Tapsee Pannu: ఎట్టకేలకు బయటకొచ్చిన తాప్సి పెళ్లి వీడియో - సోషల్ మీడియాలో వైరల్
Tapsee Pannu: కొన్నిరోజుల క్రితం తాప్సీ.. తన బాయ్‌ఫ్రెండ్ మథియస్‌ను పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చాయి. కానీ దానికి ఏ ఆధారాలు లేవు. తాజాగా ఓ వీడియో బయటికొచ్చి వైరల్ అవుతోంది.
Tapsee Pannu Wedding Video: బాలీవుడ్‌లో మీడియా, ఫోటోగ్రాఫర్ల హడావిడి లేకుండా పెళ్లి చేసుకోవడం సెలబ్రిటీలకు అలవాటు అయిపోయింది. గ్రాండ్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న తర్వాత సెలబ్రిటీలే అధికారికంగా తమ పెళ్లి ఫోటోలను విడుదల చేస్తే తప్పా ఈ విషయం బయటికి రావడం లేదు. తాజాగా తాప్సీ పెళ్లి కూడా అలాగే జరిగింది. తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ మథియాస్ బోను వివాహం చేసుకుందని కొన్నిరోజుల క్రితం వార్తలు వైరల్ అయ్యాయి. కానీ వీరికి పెళ్లి జరిగింది అని తెలిసే విధంగా ఒక్క ఆధారం కూడా బయటికి రాలేదు. కానీ తాజాగా తాప్సీ పెళ్లి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది.
డిఫరెంట్ పెళ్లికూతురు..
వైరల్ అవుతున్న తాప్సీ పెళ్లి వీడియోలో ఎక్కువమంది గెస్టులు కనిపించడం లేదు. చాలా తక్కువమంది సమక్షంలో ఉదయ్‌పూర్‌లో ఈ పెళ్లి జరిగిందని వీడియో చూస్తే తెలుస్తోంది. అయితే ఇతర బాలీవుడ్ సెలబ్రిటీల లాగా తాప్సీ.. రెడ్, పింక్ లెహెంగా లాంటివి ఏమీ ధరించలేదు. గ్రాండ్‌గా రెడ్ కలర్ షరారా ధరించి పెళ్లి దుస్తుల్లో కూడా తాను డిఫరెంట్ అని నిరూపించింది. ఇక వరుడు మథియాస్ బో సైతం సాంప్రదాయమైన ఇండియన్ దుస్తుల్లో కనిపించాడు. మొత్తానికి తాప్సీ పెళ్లి విషయం కన్ఫర్మ్ అయ్యిందని బాలీవుడ్ ప్రేక్షకులు ఫీలవుతున్నారు. కొత్త కపుల్‌కు కంగ్రాట్స్ చెప్తున్నారు. కానీ తాప్సీ మాత్రం ఇంకా ఈ విషయంపై స్పందించలేదు.
leaked video of #TaapseePannu wedding 💒 pic.twitter.com/vAb9dGX1LN
— 💞सिरफिरी💞 (@Sirfiri_) April 3, 2024
అప్పటినుండే ప్రేమ..
ఉదయ్‌పూర్‌లో తాప్సీ పెళ్లి జరిగిపోయిందని వార్తలు వస్తున్నా కూడా ఇప్పటివరకు ఈ భామ మాత్రం దీనిపై స్పందించలేదు. రెండు రోజుల తర్వాత ఏమీ జరగనట్టు మామూలు షోటోషూట్‌లో పాల్గొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ కూడా చేసింది. దీంతో అసలు పెళ్లి వార్త నిజం కాదేమో అని కూడా ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు. ఇక తాప్సీ, మథియాస్ బో లవ్ స్టోరీ విషయానికొస్తే.. 2013లో జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో మొదటిసారిగా తాప్సీ, మథియాస్ కలిశారు. అప్పుడే వారు ప్రేమలోపడ్డారు. అప్పటినుండి వీరు ఈ హ్యాపీ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్నారు. ఇన్నేళ్లలో వీరిద్దరూ చాలాసార్లు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా ఈసారి ఆ రూమర్ నిజమయ్యింది.
మీడియా అటెన్షన్ వద్దు..
మథియాస్ బో ఒక మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్. తను ప్లేయర్‌గా రాణిస్తున్న సమయంలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. తను ఒలింపిక్స్‌లో మెడల్ సాధించాడు. ప్రపంచ నెంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఇండియన్ బ్యాడ్మింటన్ నేషనల్ టీమ్‌కు కోచ్‌గా పనిచేస్తున్నాడు. 2020లో ఒక పోస్ట్‌తో తాప్సీతో రిలేషన్ గురించి బయటపడింది. తాప్సీ సన్నిహితులు మథియాస్‌తో జరిగిన వివాహం గురించి బయటపెట్టారు. ‘‘ఉదయ్‌పూర్‌లో చాలా తక్కువమంది మధ్యలో పెళ్లి జరిగింది. మార్చి 20న పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయి. వారిద్దరికీ మీడియా అటెన్షన్ అవసరం లేదని నిర్ణయించుకొని ఈ విషయాన్ని బయటికి రానివ్వలేదు’’ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా వీడియోనే బయటికొచ్చింది.