The Sabarmati Report Trailer: 'ది సబర్మతి రిపోర్ట్' ట్రైలర్ వచ్చేసింది - పవర్ ఫుల్ యాక్టింగ్‌తో అదరగొట్టిన విక్రాంత్, రాశీ ఖన్నా
ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న'ది సబర్మతి రిపోర్ట్' ట్రైలర్ విడుదలైంది. రాశిఖన్నా, విక్రాంత్ మస్సే పవర్ ఫుల్ యాక్టింగ్ ఆకట్టుకుంది. వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెంచింది.

The Sabarmati Report Trailer: ‘12th ఫెయిల్’ సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాస్సే మరో సెన్సేషనల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో ‘ది సబర్మతి రిపోర్ట్’ అనే సినిమా తెరకెక్కుతోంది. రాశీ ఖన్నా, రిద్ధి డోగ్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోద్రా రైలు దహనం, గుజరాత్ అల్లర్ల ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నారు. రంజన్ చందేల్ దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూపొందుతోంది. ఇటీవలే విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మాంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా
'ది సబర్మతి రిపోర్ట్' ట్రైలర్ ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచింది. 2002 ఫిబ్రవరి 27న పొద్దున్నే గోద్రాలో జరిగిన సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలు దహన ఘటనను కళ్లకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. ఈ సినిమాలో విక్రాంత్ వీడియో జర్నలిస్టుగా కనిపించారు. గ్రౌండ్ లెవెల్ లో జరిగిన పరిస్థితులకు పూర్తి భిన్నంగా వార్తలు ప్రసారం చేయడంపై ఆయన యాజమాన్యాన్ని నిలదీసినట్లు ఈ ట్రైలర్ లో చూపించారు. తాను పని చేసే సంస్థలోని వార్తల్లో వాస్తవాలు లేకపోవడంపై కోపంతో, అసలు వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు ఏం చేశారనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ చివర్లో రైలుపై దాడి చేయడం, నిప్పు అంటించడం వాస్తవ ఘటనలు ప్రతిబింబించేలా ఉన్నాయి. ఈ సన్నివేశాలు సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఈ సినిమాలో నటీనటులు అద్భుతంగా తమ పాత్రలను పోషించినట్లు కనిపిస్తోంది. విక్రాంత్ మస్సే, రాశీ ఖన్నా, రిద్ధి డోగ్రా సూపర్ యాక్టింగ్ తో అదరగొట్టేశారు. విక్రాంత్ గత సినిమా ‘12th ఫెయిల్’తో పోల్చితే ఈ సినిమాలో అద్భుతంగా నటించాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
View this post on Instagram
నవంబర్ 15న థియేటర్లలోకి ‘ది సబర్మతి రిపోర్ట్'మూవీ
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోద్రా అల్లర్ల ఘటనలను బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్న ఈ సినిమా నవంబర్ 15, 2024న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచే ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే, వాస్తవ సంఘటనలు, వివాదాలపై ఇప్పటి వరకు తెరకెక్కిన చాలా సినిమాలు అనేక వివాదాలకు కారణం అయ్యాయి. ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’ లాంటి సినిమాలు రాజకీయంగా దుమారం రేపాయి. అయితే, ‘ది సబర్మతి రిపోర్ట్'మూవీ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఇక 'ది సబర్మతి రిపోర్ట్'తో పాటు రాశి ఖన్నా, విక్రాంత్ మస్సే 'తలాఖోన్ మే ఏక్' లోనూ కలిసి నటిస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ‘తెలుసు కదా’ అనే సినిమా కూడా చేస్తోంది.
Read Also: కమల్ హాసన్ బర్త్ డే గిఫ్ట్... ‘థగ్ లైఫ్’ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన మేకర్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

