అన్వేషించండి

Uruku Patela: పెళ్లి చేసుకొని అమ్మాయికి లైఫ్‌ ఇస్తానంటున్న హీరో తేజస్‌ - ఆకట్టుకుంటున్న 'ఉరుకు పటేల' టీజర్‌!

Uruku Patela Teaser: 'హుషారు' సినిమాతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన టాలెంటెడ్ యాక్ట‌ర్ తేజ‌స్ కంచ‌ర్ల‌. ఈ యంగ్‌ హీరో నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'ఉరుకు పటేల'. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.

Uruku Patela Teaser: 'హుషారు' వంటి వైవిధ్యమైన సినిమాతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన టాలెంటెడ్ యాక్ట‌ర్ తేజ‌స్ కంచ‌ర్ల‌. ఈ యంగ్‌ హీరో నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'ఉరుకు పటేల'. ‘గెట్ ఉరికిఫైడ్’ అనేది ఉప శీర్షిక. లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కంచ‌ర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ సినిమాకు ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేసింది మూవీ టీం.

యంగ్‌ హీరో అడివి శేష్ చేతుల మీదుగా లాంచ్‌ చేసిన ఈ టీజర్ ఫుల్‌ అవుట్‌ అండ్ కామెడీతో సాగింది. టీజర్‌ మొత్తం పెళ్లి గోలతో సాగుతూ ఆకట్టుకుంది. "నిన్ను పెళ్లి చేసుకుని లైఫ్‌ ఇస్తా.." అంటూ హీరో కనిపించిన ప్రతి అమ్మాయి వెంట పడుతుంటాడు. ఈ క్రమంలో పెళ్లయి ఆడవాళ్లను కూడా వదిలిపెట్టడు. చూస్తుంటే ఈ సినిమా మొత్తం హీరో పెళ్లి కోసం తిప్పలు పడుతుంటాడనిపిస్తుంది. ఈ క్రమంలో చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునే హీరోకు హీరోయిన్‌ కంటపడుతుంది. దీంతో ఆమె ఫిక్స్‌ అయిపోయి తన వెంట పడుతున్నట్టు టీజర్‌లో చూపించారు. ఇక చివరిలో హీరోయిన్‌ సీరియస్‌ లుక్‌లో చూపించారు.

చూస్తుంటే ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కి హారర్‌ ఎలిమెంట్స్‌ జోడించినట్టు అనిపిస్తుంది. చివరిలో హీరోయిన్ సీరియస్‌గా చూస్తుంటే హీరో భయంతో వణికిపోతుంటాడు. అప్పుడు ఉరికింగ్‌ సూన్‌ అంటూ టైటిల్‌ వేశారు. అయితే ఇప్పటి వరకు ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ఎప్పుడనేది ప్రకటించలేదు మూవీ. ఈ నేపథ్యంలో త్వరలోనే సినిమా విడుదల చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు మేకర్స్‌. మొత్తానికి వినోదాత్మకంగా సాగిన టీజర్‌ చివరిలో సీరియస్‌నెస్‌ చూపించి మూవీపై ఆసక్తి పెంచాడు డైరెక్టర్‌. 

ఇక టీజర్‌ లాంచ్‌ సందర్భంగా మూవీ డైరెక్టర్‌ వివేక్ రెడ్డి మాట్లాడుతూ.. ముందుకు టీజర్ లాంచ్ చేసిన హీరో అడివి శేష్‌కి థ్యాంక్స్‌ చెప్పాడు. సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారని, మా నిర్మాతే మా చిత్రానికి ఒరిజినల్ పటేల్‌ అన్నాడు. ఈ కథను ముందుగా నా ఏడీ మారుతికి చెప్పాను. నాలుగైదేళ్ల నుంచి వాళ్లు నాతోనే ప్రయాణం చేశారు. తేజస్‌కి కథ చెబుతూ డెవలప్ చేశాం. నిర్మాత గారు మాకేం కావాలో.. ఎంత కావాలో అంతా ఇచ్చారంటూ చెప్పుకొచ్చాడు. 

హీరో తేజస్ కంచర్ల మాట్లాడుతూ.. మంచి కంటెంట‌్‌ను ఇవ్వాలని కాస్త టైం తీసుకున్నానని, ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు మంచి సంగీతాన్ని ఇచ్చారన్నాడు. ఆగస్ట్ నుంచి పాటలు రిలీజ్ చేస్తామన్నాడు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాడు. ఇక మా దర్శకుడు వివేక్ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని, కాఫీ షాప్, బార్ షాప్ ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని చర్చించుకునే వాళ్లమంటూ తేజస్‌ పేర్కొన్నాడు. కాగా ఈ సినిమాలో తేజస్‌ సరసన కుష్బూ చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. 

Also Read: జర్నీ ఆఫ్‌ విశ్వం - శ్రీనువైట్ల, గోపిచంద్‌ మేకింగ్‌ వీడియో చూశారా? - 'వెంకీ' ట్రైన్‌ కామెడీ రిపీట్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget