అన్వేషించండి

The Journey of Viswam: జర్నీ ఆఫ్‌ విశ్వం - శ్రీనువైట్ల, గోపిచంద్‌ మేకింగ్‌ వీడియో చూశారా? - 'వెంకీ' ట్రైన్‌ కామెడీ రిపీట్‌!

The Journey of Viswam: మాచో స్టార్‌ గోపిచంద్‌, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్‌ మూవీ విశ్వం. తాజాగా ఈ మూవీ మేకింగ్‌ వీడియో రిలీజ్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసింది మూవీ టీం. 

The Journey of Viswam Making Video: మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'విశ్వం' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వరుస ప్లాప్స్‌ తర్వాత గోపిచంద్‌ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. పైగా చాలా గ్యాప్‌ తర్వాత శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్న చిత్రమిది. పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో గోపిచంద్‌ ఇంటెన్స్‌ లుక్‌లో కనిపించబోతున్నాడు. మూవీ సెట్‌పైకి వచ్చినప్పుటి నుంచి ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌ ఇస్తూ హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఫస్ట్‌ స్ట్రైక్‌ పేరుతో మూవీ నుంచి చిన్న వీడియో రిలీజ్‌ చేశారు.

ఇందులో గోపిచంద్‌ రోల్‌ని, లుక్‌ని పరిచయం చేశారు. ఈ వీడియో గోపిచంద్‌ నెగిటివ్‌ షేడ్స్‌లో కనిపించడం అందరిలో ఆసక్తిని పెంచింది. దీంతో మూవీపై మరింత బజ్‌ క్రియేట్‌ అయ్యింది. తాజాగా మరో అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. 'జర్నీ ఆఫ్‌ విశ్వం' అంటూ మేకింగ్‌ వీడియో రిలీజ్‌ చేసి సరికొత్తగా ప్రమోషన్స్‌ చేస్తోంది టీం. ఇంకా ఏ అప్‌డేట్స్‌ లేకుండానే నేరుగా మేకింగ్‌ వీడియో రిలీజ్‌ చేసి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ వీడియో చూస్తుంటే మూవీ షూటింగ్‌ దాదాపు ఫారెన్‌లో లోకేషన్స్‌లోనే జరిగినట్టు తెలుస్తోంది.

ఇందులో ఫైట్స్ కమర్షియల్ అంశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదు వీడియో చివరిలో కామెడీ టచ్‌ ఇచ్చారు. ట్రైన్‌లో పెట్టిన ఈ కామెడీ సీన్‌ బాగా ఆకట్టుకుంది. టీటీఈతో హీరో అండ్ గ్యాంగ్ చేసే కామెడీ తరహా విజువల్స్ కనిపించాయి. కాగా ఈ మూవీ సక్సెస్‌ శ్రీనువైట్ల, గోపిచంద్‌కు చాలా కీలకం. వరుస ప్లాప్స్‌తో ఇద్దరి కెరీర్‌ డౌన్‌ అయ్యింది. దీంతో ఈసారి ఎలాగైన భారీ హిట్‌ కొట్టాలనే ఉద్దేశంతో పవర్‌ ప్యాక్డ్‌గా విశ్వం మూవీ రూపొందిస్తున్నాడు. ఇందుకోసం తనకు కలిసోచ్చిన ట్రైన్ కామెడీనే నమ్ముకున్నాడా అనిపిస్తోంది శ్రీనువైట్ల. ఈ మేకింగ్‌ వీడియో సెకాండాఫ్‌లో ట్రైన్‌ కామెడీ సీన్‌ చూస్తుంటే 'వెంకీ' సినిమానే గుర్తొచ్చింది. 

మరి ఆ సెంటిమెంట్‌ వర్క్‌ అవుట్‌ అయ్యి గోపిచంద్‌,శ్రీనువైట్ల మంచి కంబ్యాక్‌ ఇస్తుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1 గా తెరకెక్కుతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు. శ్రీను వైట్లతో కలిసి పలు బ్లాక్‌ బస్టర్స్‌ సినిమాలకి వర్క్ చేసిన గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. కెమెరామెన్ కెవి గుహన్ సినిమాటోగ్రఫీగా వ్యవహరిస్తుండగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. 

Also Read: అల్లు అర్జున్‌ నంద్యాల వెళ్లడంపై నిహారిక రియాక్షన్‌ - అప్పుడు ఇంట్లో అంతా ఇదే అన్నారు..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget