News
News
వీడియోలు ఆటలు
X

TEST Movie Update : 'యువ' తర్వాత ఇన్నాళ్ళకు - మాధవన్, సిద్ధార్థ్, మీరా కాంబినేషన్ రిపీట్!

Test Movie : మీరా జాస్మిన్ మరో సినిమాకు సంతకం చేశారు. నయనతారతో పాటు మీరా జాస్మిన్ కూడా నటిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే... 20 ఏళ్ళ తర్వాత 'యువ' కాంబినేషన్ రిపీట్ అవుతోంది.

FOLLOW US: 
Share:

మాధవన్, మీరా జాస్మిన్ (Meera Jasmine) జంట గురించి చెబితే మీకు ఏ సినిమా గుర్తుకు వస్తుంది? ఒకటి... 'రన్'. ఇంకొకటి... మణిరత్నం తీసిన 'యువ'. ఆ రెండు చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. 'యువ'లో సిద్ధార్థ్ సైతం నటించారు. ఆయనకు జోడీగా త్రిష కనిపించారు అనుకోండి! ఆమె గురించి పక్కన పెడితే...

'యువ' ఎప్పుడు విడుదలైంది? 2004లో! వచ్చే ఏడాదికి ఆ సినిమా విడుదలై 20 ఏళ్ళు! ఇన్నాళ్ళకు మళ్ళీ మాధవన్, మీరా జాస్మిన్, సిద్ధార్థ్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అదే 'టెస్ట్'.  

మాధవన్, సిద్ధార్థ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా 'టెస్ట్' (Test Movie). టైటిల్ వింటే జానర్ ఏమిటో అర్థం అయ్యేలా ఉంది కదూ! అవును... ఇది క్రికెట్ బేస్డ్ సినిమా (Sports Based Movie)! టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఇందులో నయనతార ఓ హీరోయిన్. గత నెలలో సినిమా వివరాల్ని వెల్లడించారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఇందులో మీరా జాస్మిన్ (Meera Jasmine) కూడా నటిస్తున్నారు. ఈ రోజు ఆ విషయాన్ని వెల్లడించారు. 

నయనతార ఎవరికి జోడీగా కనిపిస్తారు? మీరా జాస్మిన్ ఎవరి పెయిర్? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్! 'టెస్ట్' కాకుండా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'విమానం'లో కూడా మీరా జాస్మిన్ నటిస్తున్నారు. చూస్తుంటే... మళ్ళీ సినిమాలపై ఆమె గట్టిగా కాన్సంట్రేషన్ చేసినట్టు ఉన్నారు.

Also Read 'బాహుబలి' క్లైమాక్స్ గుర్తు చేసిన 'ఆదిపురుష్' ట్రైలర్ - ఆ ఒక్క డైలాగ్ లేకపోతే?   

View this post on Instagram
 
A post shared by YNOT Studios (@studiosynot)

దర్శకుడిగా మారుతున్న నిర్మాత శశికాంత్!
'టెస్ట్' సినిమాకు శశికాంత్ దర్శకత్వం వహించనున్నారు. వై నాట్ స్టూడియోస్ పతాకంపై సిద్ధార్థ్ హీరోగా 'లవ్ ఫెయిల్యూర్', 'కావ్య తలైవన్', మాధవన్ హీరోగా 'ఇరుది సుట్రు' (తెలుగులో వెంకటేష్ హీరోగా 'గురు' పేరుతో రీమేక్ చేశారు), 'విక్రమ్ వేద' సినిమాలను శశికాంత్ ప్రొడ్యూస్ చేశారు. నిర్మాతగా ఇప్పటి వరకు అనేక సినిమాలు తీసిన ఆయన, ఫస్ట్ టైమ్ మెగాఫోన్ పడుతున్నారు. ఆయన నిర్మించిన సినిమాల్లో స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కూడా స్పోర్ట్స్ బేస్డ్ కావడం విశేషం!

మాధవన్, సిద్ధార్థ్... 17 ఏళ్ళ తర్వాత  
'టెస్ట్' సినిమా స్పెషాలిటీ ఏంటంటే... మాధవన్, సిద్ధార్థ్ (Siddharth) కలిసి 17 ఏళ్ళ తర్వాత కలిసి చేస్తున్న చిత్రమిది. హిందీ సినిమా 'రంగ్ దే బసంతి'లో వాళ్ళిద్దరూ నటించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, ఇతర భాషల్లో విడుదల చేసేలా 'టెస్ట్' రూపొందిస్తున్నారట. ఇది పాన్ ఇండియా స్పోర్ట్స్ ఫిల్మ్. క్రికెట్ అంటే ఇండియాలో చాలా మంది ఫేవరెట్ స్పోర్ట్. అందువల్ల, ఈ సినిమాకు ఆదరణ బావుంటుందని ఆశించవచ్చు. 

Also Read సోనీ చేతికి పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' ఆడియో, గ్లింప్స్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

సరదాగా క్రికెట్ ఆడుతూ సిద్ధార్థ్ కొన్ని సినిమాల్లో కనిపించారు. అయితే, ప్రొఫెషనల్ క్రికెట్ రోల్ ఎప్పుడూ చేయలేదు. మాధవన్ 'ప్రియమణ తొళి' సినిమాలో క్రికెటర్ రోల్ చేశారు.  ఆ సినిమా విడుదలైన 20 ఏళ్లకు మళ్ళీ ఆయన క్రికెట్ నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయనది కోచ్ రోలా? లేదంటే క్రికెటరా? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.

Published at : 09 May 2023 08:15 PM (IST) Tags: Siddharth Meera Jasmine Madhavan Nayanthara TEST Movie Update

సంబంధిత కథనాలు

NTR Workouts For Devara : సెలవుల్లోనూ రెస్ట్ తీసుకొని 'దేవర' - విదేశాల్లో వర్కవుట్స్

NTR Workouts For Devara : సెలవుల్లోనూ రెస్ట్ తీసుకొని 'దేవర' - విదేశాల్లో వర్కవుట్స్

Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!

Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!

NBK 108 Movie Title : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ 'బ్రో' కాదు - బర్త్ డే గిఫ్ట్ రెడీ!

NBK 108 Movie Title : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ 'బ్రో' కాదు - బర్త్ డే గిఫ్ట్ రెడీ!

2018 Movie OTT Release : నెల రోజుల్లోనే ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ '2018' - ఎప్పుడు? ఎక్కడ? అంటే...

2018 Movie OTT Release : నెల రోజుల్లోనే ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ '2018' - ఎప్పుడు? ఎక్కడ? అంటే...

Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!

Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!

టాప్ స్టోరీస్

AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

AP Cabinet Meeting :  ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !

Empty Stomach: ఖాళీ పొట్టతో ఈ ఆహారాలను తినకూడదు, అయినా చాలామంది తినేస్తున్నారు

Empty Stomach: ఖాళీ పొట్టతో ఈ ఆహారాలను తినకూడదు, అయినా చాలామంది తినేస్తున్నారు

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?