News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

The Warriorr: ఉగాదికి రాముడొచ్చాడు - స్టయిలిష్‌గా సూపర్ కాప్

The Warriorr movie update: రామ్ పోతినేని కొత్త సినిమా 'ది వారియర్'. ఉగాది సందర్భంగా సినిమాలో హీరో స్టైలిష్ రామ్ లుక్ విడుదల చేశారు. 

FOLLOW US: 
Share:

Ram Pothineni’s stylish police look from The Warriorr unveiled: రాముడొచ్చాడు... ఉగాదికి స్టయిలిష్ రాముడొచ్చాడు... అదీ సూపర్ బైక్ వేసుకుని సూపర్ కాప్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చాడు! ఆ స్టయిల్... ఆ స్వాగ్... ఆ క్లాస్... మాస్ ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకునేలా ఉంది. 'ది వారియర్' సినిమాలో రామ్ (Ram Pothineni New Look - The Warrior Movie) లుక్ ఇది!

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై తెరకెక్కుతోన్న సినిమా 'ది వారియర్' (The Warrior Movie). శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. లింగస్వామి (N Lingusamy) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రామ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉగాది సందర్భంగా... సినిమాలో రామ్ స్టయిలిష్ లుక్  విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

చిత్రనిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ "ప్రేక్షకులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు నూతన సంవత్సరాది సందర్భంగా 'ది వారియర్'లో స్టయిలిష్ రామ్ లుక్ విడుదల చేశాం. ఆల్రెడీ విడుదల చేసిన ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ ప్రకటించిన సందర్భంగా విడుదల చేసిన మరో లుక్‌కు రెస్పాన్స్ బావుంది. అయితే... లేటెస్ట్ లుక్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ లభించింది. ఇప్పటి వరకూ విడుదలైన ప్రతి లుక్ సినిమాపై అంచనాలు పెంచింది" అని చెప్పారు.

Also Read: అనుష్కా శెట్టి - నవీన్ పోలిశెట్టి - మూడు రోజుల్లో మళ్ళీ మొదలు!

ప్రస్తతం హైదరాబాద్‌లో హీరో హీరోయిన్లు రామ్, కృతి శెట్టిలపై భారీ సెట్స్‌లో పాట చిత్రీకరిస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Also Read: ఆస్కార్ చెంప దెబ్బ ఇష్యూ - విల్ స్మిత్ అరెస్టుకు రంగం సిద్ధం, కానీ రాక్ మాత్రం!

Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
 
Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Srinivasaa Silver Screen (@srinivasaasilverscreenoffl)

Published at : 02 Apr 2022 09:04 AM (IST) Tags: Krithi Shetty Ram Pothineni Ugadi 2022 The Warriorr movie Ram Pothineni New Look Ram Pothineni stylish police look TheWarriorr On July14 Telugu Cinema Updates Ugadi 2022

ఇవి కూడా చూడండి

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Ram Charan Ted Sarandos : మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో - రామ్ చరణ్‌తో దోస్తీ భేటీ

Ram Charan Ted Sarandos : మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో - రామ్ చరణ్‌తో దోస్తీ భేటీ

‘హాయ్ నాన్న’ రివ్యూ, ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘హాయ్ నాన్న’ రివ్యూ, ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Balakrishna New Movie: బాలకృష్ణ కొత్త సినిమాలో తెలుగమ్మాయికి ఛాన్స్

Balakrishna New Movie: బాలకృష్ణ కొత్త సినిమాలో తెలుగమ్మాయికి ఛాన్స్

Devil: థియేటర్లలోకి 'డెవిల్' వచ్చేది ఆ రోజే - కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండ్ కిక్!

Devil: థియేటర్లలోకి 'డెవిల్' వచ్చేది ఆ రోజే - కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండ్ కిక్!

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

MIM What Next : పాతబస్తీలో మజ్లిస్‌కు గడ్డు పరిస్థితే - కాంగ్రెస్ ఎంబీటీని ప్రోత్సహిస్తే ఏం జరుగుతుంది ?

MIM What Next : పాతబస్తీలో మజ్లిస్‌కు గడ్డు పరిస్థితే - కాంగ్రెస్ ఎంబీటీని ప్రోత్సహిస్తే ఏం జరుగుతుంది ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!