Telugu TV Movies Today: వెంకీ బర్త్‌డే స్పెషల్ ‘లక్ష్మీ’, ‘సూర్యవంశం’, ‘సుందరకాండ’ to ‘అర్జున్ రెడ్డి’ వరకు - ఈ రోజు (డిసెంబర్ 13) టీవీల్లో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్
Telugu TV Movies Today (13.12.2024): థియేటర్లలో, ఓటీటీల్లో ఎన్నో సినిమాలు, సిరీస్‌లున్నా, టీవీల్లో వచ్చే సినిమాలను మాత్రం ప్రేక్షకలోకం వదులుకోదు. అటువంటి వారి కోసం శుక్రవారం టీవీలలో వచ్చే మూవీల లిస్ట్
శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలు వచ్చినా.. ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు వచ్చినా... ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ (టీవీల)లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శుక్రవారం (డిసెంబర్ 13) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం... ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘లక్ష్మీ’ (వెంకటేష్, నయనతార, చార్మీ, వివి వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఖడ్గం’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘భీమా’ (గోపీచంద్ లేటెస్ట్ ఎంటర్‌టైనర్)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘సూర్యవంశం’ (వెంకటేష్ ద్విపాత్రాభినయంలో నటించిన సినిమా)
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘దాస్ కా దమ్కీ’
రాత్రి 11 గంటలకు- ‘సుభాస్ చంద్రబోస్’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘సీతారాం బెనోయ్’
ఉదయం 9 గంటలకు- ‘మహానటి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘క్రాక్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సర్దార్ గబ్బర్ సింగ్’ (పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం)
సాయంత్రం 6 గంటలకు- ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’
రాత్రి 9 గంటలకు- ‘ఛత్రపతి’ (ప్రభాస్, రాజమౌళి కాంబోనేషన్‌లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్)
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘పార్టీ’
ఉదయం 8 గంటలకు- ‘ఖాకీ సత్తా’
ఉదయం 11 గంటలకు- ‘పసలపూడి వీరబాబు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘చంద్రకళ’
సాయంత్రం 5 గంటలకు- ‘అర్జున్ రెడ్డి’ (విజయ్ దేవరకొండ, షాలిని పాండే కాంబోలో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం)
రాత్రి 8 గంటలకు- ‘గూఢచారి’
రాత్రి 11 గంటలకు- ‘ఖాకీ సత్తా’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘జెమిని’ (విక్టరీ వెంకటేష్, నమిత కాంబోలో వచ్చిన చిత్రం)
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘కళ్యాణ రాముడు’
ఉదయం 10 గంటలకు- ‘అల్లరి ప్రియుడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘లోఫర్’
సాయంత్రం 4 గంటలకు- ‘ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదావరి మొగుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘లయన్’
రాత్రి 10 గంటలకు- ‘భలే మంచి రోజు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నేటి సిద్ధార్థ’
రాత్రి 10 గంటలకు- ‘అసెంబ్లీ రౌడీ’ (మోహన్ బాబు, దివ్యభారతి కలిసి నటించిన పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా)
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘స్వర్ణకమలం’
ఉదయం 10 గంటలకు- ‘ధనమా దైవమా’
మధ్యాహ్నం 1 గంటకు- ‘తలైవి’
సాయంత్రం 4 గంటలకు- ‘సుందరకాండ’
సాయంత్రం 7 గంటలకు- ‘బాంధవ్యాలు’
Also Read: అల్లు అర్జున్‌కు సారీ చెప్పలేదు కానీ... పుష్ప 2, జేసీబీ కామెంట్స్ మీద సిద్ధూ లేటెస్ట్ రియాక్షన్!
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘అభినేత్రి’
ఉదయం 9 గంటలకు- ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘విన్నర్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘777 చార్లీ’
సాయంత్రం 6 గంటలకు- ‘ఎఫ్ 3’
రాత్రి 9 గంటలకు- ‘దేవదాస్’