Jana Nayagan : 'జన నాయగన్' మూవీ రిలీజ్ - అదే బాధగా ఉంది... దళపతి విజయ్ రియాక్షన్
Vijay Reaction : 'జన నాయగన్' మూవీ రిలీజ్‌కు సెన్సార్ సర్టఫికెట్ రాకపోవడంపై ఇళయ దళపతి విజయ్ రియాక్ట్ అయ్యారు. ఇది తాను ముందే ఊహించానని అన్నారు.

Vijay Reaction On Jana Nayagan Movie Release : ఇళయ దళపతి విజయ్ లాస్ట్ మూవీ 'జన నాయగన్' రిలీజ్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ తీర్పును మద్రాస్ హైకోర్టు రీసెంట్‌గా రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మూవీ రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై ఆయన రియాక్ట్ అయ్యారు.
'ఇది నేను ఊహించినదే'
పాలిటిక్స్ మీ సినిమా కెరీర్‌ను ప్రభావితం చేశాయా? అనే ప్రశ్నకు విజయ్ రియాక్ట్ అయ్యారు. తన రాజకీయ ప్రవేశం వల్ల 'జన నాయగన్' మూవీకి ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు. 'నా నిర్మాత పట్ల నాకు బాధగా ఉంది. నా పాలిటిక్స్ వల్ల నా మూవీస్ ఇంపాక్ట్ అవుతాయని నేను ఊహించాను. దానికి మానసికంగా నేను సిద్ధంగానే ఉన్నాను. దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగాను. ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమేమీ కాదు. ఓ స్పష్టమైన లక్ష్యంతోనే పాలిటిక్స్‌లోకి వచ్చా. ఇకపై ఇదే నా భవిష్యత్తు.' అంటూ చెప్పారు.
Also Read : విజయ్ దేవరకొండకు మెమొరబుల్ ఇయర్ - ఫ్యాన్స్ వెయిటింగ్ ఫర్ పాన్ ఇండియా మూవీస్
అసలు వివాదం ఏంటంటే?
- 'జన నాయగన్'కు సెన్సార్ బోర్డు ముందు U/A సర్టిఫికెట్ జారీ చేసి ఆ తర్వాత దాన్ని రివైజింగ్ కమిటీకి పంపింది. దీనిపై మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. విచారించిన సింగిల్ బెంచ్ ముందు ఇచ్చినట్లుగా U/A సర్టిఫికెటే ఇవ్వాలంటూ ఆదేశించింది. దీనిపై సెన్సార్ బోర్డు డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించింది.
- విచారించిన డివిజనల్ బెంచ్... సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ సర్టిఫికెట్ జారీని తాత్కాలికంగా నిలిపేసింది. దీనిపై మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మూవీ రిలీజ్ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని డివిజన్ బెంచ్‌లోనే తేల్చుకోవాలని సూచించింది.
- ఆ తర్వాత దీనిపై విచారించిన డివిజనల్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. మరోసారి విచారణ జరిపి డెసిషన్ తీసుకోవాలంటూ సింగిల్ బెంచ్‌కు సూచించింది.
- సినిమాను రివైజ్ కమిటీ చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేంత వరకూ ఆగాల్సిందేనంటూ స్పష్టం చేసింది. దీంతో మూవీ రిలీజ్ మరింత ఆలస్యం అవుతోంది. త్వరలోనే రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా... విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా చేశారు. వీరితో పాటే మమితా బైజు, బాబీ డియోల్, ప్రియమణి, నరైన్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించగా... KVV ప్రొడక్షన్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మించారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
ట్రెండింగ్ వార్తలు






















