Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్
Vijay Instagram Debut : తమిళ స్టార్ హీరో విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు పెట్టారు. ఈ రోజు ఫోటో పోస్ట్ చేశారు.
తమిళ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుల్లో ఒకరు, తెలుగుతో పాటు ఇతర భాషల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో విజయ్ (Thalapathy Vijay). ఈ రోజు (ఏప్రిల్ 2వ తేదీన) ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు పెట్టారు. అవును... మీరు చదివింది నిజమే!
హలో నన్బాస్ & నన్బీస్!
సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్స్ ట్విట్టర్, ఫేస్ బుక్... రెండిటిలో దళపతి విజయ్ అకౌంట్స్ ఉన్నాయి. ఇతర స్టార్ హీరోల తరహాలో, సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్ కాదు. కానీ... కొత్త సినిమా కబుర్లు, ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తూ ఉంటారు. అయితే... చాలా రోజులుగా ఫోటో & వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram)కు దూరంగా ఉంటూ వచ్చారు.
సుమారు ఏడాదిగా విజయ్ ఇంస్టాగ్రామ్ డెబ్యూ గురించి తమిళ చిత్రసీమలో న్యూస్ వినబడుతోంది. త్వరలో ఇంస్టా ఇన్‌స్టాలో అడుగు పెడతారని కోలీవుడ్ చెబుతూ వస్తోంది. ఎట్టకేలకు ఆయన ఈ రోజు ఇన్‌స్టాలో ఎంట్రీ ఇచ్చారు. ''హలో నన్బాస్ (స్నేహితులు) & నన్బీస్ (స్నేహితురాళ్ళు)!'' అంటూ ఈ ఫోటో షేర్ చేశారు.
Also Read : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ... ఆ క్షణంలో కన్నీళ్ళు ఆగలేదట!
విజయ్ అలా అడుగు పెట్టారో, లేదో... క్షణ క్షణానికి అలా అలా ఆయన ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూ వెళుతోంది. ఇన్స్టాలో ఆయన ఎవరినీ ఫాలో కావడం లేదు. కానీ, అకౌంట్ ఓపెన్ చేసిన గంటలో ఆయన ఫాలోయర్స్ సంఖ్య ఐదు లక్షలకు పైచిలుకు చేరుకుంది. ఇదొక రికార్డ్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. సినిమాలకు వస్తే... ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'లియో' సినిమా చేస్తున్నారు విజయ్.
Also Read : గోవాకు ఎన్టీఆర్ 30 సెకండ్ షెడ్యూల్ - ఎప్పటి నుంచి అంటే?
View this post on Instagram
'మాస్టర్' తర్వాత మరోసారి విజయ్, లోకేష్ కనగరాజ్ చేస్తున్న సినిమా 'లియో'. దీనిని 7 స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. 'మాస్టర్', 'వారసుడు' తర్వాత విజయ్ హీరోగా ఆ సంస్థ నిర్మిస్తున్న మూడో చిత్రమిది. ఇందులో విజయ్ సరసన త్రిష నటిస్తున్నారు.
తమిళంలో విజయ్, త్రిషది సూపర్ డూపర్ హిట్ జోడీ. సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఒక్కడు' తమిళ రీమేక్ సహా 'కురివి', 'తిరుప్పాచ్చి', 'అతి' సినిమాల్లో వాళ్ళిద్దరూ నటించారు. 14 ఏళ్ళ విరామం తర్వాత మళ్ళీ విజయ్, త్రిష నటిస్తున్నారు. లోకేష్ కానగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో 'దళపతి 67' కూడా ఒకటి. కార్తీ 'ఖైదీ', కమల్ హాసన్ 'విక్రమ్', సూర్య 'రోలెక్స్' క్యారెక్టర్లు, విజయ్ క్యారెక్టర్... అన్నీ ఈ కథలో భాగమే. డ్రగ్ మాఫియా, గ్యాంగ్‌స్టర్లు చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో త్రిష పాత్ర ఏమిటి? అని చాలా మందికి సందేహం కలుగుతోంది.
త్రిషతో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్ ప్రియా ఆనంద్, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ తదితరులు ఉన్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 'కత్తి', 'మాస్టర్', 'బీస్ట్' తర్వాత మరోసారి విజయ్ సినిమాకు ఆయన సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస.