News
News
వీడియోలు ఆటలు
X

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా దసరా కానుకగా విడుదల కానుంది. అయితే, ఆల్రెడీ ఈ సినిమా ఓటీటీ హక్కులను రికార్డు రేటుకు అమ్మేశారట.

FOLLOW US: 
Share:

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna)కు ఓటీటీ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. 'అన్‌స్టాపబుల్' కార్యక్రమం తర్వాత డిజిటల్ కంటెంట్ కోసం చూసే ప్రేక్షకుల్లో కూడా ఆయనకు ఫాలోయింగ్ పెరిగింది. దాంతో ఆయన కొత్త సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ రికార్డ్ రేటుకు అమ్ముడు అయ్యాయని తెలిసింది. 

రూ. 36 కోట్లకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్.బి.కె 108 (NBK 108 Movie) సినిమా విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విడుదలకు ఆరు నెలల ముందు సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్మేశారని సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 36 కోట్లకు ఆల్ లాంగ్వేజెస్ రైట్స్ తీసుకుందట.

Also Read : సమంత కన్నా చిన్నోడు - 'ఈగ' విడుదలైనప్పుడు కాలేజీలో, కట్ చేస్తే...

బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు!
Sreeleela Balakrishna Relation In NBK 108 : ఎన్.బి.కె 108లో యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె బాలకృష్ణ కుమార్తె పాత్ర చేస్తున్నారని వచ్చిన వార్తల్లో నిజం లేదు. శ్రీలీలకు బాబాయ్ పాత్రలో బాలయ్య నటిస్తున్నారు. మరి, శ్రీలీల తండ్రి పాత్రలో ఎవరు నటిస్తున్నారు? అంటే... శరత్ కుమార్! ఈ సినిమాలో బాలకృష్ణకు అన్నయ్య పాత్రలో ఆయన నటిస్తున్నారు. 

బాలకృష్ణ హీరోగా డిఫరెంట్ యాక్షన్ డ్రామాను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. దూకుడైన మనస్తత్వం కల హీరోగా బాలకృష్ణ క్యారెక్టర్ డిజైన్ చేశారట. శ్రీలీల, శరత్ కుమార్, హీరో మధ్య సీన్లు కొత్తగా ఉంటాయని తెలిసింది. సినిమాకు ఆ సీన్లు ఆయువు పట్టు లాంటివి అని తెలిసింది. ఇటీవల బాలకృష్ణ, శ్రీలీల, ఇతర తారాగణం పాల్గొనగా కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు.

శ్రీలీల పాటకు ఐదు కోట్లు!?
ప్రస్తుతం శ్రీలీల మీద రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఆ పాట తీయడానికి మొత్తంగా ఐదు కోట్ల రూపాయల ఖర్చు అవుతోందట. ఆ సాంగ్ మాంచి మాసీగా ఉంటుందట. తమన్ క్యాచీ ట్యూన్ ఇవ్వగా, ముంబై నుంచి ప్రత్యేకంగా డ్యాన్సర్లను రప్పించి పిక్చరైజ్ చేస్తున్నారట.

దసరా బరిలో బాలకృష్ణ సినిమా!
''విజయ దశమికి ఆయుధ పూజ'' అంటూ దసరా బరిలో సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.బాలకృష్ణ, కాజల్ కలయికలో తొలి చిత్రమిది.  

దసరా బరిలో నాలుగు సినిమాలు!
ఆల్రెడీ దసరా బరిలో మూడు సినిమాలు ఉన్నాయి. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'ను అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అదే రోజున ఉస్తాద్ రామ్ పోతినేని, బాలయ్యతో 'సింహ', 'లెజెండ్', 'అఖండ' వంటి విజయవంతమైన సినిమాలు ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా కూడా విడుదల కానుంది. తమిళ స్టార్ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తీస్తున్న 'లియో' అక్టోబర్ 19న విడుదలకు రెడీ అయ్యింది. బాలకృష్ణ రాకతో మొత్తం మీద దసరా బరిలో నాలుగు సినిమాలు ఉన్నట్టు అయ్యింది.

Also Read టాలీవుడ్‌లో విషాదం - నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ మృతి

Published at : 02 Apr 2023 01:10 PM (IST) Tags: Balakrishna Sree leela NBK108 Movie Prime Video OTT NBK108 OTT Rights

సంబంధిత కథనాలు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి