అన్వేషించండి

Film Chamber: సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహంతో స్పందించిన సినీ పరిశ్రమ!

సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహంతో సినీ పెద్దలు స్పందించారు. ఈ మేరకు 'గద్దర్‌ అవార్డ్స్‌' అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చర్చించామని, ప్రతి ఏటా అవార్డు ఇవ్వడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని పేర్కొంది. 

Telugu Film Chamber of Commerce on Gaddar Awards: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సినీ పెద్దలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గద్దర్‌ అవార్డ్స్‌ గురించి ఆయనతో చర్చించినట్టు ఫిలిం ఛాంబర్‌ వెల్లడించింది. ఈ మేరకు తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(Telugu Film Chamber of Commerce) తాజాగా పత్రిక ప్రకటన ఇచ్చింది. "తెలంగాణ రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీ మరింత అభివృద్ధికి తొడ్పడుతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము. ఈ సందర్భంగా సీఎంను కలిసి ఇండస్ట్రీకి చెందిన విషయాల గురించి వివరముగా చర్చించాము.

ఈ మేరకు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గద్దర్‌ అవార్డ్స్‌పై ఆయన స్పందించారు. ప్రతి ఏడాది గద్దర్‌ అవార్డ్స్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వగలమని ఆయన హామి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై తెలుగు ఫలిం ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేసింది. అంతేకాదు ఈ అవార్డులపై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి వారు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించి సదరు విధి విధానాలను తయారు చేసి, ఆ రిపోర్టును తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ద్వారా ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి గారికి అతి త్వరలోనే అందజేయడం జరుగుతందని తెలియజేస్తున్నాం" అంటూ ఫిలిం ఛాంబర్‌ ప్రకటన విడుదల చేసింది.

కాగా కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో గద్దర్‌ అవార్డ్స్‌ అంశం హాట్‌టాపిక్‌గా నిలిచింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని లెక్క చేయడం లేదని, తాము గద్దర్‌ అవార్డ్స్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న, సినీ ఇండస్ట్రీ ఆసక్తి చూపించడం లేదు సీఎం రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దీంతో స్వయంగా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. "సీఎం రేవంత్ రెడ్డి  చొరవ తీసుకుని, సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీపరిశ్రమలోని  ప్రతిభావంతులకు, ప్రజా కళాకారులు గద్దర్ గారి పేరు మీదు  ప్రతియేటా 'గద్దర్ అవార్డ్స్'తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని   ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్,  ప్రొడ్యూసర్ కౌన్సిల్  ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాలి" అని ఆయన కోరిన సంగతి తెలిసిందే. 

Also Read: సినీ ఇండస్ట్రీపై రేవంత్ ఆగ్రహం - వెంటనే స్పందించిన చిరంజీవి - ఏమన్నారంటే ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget