News
News
వీడియోలు ఆటలు
X

Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ

Sobhita Dhulipala on Insta: శోభితా ధూళిపాళ చేతుల మీదుగా సమంత పెళ్లి జరుగుతోంది. పెళ్ళిలో ఏర్పాట్లు అన్నీ శోభిత స్వయంగా చూసుకుంటున్నారు. అంతే కాదు, ఆ క్షణం తనకు కన్నీళ్లు ఆగలేదని ఆమె రాసుకొచ్చారు.

FOLLOW US: 
Share:

సమంత (Samantha)... శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala)... ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి తెలుగు, హిందీ, తమిళ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంతతో వైవాహిక బంధం నుంచి వేరు పడిన అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), ఆ తర్వాత శోభితా ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నారని కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

సమంత, శోభిత జీవితాలు కొన్ని రోజులుగా నలుగురి నోళ్ళల్లో నానుతున్నాయి. ఈ సమయంలో సామ్ పెళ్లి ఫోటోలను శోభితా షేర్ చేయడం... తొలిసారి సమంతను పెళ్లి కుమార్తె దుస్తుల్లో చూసినప్పుడు ఏడుపు వచ్చేసిందని పేర్కొనడం విశేషం. 

శోభిత ఏం పోస్ట్ చేశారంటే?
మెహందీ ఫంక్షన్ ఫోటోలను శోభితా ధూళిపాళ పోస్ట్ చేశారు. చాలా కొత్త ముఖాలు తొలిసారి ఒకరినొకరు కలుసుకున్నాయని పేర్కొన్నారు. అక్కడితో ఆగలేదు. ''నా బెస్ట్ ఫ్రెండ్, నేను సేమ్ టైప్ డ్రస్ లు వేసుకోవాలని ప్లాన్ చేశాం. కానీ, నాకు రెడీ అయ్యే టైమ్ దొరకలేదు. ఫంక్షన్ ఏర్పాట్లు చూసుకోవడంతో అసలు ఖాళీ లేదు. కనీసం మేకప్ వేసుకోవడం, హెయిర్ స్టైలింగ్ చేసుకోవడం కూడా కుదరలేదు. సమంతను తొలిసారి పెళ్లి కుమార్తెగా చూసిన తర్వాత కన్నీళ్లు వచ్చేశాయి'' అని శోభితా ధూళిపాళ పేర్కొన్నారు. తాను గోరింటాకు పెట్టుకోకపోయినా క్యాటరింగ్ పెద్ద హిట్ కావడంతో హ్యాపీగా ఉన్నానని ఆమె తెలిపారు. 

తొలిసారి శోభితా ధూళిపాళ పోస్ట్ చూసిన వాళ్ళు ఎవరికి అయినా సరే... సమంత పెళ్లి ఆమె చేతుల మీదుగా జరుగుతోందని అనిపిస్తుంది. ఆమె రాసిన మేటర్ అలా ఉంది మరి! అయితే, అసలు మేటర్ వేరే ఉందని సమాచారం. 

వెబ్ సిరీస్ పెళ్లికి రియల్ కలరింగ్ ఇచ్చారా?
సోషల్ మీడియాలో శోభితా ధూళిపాళ పోస్ట్ చూస్తే... అందులో తారా ఖన్నా అని ఓ పేరు మనకు కనబడుతుంది. 'మేడ్ ఇన్ హెవెన్' వెబ్ సిరీస్ (made in heaven season 2)లో ఆమె క్యారెక్టర్ పేరు అది. ఇప్పుడు రెండో సీజన్ రెడీ అవుతుంది. అందులో పెళ్లి సన్నివేశం ఉంది. దానికి సంబంధించిన ఫోటోలను శోభిత పోస్ట్ చేశారని టాక్.

సమంత జీవితం, తన జీవితం చుట్టూ ప్రజల్లో జరుగుతున్న చర్చను వెబ్ సిరీస్ పబ్లిసిటీ కోసం శోభితా ధూళిపాళ వాడినట్లు ఉన్నారు. కొన్ని రోజులు అయితే గానీ దీనిపై క్లారిటీ రాదు. 

Also Read : ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

View this post on Instagram
 
A post shared by Sobhita Dhulipala (@sobhitad)

శోభితా ధూళిపాళతో నాగ చైతన్య డేటింగ్ రూమర్స్ మళ్ళీ మొదలు అయ్యాయి. ఈ  మధ్య ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. నాగ చైతన్యతో ఒక లండన్ రెస్టారెంట్‌లో షెఫ్ ఫోటో దిగారు. అందులో శోభితా ధూళిపాళ కూడా ఉన్నారు. చాలా మంది అది రీసెంట్ ఫోటో అనుకున్నారు. నిజం ఏమిటంటే... అది రెండు నెలల క్రితం దిగిన ఫోటో! అయితే, ఉన్నట్టుండి ఇప్పుడు వైరల్ కావడం ఏమిటి? దీని వెనుక ఎవరు ఉన్నారు? ఎవరైనా కావాలని టార్గెట్ చేశారా? అని అక్కినేని అభిమానులు కొందరిలో అనుమానాలు ఉన్నాయి.

Also Read : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

Published at : 02 Apr 2023 03:36 PM (IST) Tags: Sobhita Dhulipala Samantha Mehendi Function Sobhita On Sam Wedding

సంబంధిత కథనాలు

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్

'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

టాప్ స్టోరీస్

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!