూళిపాళ నటించిన 'లవ్ సితార'ను రిలీజ్ చేయనుంది జీ 5. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది. మరి స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అందుబాటులోకి ఉంటుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'ఎమర్జెన్సీ' సినిమా రిలీజ్ కష్టాలు... కాంట్రవర్షియల్ బంగ్లా అమ్మేసిన కంగనా రనౌత్?
బాలీవుడ్ వివాదాస్పద నటి, ఎంపీ కంగనా రనౌత్ ముంబైలోని బాంద్రాలో గల తన ఇంటిని అమ్మేశారట. 'ఎమర్జెన్సీ' సినిమా కోసం ఆమె ఈ పని చేసినట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలోని బాంద్రా పలీహిల్ లో ఉన్న తన ప్రాపర్టీని రూ. 32 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. ఆ బంగ్లాను కంగనా రనౌత్ 2017 సెప్టెంబర్ లో రూ. 20.7 కోట్లకు కొనుగోలు చేశారు. దాని మీద 2022 డిసెంబర్ లో లోన్ తీసుకున్నారు. ఆ తర్వాత తన ప్రొడక్షన్ హౌస్ ఆఫీసును ఆ బంగ్లాలోనే నిర్వహిస్తున్నారు కంగనా. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పెద్ద మనసు చాటుకున్న తమిళ హీరో శింబు... తెలుగు రాష్ట్రాల వదర బాధితులకు సాయం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాలను వరదలు అతలాకుతలం చేశాయి. విజయవాడ, ఖమ్మం తదితర ప్రాంతాలను బుడమేరు వాగు ముంచేసింది. దీంతో విజయవాడలోని సింగ్ నగర్, తెలంగాణలోని ఖమ్మం తదితర ప్రాంతాల్లో ప్రజల ఇళ్లలోకి నీళ్లు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో వాళ్లను ఆదుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇక వరద బాధితుల కోసం చాలామంది తమ ఆపన్న హస్తం అందిస్తున్నారు. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి విరాళాలు అందజేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో కాజల్... రష్మికతో పాటు చందమామ కూడా!
హిందీ సినిమా ఇండస్ట్రీలో రీ ఎంట్రీకి క్వీన్ ఆఫ్ మాసెస్, తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) రెడీ అయ్యారని ముంబై టాక్. ఆవిడ హిందీ సినిమా చేసే ఆల్మోస్ట్ 8 ఏళ్లు అవుతోంది. సౌత్ సినిమాలు డబ్బింగ్ అయ్యి నార్త్ ఇండియాకు వెళ్లడం తప్ప... బాలీవుడ్ కంటే టాలీవుడ్, కోలీవుడ్ అవకాశాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇప్పుడు కాజల్ ఓ హిందీ సినిమాకు సంతకం చేశారని, బాలీవుడ్ బడా హీరోతో నటించే అవకాశం అందుకున్నారని టాక్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి