Siddharth - Allu Arjun: అల్లు అర్జున్‌కు సారీ చెప్పలేదు కానీ... పుష్ప 2, జేసీబీ కామెంట్స్ మీద సిద్ధూ లేటెస్ట్ రియాక్షన్!
Siddharth reacts again On Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, 'పుష్ప 2' పాట్నా ఈవెంట్ గురించి 'బొమ్మరిల్లు' ఫేమ్ సిద్ధార్థ్ మరోసారి రియాక్ట్ అయ్యాడు. జేసీబీ కామెంట్స్ గురించి ఆయన ఏమన్నారంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మీద ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమిళ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన సిద్ధార్థ్ (Siddharth) చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. జేసీబీ, బీరు బిర్యానీ అంటూ చేసిన కామెంట్స్ ట్రోలింగ్ స్టఫ్ అయ్యాయి. వాటిపై మరొకసారి ఆయన రియాక్ట్ అయ్యాయి.
'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో జరిగింది. దానికి లక్షలాది మంది జనాలు వచ్చారు. ఆ విషయాన్ని సిద్ధార్థ్ దగ్గర ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించగా... ''ఊరిలో ఇల్లు కొల్లగొట్టడానికి జేసీబీ వస్తే జనాలు గుమిగూడారు. బీరు, బిర్యానీ ఇస్తే రాజకీయ మీటింగులకు జనాలు వస్తారని విన్నాం. అంత మంది జనాలు రావడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు'' అని ఆయన సమాధానం ఇచ్చారు.
అల్లు అర్జున్‌కు సిద్ధార్థ్ సారీ చెప్పలేదు కానీ...
సిద్ధార్థ్ హీరోగా నటించిన 'మిస్ యు' శుక్రవారం (డిసెంబర్ 13న) తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా తమిళ మీడియా ముందుకు వచ్చారు. అప్పుడు జేసీబీ కామెంట్స్ గురించి ఒక విలేకరిగా ప్రశ్నించారు. అప్పుడు ఆయన సారీ చెప్పలేదు. అలాగని అల్లు అర్జున్ గురించి గొప్పగా కూడా మాట్లాడలేదు. మరి ఆయన ఏం చెప్పారో చూడండి.
''మీరు అడిగిన ప్రశ్నలోనే ఒక గొడవ ఉంది. ఆ గొడవ గురించి చెప్పాల్సిన అవసరం, మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 'పుష్ప 2' పెద్ద విజయం సాధించిన సినిమా. ఆ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. వాళ్ళు ఫస్ట్ పార్ట్ తీసి పెద్ద హిట్ కొట్టారు. ఫస్ట్ పార్ట్ సక్సెస్ చేయడం వల్ల అంత మంది జనాలు వచ్చారు. అదొక పాజిటివ్ సైన్. మనం ఎంత మంది జనాలను తీసుకు వస్తే అంత మంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, తీసుకు రాగలమని మనం నమ్మాలి. సినిమా హెల్దీగా ఉండాలి. ఎవరి మీద ఎవరికీ కోపం లేదు. అందరం ఒకటే పడవలో ప్రయాణం చేస్తున్నాం. ఇవాళ ఒక సినిమా విడుదలై హిట్ అవ్వడం అనేది వందలో ఒక్కటిగా జరుగుతోంది. నిర్మాతలకు మంచి జరగాలి. రెండు మూడు సంవత్సరాలు కష్టపడి సినిమాలు చేసే ఆర్టిస్టుల కష్టానికి తగ్గ ఫలితం రావాలి. మా ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే మంచి సినిమాలు చేయాలని'' అని చెప్పారు సిద్ధార్థ్.
Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
Q: You have compared #Pushpa2TheRule crowd with JCB. Is there any issue with #AlluArjun❓#Siddharth: #Pushpa2 got Big success. My wishes to them. There is no personal vengeance on Anyone. Theatre is also filled with crowd i hope, it's a positive sign pic.twitter.com/uG9Rj89I8h
— AmuthaBharathi (@CinemaWithAB) December 11, 2024
'మిస్ యు' సినిమాను తొలుత 'పుష్ప 2: ది రూల్' కంటే ముందు థియేటర్లలోకి తీసుకు రావాలని ప్లాన్ చేశారు. నవంబర్ మంత్ ఎండ్ అనుకున్నారు. తెలుగు మీడియా ముందుకు వచ్చినప్పుడు 'పుష్ప 2' ఉందని ప్రశ్నించగా... సిద్ధూ రియాక్ట్ అయిన తీరు కొంత మందికి నచ్చలేదు. కట్ చేస్తే రిలీజ్ పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'పుష్ప 2' మీద కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.
Also Read: దటీజ్ పవన్ కళ్యాణ్... ఈ ఏడాది గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ లిస్టులో ఒకే ఒక్క టాలీవుడ్ స్టార్