By: ABP Desam | Updated at : 16 May 2023 04:34 PM (IST)
తమన్నా (Image Courtesy : Manav Manglani)
అందాల భామలు ఏ డ్రస్ వేసుకున్నా... ఏ వాచ్ పెట్టుకున్నా... ఆఖరికి ఏ హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నా... అందరి కళ్ళు పడతాయి. వాళ్ళను టాప్ టు బాటమ్ అబ్జర్వ్ చేసే కళ్ళు కొన్ని ఉంటాయి. ఆ కారణం వల్లనో, మరొకటో గానీ... ఎప్పుడూ కొత్తగా, ప్రేక్షకుల కళ్ళకు అందంగా కనిపించడం కోసం అందాల భామలు ఇంపార్టెన్స్ ఇస్తారు. సాధారణంగా డ్రస్సులు గానీ, యాక్సెసరీలు గానీ రిపీట్ చేయరు. తమన్నా భాటియా కూడా అందుకు అతీతం ఏమీ కాదు. మాంచి ఖరీదైన హ్యాండ్ బ్యాగుతో ఆవిడ ఎయిర్ పోర్టులో కనిపించారు.
అక్షరాలా లక్ష రూపాయల బాగ్!
మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) మంగళవారం ఉదయం ముంబై ఎయిర్ పోర్టులో కనిపించారు. జీన్స్, వైట్ టీ షర్ట్, పైన కోట్... తమన్నా ఎయిర్ పోర్ట్ లుక్ చాలా అంటే చాలా సింపుల్ గా ఉంది. అప్పుడు ఆమె చేతిలో ఓ బ్యాగ్ ఉంది.
బుర్ బెర్రీ బ్రాండ్ బ్యాగ్ (burberry bag)ను తమన్నా ఉపయోగిస్తున్నారు. దాని ఖరీదు అక్షరాలా లక్ష రూపాయలు! అవును... మీరు చదివింది నిజమే! తమన్నా లక్ష రూపాయల బ్యాగును చేతిలో మోస్తున్నారు. కొంత మంది కథానాయికలు ఇంత కంటే ఎక్కువ రేటు ఉన్న బ్యాగ్స్ వాడుతూ కనిపించారు. చక్కనమ్మా చిక్కినా అందమే అన్నట్టు.... డబ్బులున్న భామ ఎంత ఖరీదైన బ్యాగ్ కొంటే అంత గొప్ప! అదీ సంగతి!
Also Read : గాలి జనార్ధన్ రెడ్డి వర్సెస్ సుంకులమ్మ కథతో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'?
చిరంజీవితో 'భోళా శంకర్'లో...
తెలుగులో ప్రస్తుతం తమన్నా నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే... మెగాస్టార్ చిరంజీవికి జోడీగా 'భోళా శంకర్' చేస్తున్నారు. అందులో చిరు చెల్లెలుగా కీర్తీ సురేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్నా మెయిన్ హీరోయిన్. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత చిరు, తమన్నా కలయికలో వస్తున్న సినిమా 'భోళా శంకర్'. హిందీలో 'బోల్ చుడీయా', మలయాళంలో 'బాంద్రా' సినిమాలు చేస్తున్నారు.
సినిమాల కంటే ప్రేమ వార్తలతో ఎక్కువగా...
ఇప్పుడు సినిమాల కంటే ప్రేమ కబుర్లతో తమన్నా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. హైదరాబాదీ యువకుడు విజయ్ వర్మ (Vijay Varma)తో ఆమె ప్రేమలో ఉన్నారు. అయితే, ఆ విషయాన్ని వాళ్లిద్దరూ ఎప్పుడూ నోరు తెరిచి చెప్పలేదు. తొలుత గుట్టుగా ఉంచారు. కానీ, ఇప్పుడు తమ చేతల ద్వారా ప్రేమలో ఉన్నట్లు హింట్ ఇస్తూ ఉన్నారు. రహస్యంగా కలవకుండా మీడియాకు కనపడేలా షికార్లు చేస్తున్నారు.
ముంబైలో డిన్నర్ డేట్...కారులో షికార్!
విజయ్ వర్మది హైదరాబాద్ అయినప్పటికీ... ఆయన ముంబైలోనే ఉంటున్నారు. అటు తమన్నా పంజాబీ అమ్మాయి అయినా సరే... పుట్టిందీ, పెరిగిందీ, అంతా ఆ నగరంలోనే! ఇద్దరూ ముంబైలో సోమవారం కలిశారు. ఓ రెస్టారెంట్ లో డిన్నర్ చేసిన తర్వాత, తమన్నా కారు ఎక్కుతున్న సమయంలో మీడియా కంట పడ్డారు. వీడియోలు, ఫోటోలు తీస్తుంటే... హాయ్ చెప్పారు. సో... తమ ప్రేమ విషయాన్ని ఈ జంట ఇప్పుడు దాచాలని అనుకోవడం లేదన్నమాట.
Also Read : పూరి జగన్నాథ్ హర్టు - ఒక్క రూపాయి కూడా వెనక్కి ఇచ్చేది లేదట!
మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం
Rangabali Teaser: ‘మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది’ - నాగశౌర్య ‘రంగబలి’ టీజర్ అదిరిపోయిందిగా
Dhoomam Telugu Trailer : ధూమం - నా పేరు ముఖేష్ యాడ్ అందరూ చూసేలా చేస్తే?
Tamanna: చేతిలో మందు గ్లాస్, బీచ్‌లో డ్యాన్స్ - బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్న తమన్నా, వీడియో వైరల్
Filmfare Awards: ఆ అవార్డులను వాష్ రూమ్ హ్యాండిల్‌గా వాడతా - ‘ఫిల్మ్‌ఫేర్’పై నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యలు
KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్
Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!
YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్