Anushka 48 Update: అనుష్కా శెట్టి - నవీన్ పోలిశెట్టి - మూడు రోజుల్లో మళ్ళీ మొదలు!
Anushka Shetty Naveen Polishetty Movie Update: అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
అనుష్క శెట్టి (Anushka Shetty) అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతోన్న తాజా సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది. త్వరలో కొత్త షెడ్యూల్ (Anushka Latest Movie Update) కూడా స్టార్ట్ కానుంది.
అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి .(Naveen Polishetty) ప్రధాన పాత్రల్లో యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ సినిమా (Anushka 48) నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ కొంత షూటింగ్ చేశారు. ఏప్రిల్ 4 నుంచి ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
Also Read: 'శర్మాజీ నమ్‌కీన్' రివ్యూ: రిషి కపూర్ ఆఖరి సినిమా - వయసుతో పనేంటి?
అనుష్కకు 48వ చిత్రమిది. 'మిర్చి', 'భాగమతి' విజయాల తర్వాత యూవీ క్రియేషన్స్ సంస్థలో ఆమె నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా (Anushka Shetty hat trick movie with UV Creations). ఇందులో ఆమె సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమా టైటిల్ వెల్లడించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం... నాలుగు దక్షిణాది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.
Happy Birthday Sweety! 💕
— UV Creations (@UV_Creations) November 7, 2021
We are delighted to announce our "Hattrick Combination" with the Sweet and Very Special @MsAnushkaShetty 🥳🎉.
Directed by #MaheshBabuP
Produced by @UV_Creations#HBDAnushkaShetty #Anushka48 #HappyBirthdayAnushkaShetty pic.twitter.com/nOv4LWvonh
Happy Birthday @NaveenPolishety. We are extremely happy to join hands with #NaveenPolishetty on #ProductionNo14
— UV Creations (@UV_Creations) December 26, 2021
Starring @MsAnushkaShetty & @NaveenPolishety
Directed by #MaheshBabuP
Produced by @UV_Creations#HBDNaveenPolishetty #Anushka48 #NaveenPolishetty3 pic.twitter.com/hI8DnOBxZw