అన్వేషించండి

Vijay: రాజకీయ కారణాలతోనే గోపిచంద్ మలినేని మూవీని విజయ్ రిజెక్ట్ చేశారా?

తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో రీసెంట్ గా ఓ సినిమాను రిజెక్ట్ చేయగా.. తాజాగా అందుకు గల కారణాలు ఇవే అంటూ కొన్ని వార్తలు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ లో 'క్రాక్', 'వీర సింహారెడ్డి' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని.ఈ ఏడాది ఆరంభమే బాలయ్యతో 'వీరసింహారెడ్డి' వంటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక 'వీరసింహారెడ్డి' సక్సెస్ తర్వాత తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ తో ఓ సినిమా చేయాలని గోపీచంద్ మలినేని ప్లాన్ చేశారు. ఇటీవలే దళపతి విజయ్ ని అప్రోచ్ అవ్వడమే కాకుండా ఆయన్ని కలిసి స్టోరీ కూడా వినిపించి, సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేయించుకున్నారట. గోపీచంద్ చెప్పిన కథ విజయ్ కి సైతం బాగా నచ్చేసింది అంటూ కోలీవుడ్ మీడియా నుంచి వార్తలు వినిపించాయి.

దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అని అనుకుంటున్న సమయంలో దర్శకుడు గోపీచంద్ కి విజయ్ భారీ షాక్ ఇస్తూ మరో కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తో సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గోపీచంద్ మలినేని తర్వాత వెంకట్ ప్రభు విజయ్ కి ఒక కథ వినిపించగా.. ఆ కథనే ఫైనల్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసేశారు. నిజానికి గోపీచంద్ వినిపించిన కథ విజయ్ కి బాగా నచ్చింది. మరి అలాంటిది ఈ ప్రాజెక్టును విజయ్ ఎందుకు రిజెక్ట్ చేశారు? అనే విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అందుకు సమాధానంగా కొన్ని కోలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. రాబోయే రెండు సంవత్సరాల్లో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉండబోతోంది.

దీంతో తన పొలిటికల్ ఎంట్రీకి ముందు తెలుగు దర్శకుడితో పని చేయడం విజయ్ కి ఇష్టం లేదట. అందుకు బదులుగా తమిళ ఇండస్ట్రీలో సామాజిక, రాజకీయ అంశాలు బాగా తెలిసిన దర్శకులతో పనిచేయాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే గోపీచంద్ మలినేనికి బదులుగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమాని ఓకే చేశారని, ఈ కారణాల వల్లే తెలుగు దర్శకుడైన గోపీచంద్ మలినేనితో విజయ్ సినిమా చేయలేదని, అంతకుమించి వేరే కారణాలు ఏమీ లేవంటూ కోలీవుడ్ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.కాగా వచ్చే ఏడాదిలోగా విజయ్ సినిమాల నుంచి పూర్తిగా విరామం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం తలపతి విజయ్ కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న 'లియో' సినిమాలో నటిస్తున్నారు.

'విక్రమ్' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనకరాజ్ నుండి వస్తున్న సినిమా కావడం, ఇందులో విజయ్ లాంటి స్టార్ హీరో నటించడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలై భారీ రెస్పాన్స్ని అందుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.

Also Read : ఆ స్టార్ హీరోలు నాకు ఛాన్స్ ఇవ్వరు, అందుకే నా సినిమాకి నేనే హీరోగా మారాను : ఐశ్వర్య రాజేష్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget