ENE REPEAT: 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ - టైటిల్ ఫిక్స్... స్పెషల్ వీడియో అదుర్స్
ENE REPEAT Motion Poster: యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.

ENE REPEAT Motion Poster Released: 2018లో వచ్చిన యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఈ నగరానికి ఏమైంది'. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ రీ రిలీజ్‌లోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ జోష్‌తో మూవీ టీం తాజాగా సీక్వెల్ అనౌన్స్ చేసింది. టైటిల్ సహా స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది.
ENE REPEAT
'ఈ నగరానికి ఏమైంది?' మూవీలో విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, వెంకటేశ్ కాకుమాను, అభినవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.సురేష్ బాబు మూవీని నిర్మించగా... తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు.
సీక్వెల్‌కు 'ENE REPEAT' అనే డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. 'బ్రో దిస్ ఈజ్ అవర్ వైబ్. బ్రో ఇది మళ్లీ వస్తుంది. మోస్ట్ ఐకానిక్ కన్యా రాశి గ్యాంగ్ ఈజ్ బ్యాక్' అంటూ సోషల్ మీడియా వేదికగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'ఏలిన నాటి శని వదిలిపోయింది. కన్యా రాశి టైం వచ్చింది.' అంటూ పేర్కొంది. మరోసారి కామెడీ ఎంటర్‌టైన్ చేయబోతున్నట్లు ఈ వీడియో బట్టి అర్థమవుతోంది.
From:
— ENE Repeat (@ENERepeat) June 29, 2025
Bro this is our vibe
To:
Bro it’s happening again 😭
The Most iconic Kanya Raasi gang is BACK ❤️#ENERepeat #ENE pic.twitter.com/VXj4kDrMEu
Also Read: టాప్ ప్లేస్‌లో 'మురుగ' బుక్ - మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మ్యాజిక్... రైటర్ రియాక్షన్ ఇదే
యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'ఈ నగరానికి ఏమైంది?' అప్పట్లో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. చాలా మందికి కల్ట్ క్లాసిక్‌గా మారింది. ఇప్పుడు సీక్వెల్‌లోనూ అదే జోష్, అదే కామెడీతో ఎంటర్‌టైన్ చేయనున్నారు. అందుకే 'ENE REPEAT' అంటూ డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. 'ఈNఈ' అంటూ ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి లోగో క్రియేట్ చేశారు మేకర్స్. దీంతో హైప్ క్రియేట్ అవుతోంది. 'ఏలినాటి శని అయిపోయింది. కన్యా రాశి టైం వచ్చింది.' అంటూ ట్యాగ్ లైన్ ఇంట్రెస్ట్ పెంచేసింది. గాలిలో బ్రీఫ్ కేస్‌లో బట్టలు, బీర్ బాటిళ్లు, సన్ గ్లాసెస్, ఫ్లైట్ టికెట్ అన్నింటినీ కలిపి ఓ అడ్వెంచర్ టూర్‌లా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మూవీ టీం బిజీగా ఉంది. తారాగణం: విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను రచన & దర్శకత్వం: తరుణ్ భాస్కర్, నిర్మాతలు: డి. సురేష్ బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి, నిర్మాణ సంస్థలు: ఎస్ ఒరిజినల్స్ సురేష్ ప్రొడక్షన్స్, మ్యూజిక్: వివేక్ సాగర్ DOP: AJ ఆరోన్, కో డైరెక్టర్: ఉపేంద్ర వర్మ, ఎడిటర్: రవితేజ గిరిజాల.
నలుగురు మధ్య తరగతి యువకుల కథే 'ఈ నగరానికి ఏమైంది' స్టోరీ. స్నేహితులైన నలుగురికి కూడా వేర్వేరు లక్ష్యాలు ఉంటాయి. ఓ పార్టీలో ఫుల్‌గా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్తారు. అక్కడ వారికి ఎదురైన అనుభవాలు. ఆ తర్వాత వారికి ఏం జరిగింది? అనేదే మూవీ. దీనికి సీక్వెల్‌గా 'ENE REPEAT' తెరకెక్కుతోంది.





















