అన్వేషించండి

Director Vetrimaaran : నోట్ల రద్దు ఇబ్బందులు మర్చిపోయారా? - 'విడుదల' డైరెక్టర్ కామెంట్స్ వైరల్... ధురంధర్ 2నే టార్గెట్ చేశారా?

Dhurandhar 2 Review : రానా దగ్గుబాటి సహ నిర్మాతగా వ్యవహరించిన 'నీలిర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తమిళ డైెరెక్టర్ వెట్రిమారన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Tamil Director Vetrimaaran Comments Indirectly Dig Dhurandhar 2 Movie : తనదైన సామాజిక చైతన్యం, చిత్రాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్. ఆడుకాలం, కాక్కముట్టై, విడుదల, విచారణ వంటి మూవీస్‌తో క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా ఓ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీశాయి. ఆయన ఇండైరెక్ట్‌గా 'ధురంధర్ 2'నే టార్గెట్ చేశారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'అది హేట్ ప్రొపగాండా'

సోమీతరన్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సహ నిర్మాతగా వ్యవహరించిన 'నీలిర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన వెట్రిమారన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ మూవీ ద్వేషం గురించి మాట్లాడదని, హింసను సమర్థించదని అన్నారు. 'ప్రస్తుతం ప్రతిదీ ఓ ప్రచారంగా మారిపోయింది. మన జ్ఞాపకాలు, ఆలోచనలను ప్రభావింత చేసే శక్తి ఈ ప్రచారానికి ఉంది. నోట్ల రద్దు టైంలో ఎవరు నష్టపోయారో, క్యూలైన్లలో నిలబడి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనందరికీ తెలుసు.

ఇప్పుడు వాటన్నింటినీ మరుగున పడేసి, ద్వేషాన్ని పెంచేలా ప్రచారం చేస్తున్నారు. చరిత్రను లేదా వాస్తవాలను వక్రీకరించి చూపడం హేట్ ప్రొపగాండా కిందకే వస్తుంది.' అని అన్నారు. అలాగే, 'నీలిర' చిత్రం గురించి మాట్లాడుతూ... 'కోట్ల రూపాయలతో ఓ భావజాలాన్ని ప్రచారం చేయడానికి దీన్ని రూపొందించలేదు. హింసను వ్యాపారంగా మార్చి 100 కోట్లు సంపాదించాలనే లక్ష్యం దీనికి లేదు. ఇది ఏ వర్గాన్ని అపహాస్యం చేయదు. ఎవరినీ నేరుగా విమర్శించకుండా సంఘటనలను చూపిస్తుంది.' అని చెప్పారు. 

Also Read : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - టాలీవుడ్ టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే

ధురంధర్ 2 గురించేనా?

నెట్టింట వెట్రిమారన్ కామెంట్స్‌పై పెద్ద చర్చే సాగుతోంది. ఆయన ఇండైరెక్ట్‌గా ధురంధర్ 2 గురించే ప్రస్తావించారని అంటున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొడుతోంది. కేవలం 10 రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేసింది. సినిమాలో 2016లో నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ... పాక్ నుంచి వచ్చే ఫేక్ నోట్స్ అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ఓ మాస్టర్ ప్లాన్‌గా చూపించారు.

అయితే, వాస్తవానికి నోట్ల రద్దు వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. పాత నోట్లను మార్చుకోవడానికి, కొత్త నోట్లు విత్ డ్రా చేసుకోవడానికి ప్రజలు బ్యాంకుల ముందు గంటల తరబడి నిలబడి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపాయి. చిన్న వ్యాపారులు, కూలీ పనులు చేసుకునే వారు తగినంత నగదు లేక ఉపాధి కోల్పోయారని, రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించాయి. తాజాగా వెట్రిమారన్ చేసిన ప్రొపగాండా కామెంట్స్ 'ధురంధర్ 2'తో లింక్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

ధురంధర్ 2 కలెక్షన్స్

మరోవైపు, ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ రూ.1,128 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు  ట్రేడ్ వర్గాల అంచనా. రెండు పార్టులు కలిపి... దంగల్, బాహుబలి, పుష్ప చిత్రాల లాంగ్ రన్ కలెక్షన్స్‌ను దాటేశాయి. త్వరలోనే మిగిలిన రికార్డును కూడా అధిగమిస్తుందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story Review - 'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Chennai Love Story Live Updates - 'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
Raakaasa TV Premiere Date : టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget