TG Vishwa Prasad: ‘మిరాయ్’ 300 కోట్ల సినిమాలా ఉంటుంది... సంపాతి పక్షితో పాటు హైలైట్స్ ఏమిటంటే? - నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇంటర్వ్యూ
TG Vishwa Prasad: నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ‘మిరాయ్’ చిత్ర విశేషాలతో పాటు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రాబోయే సినిమాల గురించి చెప్పారు. ముఖ్యంగా ‘ది రాజా సాబ్’ రిలీజ్ పై ఆయన క్లారిటీ ఇచ్చారు.

TG Vishwa Prasad Interview on Mirai Movie: సూపర్ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన పాన్-ఇండియా విజువల్ వండర్ చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించిన ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..
‘‘నేను 2017 నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు నిర్మిస్తున్నాను. నేను నిర్మించిన సినిమాలు 2018 నుంచి రిలీజ్ అవుతున్నాయి. సక్సెస్, ఫెయిల్యూర్స్ కామన్. ప్రతి సినిమా సక్సెస్ అవ్వాలనేం ఉండదు. కానీ ఎఫెర్ట్ మాత్రం ప్రతి సినిమాకు ఒకేలా ఉంటుంది. ఈ క్రమంలో మా సంస్థ నుంచి 2024 సంవత్సరంలో వచ్చిన సినిమాలు బాగా డిజప్పాయింట్ చేశాయి. ఇప్పుడు ‘మిరాయ్’తో మంచి కం బ్యాక్ ఇస్తామని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఎటువంటి మార్కెట్ లెక్కలు వేసుకోకుండా ప్రేక్షకులకు మా సంస్థ నుంచి ఒక ఎక్స్‌ట్రార్డినరీ సినిమా ఇవ్వాలనే ‘మిరాయ్’ చేశాం. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’ ఇంకా రాలేదు. మేమీ ప్రాజెక్ట్‌ని ఎంతగానో బిలీవ్ చేశాం. ఇందులో దాదాపు ఒక పది లార్జర్ ఎపిసోడ్స్ ఉంటాయి. కథ, మ్యూజిక్, లొకేషన్స్, గ్రాఫిక్స్ వర్క్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి.
నాకు చిన్నప్పుడు విన్న చందమామ కథలు, అమరచిత్ర కథలు అంటే చాలా ఇష్టం. ఆ కథలన్నీ కూడా మన రామాయణ మహాభారత ఇతిహాసాలకి కనెక్ట్ అవుతున్నట్లుగా ఉంటాయి. ‘మిరాయ్’ కూడా అద్భుతమైన ఫాంటసీ అడ్వెంచర్. మన హిస్టరీతో పాటు కొంత ఫిక్షన్ కూడా ఇందులో బ్లెండ్ అయి ఉంది. దర్శకుడు కార్తీక్ ఈ కథ చెప్పగానే నాకు మళ్లీ ఆరోజులు గుర్తుకు వచ్చాయి. అశోకుడు జ్ఞానాన్ని 9 పుస్తకాల్లో నిక్షిప్తం చేశాడు. ఆ పుస్తకాల రక్షణ ఎనిమిది మంది యోధులకు ఇస్తాడు. ఒకే ఒక్క పుస్తకం మాత్రం ఒక ఆశ్రమానికి ఇస్తాడు. ఆ పుస్తకాల ప్రాధాన్యత ఏమిటి? వాటి గురించి హీరో, విలన్ మధ్య ఎలాంటి పోరాటం చేశారనేదే ‘మిరాయ్’ కథ.
Also Read: రాజా సాబ్ ట్రైలర్ రిలీజ్ డేట్ అప్డేట్... పాన్ ఇండియా సినిమాతో థియేటర్లలోకి!
ఈ సినిమా కోసం తేజ చాలా హార్డ్ వర్క్ చేశారు. యాక్షన్ నిమిత్తం థాయిలాండ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అలాగే మంచు మనోజ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారు. ఇంకా అనుభవం వున్న నటీనటులు ఎందరో ఇందులో చాలా ముఖ్యమైన పాత్రలు పోషించారు. మిరాయి ఒక తల్లి సంకల్పంతో ముడిపడే కథ, ఆ సంకల్పం ఏమిటనేది తెరపైనే చూడాలి. ఈ సినిమాలో ప్రతి ఎలిమెంట్, క్యారెక్టర్‌కి ఒక పర్పస్ ఉంటుంది. ప్రతీది చాలా నేచురల్‌గా వుంటుంది. దర్శకుడు కార్తీక్ ఒక బ్రిలియంట్ సినిమాటోగ్రాఫర్. తనకి లోకేషన్ ఏమేం కావాలనేది చాలా క్లారిటీ ఉంది. సెట్లో ఏం ఉండాలి, గ్రాఫిక్స్‌లో ఏం కావాలనేది ఫుల్ క్లారిటీ ఉంది. ఈ సినిమాలో లొకేషన్స్, గ్రాఫిక్స్ ఆడియన్స్‌కి చాలా కొత్త అనుభూతిని ఇస్తాయి. డైరెక్టర్ కార్తీక్ ఫాంటసీ స్టోరీ టెల్లింగ్‌తో పాటు మంచి కనెక్షన్‌తో సినిమాని తీశాడు. అలాగే నేను చాలా డీప్‌గా ఇన్వాల్వ్ అయిన సినిమా ఇదే. బిగ్ కాన్వాస్ ఉన్న చిత్రమిది. గత ఏడాదిన్నరగా ఈ సినిమాతోనే ఎక్కువగా ట్రావెల్ అవుతున్నాను. బడ్జెట్ గురించి ఆలోచించలేదు. అసలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేసిన సినిమా ఇది.
బిజినెస్ పరంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. కరణ్ జోహార్ ఈ సినిమా కంటెంట్ చూశారు. ఆయనకు బాగా నచ్చింది. నార్త్‌లో ఆయన రిలీజ్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. శ్లోకతో కలసి యూఎస్‌లో రిలీజ్ చేస్తున్నాం. కర్ణాటకలో హోంబాలే, కేరళలో గోకులం, తమిళనాడులో ఏజిఎస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రైమ్ డిస్ట్రిబ్యూటర్స్ చాలా గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మిరాయ్ కంటెంట్‌కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. విడుదలకు ముందు నుంచే సినిమాను ప్రేక్షకులు చాలా గొప్పగా యాక్సెప్ట్ చేశారు. ప్రీమియర్స్ గురించి ఆలోచన చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్స్‌తో మాట్లాడి ఓ నిర్ణయానికి వస్తాం. ఈ సినిమా స్కేల్, సైజ్‌ని బట్టి టికెట్స్ రేట్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. ఎందుకంటే, ఈ సినిమా రూ. 300 కోట్లు ఖర్చు చేసిన సినిమాలా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాకు టికెట్ రేట్స్ పెంచాలని అనుకోవడం లేదు. అందరూ ఈ సినిమా చూసేలా ఉండాలని.. జనరల్‌గా ఉండే టికెట్ ధరలతోనే వెళుతున్నాం. ఈ సినిమాని ఎంతమంది చూశారనే దాని మీదే మా దృష్టి పెట్టాం. అలాగే, ఫ్యామిలీస్, పిల్లలు కలిసి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాం.
ఈ సినిమా విషయంలో చాలా కాంప్లెక్స్‌గా అనిపించిన ఒక సీక్వెన్స్ ఉంది. అదేంటంటే.. ఒక సంపాతి అనే పక్షి ఉంటుంది. ఆ పక్షి కోసం చాలా పెద్ద ఫ్లోర్ ఉన్న సెట్ కావాల్సి వచ్చింది. ‘రాజాసాబ్’ వన్ అఫ్ ది లార్జెస్ట్ ఫిలిం షూటింగ్ ఫ్లోర్. ‘మిరాయ్’ కోసం చేసిన సీక్వెన్స్ సెకండ్ లార్జెస్ట్ ఫ్లోర్. 30000 స్క్వేర్ ఫీట్‌లో ఉంటుంది. అందులో ఒక సెట్ వేశాం. ఆ పక్షిని యానిమాట్రిక్స్ టెక్నాలజీతో సృష్టించాం. ఇది చాలా కాంప్లెక్స్ వర్క్ అనిపించింది. పక్షితో ఇంతలా హ్యూమన్ ఇంటరాక్షన్ వున్న సినిమా ఇప్పటి వరకు రాలేదని నేను భావిస్తున్నాను.
Also Read: బాలీవుడ్ హీరోతో సాయి దుర్గా తేజ్ ఢీ... 'సంబరాల యేటిగట్టు'లో విలన్‌గా హిందీ స్టార్
మా సంస్థలో చేస్తున్న ‘ది రాజా సాబ్’ జనవరి 9న రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. ‘కాంతార 2’ విడుదల రోజు ట్రైలర్ రిలీజ్ చేస్తాం. అలాగే ప్రభాస్ బర్త్ డేకి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలనే సన్నాహాల్లో ఉన్నాం. ‘తెలుసు కదా’ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. తర్వాత ‘మోగ్లీ’ ఉంటుంది. లావణ్య త్రిపాఠితో ఒక థ్రిల్లర్ చిత్రం, అలాగే సునీల్‌తో మరో ఫిల్మ్ చేస్తున్నాం. అవి కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతాయి. ‘గూఢచారి 2, గరివిడి లక్ష్మి’తో పాటు కన్నడలో కొన్ని సినిమాలు చేస్తున్నాం. ఎలా చూసినా.. 2026- 2027 మధ్య మా సంస్థ నుంచి దాదాపు 12 సినిమాలు విడుదలవుతాయి’’ అని చెప్పుకొచ్చారు.





















