SYG - Sambarala Yeti Gattu Update: బాలీవుడ్ హీరోతో సాయి దుర్గా తేజ్ ఢీ... 'సంబరాల యేటిగట్టు'లో విలన్‌గా హిందీ స్టార్
Sai Durgha Tej Latest News: సాయి దుర్గా తేజ్ హీరోగా రోహిత్ కెపి దర్శకత్వంలో కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న 'సంబరాల యేటిగట్టు'లో బాలీవుడ్ స్టార్ విలన్ రోల్ చేస్తున్నారు.

మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) కథానాయకుడిగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'సంబరాల యేటిగట్టు' (SYG Movie) రూపొందుతున్న సంగతి తెలిసిందే. సుమారు 125 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకం మీద కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ విలన్ రోల్ చేస్తున్నారు.
సాయి దుర్గా తేజ్ సినిమాలో బాలీవుడ్ స్టార్!
అవును... సాయి దుర్గా తేజ్ 'సంబరాల యేటిగట్టు'లో బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు పవర్ ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు. ఆయన ఎవరు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ నెలలో ప్రారంభం అయ్యే షెడ్యూల్‌లో బాలీవుడ్ స్టార్ కూడా జాయిన్ అవుతారు.
సెప్టెంబర్ మూడో వారం నుంచి 'సంబరాల యేటిగట్టు' లేటెస్ట్ షెడ్యూల్ మొదలు కానుంది. అందులో విలన్ కూడా జాయిన్ అవుతారని, హీరోతో పాటు అతని మీద కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తామని చిత్ర బృందం పేర్కొంది. ఆ విలన్ ఎవరినేది అప్పుడు రివీల్ చేయనున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్సుకు పీటర్ హెయిన్ కొరియోగ్రఫీ చేయనున్నారు.
రెండేళ్ల నుంచి ఈ సినిమా కోసమే హీరో త్యాగం!
సాయి దుర్గా తేజ్ రెండేళ్ల నుంచి ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. లుక్ నుంచి బాడీ బిల్డింగ్ వరకు ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. కొత్త దర్శకుడు రోహిత్ కెపితో పాటు అతని కథపై నమ్మకంతో మరొక సినిమా చేయడం లేదు. సుమారు 75 శాతం వరకు చిత్రీకరణ పూర్తి అయింది. ఇండస్ట్రీ స్ట్రైక్ వల్ల షూటింగ్ డిలే అయ్యింది. దాంతో మొదట దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేసినా... ఇప్పుడు ఆ తేదీకి వచ్చే అవకాశాలు లేవు. దాంతో కాస్త వెనక్కి వెళ్లనున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో సినిమా విడుదల కానుంది.
View this post on Instagram
SYG Movie Cast And Crew List: సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి జంటగా రూపొందుతున్న 'సంబరాల యేటిగట్టు'లో జగపతి బాబు, శ్రీకాంత్, సాయి కుమార్, అనన్యా నాగళ్ళ, రవి కృష్ణ ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమాకు రచన - దర్శకత్వం: రోహిత్ కేపీ, నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి - చైతన్య రెడ్డి, నిర్మాణ సంస్థ: ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్, ఛాయాగ్రహణం: వెట్రి పళనిసామి, సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్, కూర్పు: నవీన్ విజయ కృష్ణ, ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియం.
Also Read: అల్లు ఫ్యామిలీకి మరో షాక్... జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు - కేసు ఏమిటంటే?





















