అన్వేషించండి

Jaya Bachchan: అమ్మాయిలు తెలివితక్కువవారు, డేటింగ్‌లో అలా అస్సలు చేయకూడదు - జయా బచ్చన్

Jaya Bachchan: ఎప్పటికప్పుడు ఏదో ఒక కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు జయా బచ్చన్. తాజాగా అమ్మాయిలు తెలివితక్కువవారు అంటూ ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్ వైరల్ అవుతోంది.

Jaya Bachchan: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్‌ కూడా ఆమె ప్రవర్తన ద్వారా, చేసే కామెంట్స్ ద్వారా నిరంతరం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మోడర్న్ కల్చర్‌పై జయా చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. జయా బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా.. ఇటీవల ‘ది ఆర్చీస్’ అనే నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ ఫిల్మ్‌తో నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ దానికంటే ముందే ‘వాట్ ది హెల్ నవ్య’ అనే పోడ్కాస్ట్‌తో ఫ్యాన్స్‌కు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలపెట్టింది. ఇప్పటికే ఈ పోడ్కాస్ట్‌లో మొదటి సీజన్ పూర్తవ్వగా రెండో సీజన్‌లోని మొదటి ఎపిసోడ్ కోసం బచ్చన్ ఫ్యామిలీ లేడీస్‌ను ఆహ్వానించింది.

కాలంతో పాటు మారుతున్నారు..

జయా బచ్చన్, శ్వేతా బచ్చన్, నవ్య.. ఈ ముగ్గురు కలిసి ‘వాట్ ది హెల్ నవ్య’ పోడ్కాస్ట్ కోసం కలవడం ఫ్యాన్స్‌లో ఆసక్తి కలిగించింది. ముఖ్యంగా ఈ పోడ్కాస్ట్‌లో మోడర్న్ వరల్డ్‌లో ఆడవారిని ఎదురవుతున్న సమస్యల గురించి, పరిస్థితుల గురించి వీరు మాట్లాడారు. ఈ ముగ్గురితో పాటు నవ్య సోదరుడు అగస్త్య కూడా ఈ పోడ్కాస్ట్‌లో పాల్గొన్నాడు. తను కూడా మగవారు కాలంతో పాటు ఎలా మారుతున్నారో చెప్పుకొచ్చాడు. అలా డేట్‌‌కు వెళ్లినప్పుడు బిల్ ఎవరు కట్టాలి అనే విషయంపై వారి చర్చ మొదలయ్యింది. దీనిపై జయా బచ్చన్ తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. మగవారే బిల్ కట్టాలి అని ఎప్పటినుండో వస్తున్న రూల్ గురించి ఆమె మాట్లాడారు.

అది మంచితనం మాత్రమే..

‘‘ఫెమినిజం అనేది వచ్చిన తర్వాత ఆడవారు మరింత ధృడంగా మారారు. అందుకే చాలా పనులు ఎవరి సాయం లేకుండా చేయాలనుకుంటున్నారు. ఉదాహరణకు ఎవరైనా అమ్మాయిని డేట్‌కు తీసుకెళ్లి అబ్బాయే బిల్ కట్టాలి అనుకుంటే అది వారికి నచ్చడం లేదు. వారు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే వారు కూడా సమానమే అనుకుంటున్నారు’’ అంటూ నవ్య నవేలి చెప్తుండగానే.. జయా బచ్చన్ మధ్యలో జోక్యం చేసుకొని ‘‘ఈ అమ్మాయిలు అసలు ఎంత తెలివి తక్కువవారు. అబ్బాయిలను బిల్ కట్టనివ్వాలి’’ అని తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక అబ్బాయిలు బిల్ కడతామని చెప్పడంలో తప్పు లేదని, మంచితనంతో మాత్రమే అలా అంటారు కానీ వారు గొప్ప, మీరు తక్కువ అనే ఉద్దేశ్యంతో అలా ఆఫర్ చేయరు అని అగస్త్య తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

అలా చేయడమే బెటర్..

ఇక మునుపటి రోజులతో పోలిస్తే మగవారిలో ఎలాంటి మార్పులు వచ్చాయో శ్వేతా బచ్చన్ తెలిపింది. ‘‘మగవారు బలంగా ఉండాలి, సైలెంట్‌గా ఉండాలి అనే ముఢనమ్మకం ఉండేది. డేటింగ్ చేస్తున్నప్పుడు కూడా ముందు అబ్బాయే వచ్చి ప్రపోజ్ చేయాలి అని ఉండేది. నాకు అది నచ్చేది. అబ్బాయి ప్రపోజ్ చేయడమే చాలావరకు బెటర్’’ అని చెప్పింది. ఇలా నవ్య నవేలి కొత్త పోడ్కాస్ట్‌లో బచ్చన్ ఫ్యామిలీ లేడీస్‌తో పాటు అగస్త్య కూడా మోడర్న్ కల్చర్‌పై తమ తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ఇక ‘వాట్ ది హెల్ నవ్య’ పోడ్కాస్ట్ విషయానికొస్తే.. 2002లో ముందుగా తన యూట్యూబ్ ఛానెల్‌లో దీనిని ప్రారంభించింది నవ్య నవేలి. మెల్లగా దీనికి సోషల్ మీడియాలో పాపులారిటీ లభించింది.

Also Read: కల్కీ మూవీ మళ్లీ వాయిదా? - ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన టీం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget