CM Vijay Sangeetha : విజయ్, సంగీత డివోర్స్ కేసు - కోర్టుకు హాజరు కాని కపుల్... కీలక ఆదేశాలు
Vijay Sangeetha Divorce Case : సీఎం విజయ్, సంగీత డివోర్స్ కేసును సోమవారం చెంగల్పట్టు మహిళా న్యాయస్థానం విచారించింది. అయితే, ఈ రోజు విచారణకు ఇద్దరూ హాజరుకాలేదు.

Tamilnadu CM Vijay Sangeetha Divorce Proceedings Postponed : తమిళనాడు సీఎం విజయ్ పర్సనల్ లైఫ్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ఎన్నికల ముందే ఆయన భార్య సంగీత డివోర్స్ కోసం కోర్టులో పిటిషన్ వేయగా... చెంగల్పట్టు మహిళా కోర్టు విచారణ చేస్తోంది. సోమవారం మళ్లీ వీరి విడాకుల పిటిషన్ విచారణకు వచ్చింది.
కీలక ఆదేశాలు
ఈ పిటిషన్ తదుపరి విచారణను ఆగస్ట్ 7కి వాయిదా వేసింది. సంగీత డివోర్స్ పిటిషన్‌పై ఏప్రిల్ 20న విచారణ చేపట్టిన న్యాయస్థానం... ఇద్దరూ కోర్టుకు హాజరు కాకపోవడంతో జూన్ 15కి వాయిదా వేసింది. సోమవారం ఉదయం 10:30 గంటలకు విచారణ ప్రారంభం కాగా... విజయ్ కానీ సంగీత కానీ వ్యక్తిగతంగా ఎవరూ హాజరు కాలేదు. దీంతో ఎలాంటి ముఖ్యమైన పరిణామాలు, నిర్ణయాలు, తీర్మానాలు లేకుండానే విచారణ ముగిసింది.
Also Read : Super Subbu OTT : సందీప్ కిషన్ ఓటీటీ డెబ్యూ కామెడీ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మళ్లీ కలుస్తారా?
విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ చొరవతో వీరిద్దరూ మళ్లీ కలుస్తారనే ప్రచారం సాగుతోంది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరిని కలిపేందుకు కుటుంబ సభ్యులు తెర వెనుక గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్, పర్సనల్ లైఫ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇరువురి మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగించుకోవాలని పెద్దలు నచ్చచెప్పినట్లు సమాచారం.
ఆ ప్రయత్నాలు సఫలం కావడంతోనే సంగీత రీసెంట్‌గా లండన్ నుంచి తిరిగి చెన్నై చేరుకున్నారని తెలుస్తోంది. దంపతులు ఇద్దరూ కలిసి సమయం గడుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఇద్దరూ కలిసి మళ్లీ సంతోషంగా జీవితం సాగించాలని కోరుకుంటున్నారు.
1999లో విజయ్, సంగీత వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఎన్నికల ముందు తన భర్త నుంచి విడాకులు కోరుతూ సంగీత కోర్టులో పిటిషన్ వేశారు. భరణం కూడా కోరినట్లు వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో విజయం సాధించిన విజయ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
Also Read : This Week Theatrical Releases : సమంత మా ఇంటి బంగారం To కాక్ టెయిల్ 2 - ఆ ఒక్క రోజే 5 సినిమాలు డోంట్ మిస్
ట్రెండింగ్ వార్తలు























