By: ABP Desam | Updated at : 02 Apr 2022 09:28 AM (IST)
వర్షా బొల్లమ్మ, బెల్లంకొండ గణేష్
'భీమ్లా నాయక్' సినిమాతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ ఏడాది భారీ విజయం అందుకుంది. వేసవి తర్వాత మరో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు, హీరో సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ... సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'స్వాతిముత్యం'. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు.
జూలైలో 'స్వాతిముత్యం' సినిమాను విడుదల చేయనున్నట్టు ఉగాది సందర్భంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలిపింది. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం చేస్తూ... పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న చిత్రమిది. ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్. ఉగాది సందర్భంగా సినిమాలో హీరో హీరోయిన్స్ కొత్త స్టిల్ విడుదల చేశారు.
'స్వాతి ముత్యం'లో బాలమురళి పాత్రలో బెల్లంకొండ గణేష్, భాగ్యలక్ష్మి పాత్రలో వర్ష బొల్లమ్మ నటించారు. జీవితం, ప్రేమ, పెళ్లి వంటివాటిపై యువత ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? వాటి మధ్య ఓ యువకుడి జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది చిత్ర కథాంశం.
Also Read: ఉగాదికి రాముడొచ్చాడు - స్టయిలిష్‌గా సూపర్ కాప్
సీనియర్ నటుడు నరేష్ వీకే, రావు రమేష్, సుబ్బరాజు, 'వెన్నెల' కిషోర్, సునయన, దివ్య శ్రీపాద తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. కథ, సన్నివేశాలు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటాయని తెలుస్తోంది.
Also Read: అనుష్కా శెట్టి - నవీన్ పోలిశెట్టి - మూడు రోజుల్లో మళ్ళీ మొదలు!
The Gray Man Trailer - ‘ది గ్రే మ్యాన్’ ట్రైలర్: హాలీవుడ్ మూవీలో ధనుష్, మెరుపు తీగలా మాయమయ్యాడంటూ ట్రోల్స్!
Rashmika Mandanna: రష్మికకు అదొక సెంటిమెంట్ - ఆమె ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా షెడ్యూల్లో అది కామన్
Mahesh Babu Trivikram Movie Update: మహేష్ బాబు సినిమాకూ త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్‌తో వెళతారా?
Chiranjeevi - Mega 154 Story: విశాఖ నుంచి మలేషియాకు - మెగాస్టార్ 154 కథలో అసలు ట్విస్ట్ అదేనా!?
Venkatesh New Movie: 'ఎఫ్ 3' తర్వాత ఏంటి? దర్శకులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డ వెంకటేష్
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్
Karimnagar: టెన్త్ ఎగ్జామ్స్‌కి ఫుల్లుగా తాగొచ్చిన టీచర్, తూలుతూనే ఇన్విజిలేషన్ - బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో రీడింగ్ చూసి అంతా షాక్!
In Pics: పోలీసుల చేతుల్లోకి అమలాపురం, అడుగడుగునా ఖాకీల మోహరింపు - ఫోటోలు