Thandel: సముద్రం మధ్యలో షూటింగ్ - ‘తండేల్’ టీమ్ సాహసం
Naga Chaitanya Akkineni: మత్స్యకారుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్న చిత్రమే ‘తండేల్’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి పలు ఆసక్తికర అప్డేట్స్ అందించారు మేకర్స్.
![Thandel: సముద్రం మధ్యలో షూటింగ్ - ‘తండేల్’ టీమ్ సాహసం Thandel shooting is in progress and makers release a special poster Thandel: సముద్రం మధ్యలో షూటింగ్ - ‘తండేల్’ టీమ్ సాహసం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/26/e453152fb934724e3b7ca8c799c25a9b1703575963634802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Thandel Movie: ఎంత పెద్ద స్టార్ హీరోలు అయినా.. డీ గ్లామర్ రోల్స్‌లో నటించడానికి, కొత్త కొత్త కథలను ఎంపిక చేసుకోవడానికి వెనకాడడం లేదు. అందుకే యంగ్ హీరోలు కూడా ఏ మాత్రం తగ్గేదే లే అన్నట్టుగా కథల ఎంపిక విషయంలో వారికి పోటీ ఇస్తున్నారు. అలాంటి యంగ్ హీరోలలో నాగచైతన్య కూడా ఒకరు. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న సినిమానే ‘తండేల్’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్స్‌ను త్వరలోనే అందిస్తామని చెప్పడానికి మేకర్స్ ముందుకొచ్చారు. అక్కినేని ఫ్యాన్స్ కోసం పలు షూటింగ్ అప్డేట్స్‌ను అందించారు.
మరోసారి హిట్ కాంబినేషన్
అక్కినేని హీరో నాగచైతన్య తన కెరీర్ ప్రారంభించినప్పటి నుండి ప్రేమకథలతోనే ఎక్కువగా హిట్స్ అందుకున్నాడు. కానీ అది సరిపోదని.. కమర్షియల్ సినిమాలతో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ మాస్ హీరోగా కూడా మారాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే చందూ మొండేటితో ‘తండేల్’ అనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ మూవీ కోసం సాయి పల్లవితో రెండోసారి జోడికడుతున్నాడు చైతూ. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘లవ్ స్టోరీ’లో నాగచైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. మరోసారి ‘తండేల్’తో కూడా ఈ జోడీ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేస్తుందని భావిస్తోంది మూవీ టీమ్.
పాత్ర కోసం హార్డ్ వర్క్
కొన్ని రోజుల క్రితం ఉడుపిలో షూటింగ్ ప్రారంభించుకుంది ‘తండేల్’. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ ప్రెజెంట్ చేయగా.. బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం మూవీ టీమ్ అంతా ఒక పెద్ద షెడ్యూల్‌లో పాల్గొంటోంది. అందులో పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సీక్వెన్స్‌ను సముద్రం మధ్యలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇక ‘తండేల్’పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచడానికి నాగచైతన్య పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ సినిమాలో కొత్తగా కనిపించడం కోసం నాగ చైతన్య ఎంతో కష్టపడ్డాడని చెప్తోంది. ‘తండేల్’లోని పాత్ర కోసం ఎంతో హార్డ్ వర్క్, హోమ్ వర్క్ చేశాడని ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమయిపోతోంది.
Team #Thandel begins an adrenaline pumping schedule in middle of the oceans 🌊
— Geetha Arts (@GeethaArts) December 26, 2023
Shoot in progress 🎥
Exciting updates soon 💥#Dhullakotteyala 🔥
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas @_riyazchowdary @Shamdatdop @NavinNooli… pic.twitter.com/dhLIBY8kyc
మత్స్యకారుల జీవితాల ఆధారంగా..
‘తండేల్’ అనేది నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుందని ఇప్పటికే మేకర్స్ రివీల్ చేశారు. ఇది మత్స్యకారుల జీవితాలకు సంబంధించిన కథ అని నేరుగా వెళ్లి కొందరు మత్స్యకారులతో మాట్లాడారు కూడా. ఇందులో కూడా నాగచైతన్య, సాయి పల్లవిల మధ్య ఒక అందమైన ప్రేమకథ ఉంటుందని, కానీ అది కాస్త వైవిధ్యంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఇప్పటికే ‘తండేల్’ నుండి విడుదలయిన నాగచైతన్య ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. షూటింగ్ అప్డేట్స్ ఇస్తూ తాజాగా విడుదల చేసిన పోస్టర్‌కు కూడా ఆడియన్స్ పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. వీటితో పాటు షూటింగ్ లొకేషన్ నుండి నాగచైతన్యకు సంబంధించిన మరో ఫోటో కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఇక ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ‘తండేల్’ షూటింగ్ స్పీడ్ చూస్తుంటే వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also Read: ‘బాహుబలి’ని దండగన్న ఆ సినీ విమర్శకుడు అరెస్ట్? కారణం సల్మాన్ ఖాన్ అట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)