బాలీవుడ్‌లోకి 'ఘాజీ' డైరెక్టర్ ఎంట్రీ - ఉత్కంఠభరితంగా ‘IB 71’ ట్రైలర్
'ఘాజీ' డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి 'IB 71' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. విద్యుత్ జమ్వాల్ హీరోగా తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ మే 12న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను లాంచ్ చేసారు.
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో సంకల్ప్ రెడ్డి ఒకరు. 'ఘాజీ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంకల్ప్.. ఇండియాస్ ఫస్ట్ సబ్ మెరైన్ సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసాడు. ఇండో-పాక్ మధ్య జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించిన ఈ అండర్ వాటర్ వార్ బేస్డ్ మూవీతో నేషనల్ అవార్డ్ అందుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రూపొందించిన 'అంతరిక్షం 9000 KMPH' సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ.. లిమిటెడ్ బడ్జెట్ తో హై క్వాలిటీ సినిమా తీయగల దర్శకుడని అనిపించుకున్నాడు. ఈ క్రమంలో 'పిట్ట కథలు' అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్.. ఇప్పుడు ‘IB 71’ అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు.
'ఐబీ 71' సినిమాలో బాలీవుడ్స్ యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్ హీరోగా నటిస్తున్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సమ్మర్ స్పెషల్ గా మే 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సినిమా ట్రైలర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసారు.
1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో భారతదేశం విజయం వెనుక ఉన్న సీక్రెట్ మిషన్ ఆధారంగా ‘IB 71’ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. ఇందులో విద్యుత్ జమ్వాల్ ఒక ఇండియన్ ఎయిర్ పోర్స్ ఆఫీసర్ గా నటించాడు. పాకిస్తాన్ , చైనాలు కలిసి మన దేశంపై ప్లాన్ చేసిన దాడిని నిరోధించడానికి ఏజెంట్లు ఏం చేసారు? శత్రువులను ఎలా మట్టుబెట్టారు? అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, విశాల్ జెత్వా తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.
'IB 71' అనేది భారతదేశపు మోస్ట్ కాన్ఫిడెన్షియల్ మిషన్ అని చిత్ర బృందం చెప్పింది. ''30 మంది ఏజెంట్స్.. 10 రోజులు.. 50 ఏళ్లుగా ఇండియన్ హిస్టరీలో దాగి ఉన్న ఒక అత్యంత రహస్య మిషన్ ఇది. 1971 ఇండో-పాక్ యుద్ధంలో మనల్ని గెలిపించేలా చేసిన అపురూపమైన నిజమైన స్టోరీని చూడండి. ఇది ఒక దేశభక్తి స్పై థ్రిల్లర్. IB ఏజెంట్ దేవ్ జమ్‌వాల్ (విద్యుత్ జమ్‌వాల్) దేశాన్ని రక్షించడానికి సీక్రెట్ మిషన్ లో ఉన్న వాస్తవ సంఘటనల ఆధారంగా చెప్పబడిన కథ'' అని పేర్కొన్నారు.
ఇప్పటి వరకూ అద్భుతమైన యాక్షన్ విన్యాసాలతో అలరించిన విద్యుత్ జమ్‌వాల్.. ఈసారి మాత్రం సీట్ ఎడ్జ్ స్పై థ్రిల్లర్ తో ఆకట్టుకోబోతున్నాడని ట్రైలర్ లో తెలుస్తోంది. 1971 నాటి పరిస్థితులకి తగ్గట్లుగా చేసిన ప్రొడక్షన్ డిజైన్ ఆకట్టుకుంది. జ్ఞాన శేఖర్ V.S. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ.. ప్రశాంత్ ఆర్ విహారి బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 'ఘాజీ' సినిమా సముద్రంలోకి తీసుకెళ్లిన సంకల్ప్.. 'అంతరిక్షం 9000' సినిమాతో స్పేస్ లోకి తీసుకెళ్లాడు. ఇప్పుడు ఆకాశంలో తనదైన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.
ఇకపోతే ‘IB 71’ సినిమాతో విద్యుత్ జమ్‌వాల్ ప్రొడ్యూసర్ గా మారుతున్నాడు. యాక్షన్ హీరో ఫిల్మ్స్ అనే బ్యానర్ ను స్థాపించిన బాలీవుడ్ హీరో.. T-సిరీస్ ఫిల్మ్స్ & రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో భూషణ్ కుమార్, అబ్బాస్ సయ్యద్ లతో కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథ అందించిన ఆదిత్య శాస్త్రితో పాటుగా ఆదిత్య చౌక్సే, శివ చననా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Also Read : ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా - 'మంగళవారం'లో పాయల్ బోల్డ్ లుక్