TATA IPL 2023 : ఐపీఎల్ ఓపెనింగ్‌కు గ్లామర్ టచ్ ఇస్తున్న రష్మిక, తమన్నా
Rashmika Tamannaah to perform at TATA IPL 2023 opening ceremony : ఐపీఎల్ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. ఓపెనింగ్ సెర్మనీలో నేషనల్ లెవల్ క్రేజ్ ఉన్న భామలు రష్మిక, తమన్నా గ్లామర్ టచ్ ఇస్తున్నారు.
![TATA IPL 2023 : ఐపీఎల్ ఓపెనింగ్‌కు గ్లామర్ టచ్ ఇస్తున్న రష్మిక, తమన్నా TATA IPL 2023 Rashmika Mandanna Tamannaah excitement as they gear up for an exhilarating opening ceremony TATA IPL 2023 : ఐపీఎల్ ఓపెనింగ్‌కు గ్లామర్ టచ్ ఇస్తున్న రష్మిక, తమన్నా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/31/715b22a57ec5c8b6c05db01aa7eb83891680235630504313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? పోనీ, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia)? గుజరాత్ క్యాపిటల్ అహ్మదాబాద్ (Ahmedabad)లో! సినిమా షూటింగుల కోసం వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళలేదు. క్రికెట్ కోసం వెళ్ళారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
నేటి నుంచి ఐపీఎల్ షురూ
ఐపీఎల్ 2023 ఈ రోజు (మార్చి 31) సాయంత్రం ప్రారంభం కానుంది. ఐపీఎల్ చరిత్రలో ఇది 16వ సీజన్ (TATA IPL 2023)! అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఓపెనింగ్ సెర్మనీకి రెడీ అయ్యింది. దానికి తమన్నా, రష్మిక గ్లామర్ టచ్ ఇస్తున్నారు.
స్టేజి మీద స్టెప్స్ వేయనున్న స్టార్ హీరోయిన్స్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, తమన్నాకు నేషనల్ లెవెల్ క్రేజ్ ఉంది. హిందీలోనూ వాళ్ళిద్దరూ చాలా ఫేమస్. అందుకని, ఐపీఎల్ ప్రారంభోత్సవంలో డ్యాన్స్ లైవ్ పెర్ఫార్మన్స్ కోసం వాళ్ళను ఎంపిక చేసినట్టు ఉన్నారు. ఆల్రెడీ అహ్మదాబాద్ చేరుకున్న రష్మిక, తమన్నా... పెర్ఫార్మన్స్ కోసం రిహార్సిల్స్ చేయడం స్టార్ట్ చేశారు.
కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లైవ్ పెర్ఫార్మన్స్ చేస్తున్నానని తమన్నా తెలిపారు. అర్జిత్, రష్మికతో లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం కోసం ఎదురు చూస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
తమన్నా ఫేవరెట్ క్రికెటర్లు ఎవరంటే?
సినిమాలు, షూటింగులతో ఎప్పుడూ బిజీ బిజీగా గడిపే తమన్నాకు క్రికెట్ చూసే తీరిక లభిస్తుందా? అసలు, ఆమె క్రికెట్ చూస్తారా? అని అడిగితే... చూస్తానని చెప్పారు. మ్యాచ్ చూసేటప్పుడు ఇన్వాల్వ్ అవుతానని తమన్నా వివరించారు. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ తనకు ఇష్టమైన క్రికెటర్లు అని మిల్కీ బ్యూటీ తెలిపారు. రష్మిక మందన్నా ఫేవరెట్ క్రికెటర్లు కూడా వాళ్ళిద్దరే.
Also Read : విడాకులకు నాగ చైతన్యే కారణమా? సమంత మాటలకు అర్థం ఏమిటి?
View this post on Instagram
క్రికెట్ పక్కనపెట్టి సినిమాలకు వస్తే... ప్రస్తుతం హిందీలో రణ్‌బీర్ కపూర్ హీరోగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న 'యానిమల్' సినిమాలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. తెలుగులో నితిన్ సినిమాకు 'ఎస్' చెప్పారు. ఇటీవల ఆ సినిమా పూజా కార్యక్రమాల్లో సందడి చేశారు. 'భీష్మ' తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుములతో రష్మిక చేస్తున్న చిత్రమిది.
తమన్నా విషయానికి వస్తే... మెగాస్టార్ చిరంజీవికి జోడీగా 'భోళా శంకర్' సినిమాలో నటిస్తున్నారు. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత చిరుతో ఆమె నటిస్తున్న చిత్రమిది. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 'బీస్ట్', 'కొలమావు కోకిల', 'వరుణ్ డాక్టర్' సినిమాల ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'జైలర్'... మలయాళంలో 'బాంద్రా' సినిమాలు చేస్తున్నారు. మరో రెండు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.
Also Read : మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings ), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans ) జట్లు తలపడనున్నాయి. ఇది ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో క్రికెట్ అభిమానులు కొన్ని కొత్త విషయాలను చూడనున్నారు. వాస్తవానికి ఈసారి ఐపీఎల్‌లో కొన్ని నిబంధనల కారణంగా చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)