Akaay and Vamika: వామిక, అకాయ్ - అనుష్క, విరాట్ పిల్లల పేర్లకు అర్థం తెలుసా?
Akaay and Vamika: అనుష్క, విరాట్ కోహ్లీలకు ఇప్పటికీ వామిక అనే పాప ఉండగా.. ఇటీవల ఒక బాబు కూడా పుట్టాడు. తనకు అకాయ్ అని పేరు పెట్టారు. దీంతో అకాయ్ అంటే ఏంటో తెలుసుకోవాలని ఫ్యాన్స్ ప్రయత్నిస్తున్నారు.
Akaay and Vamika Meaning: అటు క్రికెట్ వరల్డ్‌లో, ఇటు బాలీవుడ్‌లో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. 2017 డిసెంబర్‌లో అనుష్క, విరాట్ పెళ్లితో ఒక్కటయ్యారు. అప్పట్లో వీరి పెళ్లి బాలీవుడ్‌లో ఒక సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. పెళ్లి తర్వాత అనుష్క శర్మ సినిమాల్లో యాక్టివ్‌గా ఉండడం మానేసింది. ఫోటోషూట్స్, ఇంటర్వ్యూలు లాంటివి చేసినా సినిమాలకు మాత్రం దూరంగానే ఉంది. ఇక 2021లో వీరిద్దరికీ వామిక జన్మించింది. ఇప్పటికీ వామిక ఫేస్‌ను అనుష్క, విరాట్ రివీల్ చేయలేదు. ఇంతలోనే వీరికి మగబిడ్డ పుట్టినట్టు, తనకు అకాయ్ అని కూడా పేరు పెట్టినట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇంతకీ విరాట్, అనుష్కల పిల్లల పేర్లకు అర్థం ఏంటని ఫ్యాన్స్ గూగుల్ చేసేస్తున్నారు.
అకాయ్ అంటే..
ఫిబ్రవరీ 15న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు మగబిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని వారు కాస్త లేట్‌గా ప్రకటించారు. అంతే కాకుండా బాబుకు అకాయ్ అనే పేరు కూడా పెట్టినట్టు రివీల్ చేశారు. దీంతో అసలు అకాయ్ అంటే ఏంటి అని ఫ్యాన్స్ తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అకాయ్ అనే పేరుకు ఒక్కొక్క భాషలో ఒక్కొక్క అర్థం ఉన్నట్టు తెలుస్తోంది. అకాయ్ అంటే ఏకత్వం. అకాయ్ అనేది ఐక్యా అనే సంస్కృత పదం నుండి వచ్చింది. దీనికి ఏకత్వం, ఎదురులేనిది, అతీత శక్తి కలిగింది అని అర్థాలు వస్తాయి. ఇక హిందీలో అకాయ్ అనేది కాయా అనే పదం నుండి వచ్చింది. దీనికి శరీరం అని అర్థం వస్తుంది. ఇక ఒరిజినల్‌గా అయితే అకాయ్ అనే పదం టర్కీ భాష నుండి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి నిండు చంద్రుడు అని కూడా అర్థం వస్తుందట.
వామిక అంటే..
అకాయ్ లాగానే వామిక పేరుకు కూడా అర్థం ఏంటో మరోసారి సెర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్. వామిక అనేది సంస్కృత పదం అని తెలుస్తోంది. అంటే దుర్గా దేవి అని అర్థం. దుర్గా దేవికి ఉన్న అవతారాల్లో వామిక కూడా ఒకటి. అంతే కాకుండా వామిక అంటే సురక్షణ, బలం, తల్లి ప్రేమ, క్రియేటివిటీ.. ఇలా ఎన్నో అర్థాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా వామ అనే పదానికి క్రియేటివిటీ అని అర్థం వస్తుంది. ఇక వామిక అంటే ఎక్కువగా ఆధ్యాత్మికం అనే అర్థమే వస్తుంది. వామిక పుట్టినప్పుడు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక అకాయ్ పుట్టిన తర్వాత వారి సంతోషం మరింత రెట్టింపు అయ్యింది.
ఎన్నో ఫ్యాన్ పేజీలు..
విరాట్ కోహ్లీని తన ఫ్యాన్స్ ముద్దుగా క్రికెట్‌లో కింగ్ అని పిలుచుకుంటారు. ఇప్పుడు అకాయ్‌ను కింగ్ కొడుకు అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. అంతే కాకుండా అకాయ్ పుట్టినట్టు అనౌన్స్‌మెంట్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే తన పేరు మీద ఎన్నో ఫ్యాన్ పేజీలు కూడా క్రియేట్ అయ్యాయి. మీమ్స్, రీల్స్ వైరల్ అయ్యాయి. వామిక ఫేస్‌నే ఇంకా రివీల్ చేయని విరాట్, అనుష్క.. ఇప్పుడు అకాయ్ ఫేస్‌ను రివీల్ చేయడానికి ఇంకా ఎంత సమయం తీసుకుంటారో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీని కారణంగానే విరాట్ తనకు ఇష్టమైన టెస్ట్ సిరీస్‌లకు కూడా దూరంగా ఉన్నాడని గుర్తుచేసుకుంటున్నారు.
Also Read: అమ్మాయిలు తెలివితక్కువవారు, డేటింగ్‌లో అలా అస్సలు చేయకూడదు - జయా బచ్చన్