Gangs Of Godavari: ‘సుట్టంలా సూసి’ లిరికల్ వీడియో విడుదల - గ్లామర్ డోస్ పెంచేసి నేహా శెట్టి స్టెప్పులు
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫస్ట్ లుక్ నుండి గ్లింప్స్ వరకు.. ఇలా ఏది చూసినా.. అన్నీ ఈ సినిమా ఒక పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరెకెక్కినట్టుగానే సూచిస్తున్నాయి.
ఒకప్పుడు ఒక సినిమాలోని అన్ని పాటలను ఒకేసారి విడుదల చేసి మెల్లగా ప్రేక్షకులు వాటికి అలవాటు పడేవరకు ఎదురుచూసేవారు మేకర్స్. కానీ ఈరోజుల్లో అలా కాదు.. సాంగ్స్‌ని స్వయంగా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తున్నారు. ఒక్కొక్క సాంగ్‌కు ఒక్కొక్క ప్రత్యేకమైన ఈవెంట్‌ను ఏర్పాటు చేసి విడుదల చేస్తున్నారు. తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లోని ఫస్ట్ సింగిల్ కూడా అలాగే విడుదలయ్యింది. ‘సుట్టంలా సూసి’ అనే పాటను తాజాగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది మూవీ టీమ్.
పాటలో నేహా శెట్టే హైలెట్..
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫస్ట్ లుక్ నుండి గ్లింప్స్ వరకు.. ఇలా ఏది చూసినా.. అన్నీ ఈ సినిమా ఒక పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరెకెక్కినట్టుగానే సూచిస్తున్నాయి. కానీ మొదటిసారి ఈ మూవీ నుండి ఒక క్లాస్ పాట బయటికొచ్చింది. అది కూడా ఒక పూర్తిస్థాయి ప్రేమపాట. విశ్వక్ సేన్, నేహా శెట్టి మధ్య సాగే ఈ పాట వినడానికి మాత్రమే కాదు.. చూడడానికి కూడా చాలా అందంగా అనిపిస్తోంది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం విశ్వక్ సేన్, నేహా శెట్టి మొదటిసారిగా జతకట్టారు. ఈ మూవీలో వారి కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది అని ఈ ఒక్క సాంగ్ చూస్తే అర్థమయిపోతోంది. అంతే కాకుండా నేహా ఎప్పటిలాగానే తన గ్లామర్‌తో కుర్రాళ్లను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యింది. ‘సుట్టంలా సూసి’ లిరికిల్ వీడియోలో క్లైమాక్స్‌కు వచ్చేసరికి నేహా అందం చూస్తే యూత్‌కు నిద్రపట్టకపోవడం ఖాయం అంటూ అప్పుడే యూట్యూబ్‌లో కామెంట్స్ కూడా మొదలయ్యాయి.
యువన్ మ్యాజిక్కే వేరు..
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం మ్యూజిక్ డైరెక్టర్‌గా యువన్ శంకర్ రాజాను రంగంలోకి దించారు మేకర్స్. చాలాకాలం తర్వాత ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమాకు సంగీతం అందించడానికి యువన్ ముందుకొచ్చారు. యువన్ శంకర్ రాజా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు సెపరేట్ ఫ్యాన్‌బేస్ ఉంటుంది. అలాంటిది విశ్వక్ సేన్ లాంటి యాక్టర్‌కు యువన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తే ఎలా ఉంటుందో వినడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘సుట్టంలా సూసి’ అనే మొదటి పాటతోనే అందరినీ ఆకట్టుకున్నాడు ఈ మ్యూజిక్ మేస్ట్రో వారసుడు. అనురాగ్ కులకర్ణి తన స్వరంతో ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాడు. శ్రీ హర్ష ఏమని అందించిన లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి.
విశ్వక్ సేన్ కోసం ఇద్దరు హీరోయిన్స్..
గోదావరి ప్రాంతంలో జరిగిన గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ముందుగా లిరిసిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన కృష్ణచైతన్య.. ఇప్పటికే పలు చిత్రాలను డైరెక్ట్ చేసి దర్శకుడిగా కూడా తనలో టాలెంట్ ఉందని నిరూపించుకున్నాడు. అదే పేరును నిలబెట్టుకోవడానికి మరోసారి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో నేహా శెట్టితో పాటు అంజలి కూడా కీలక పాత్రలో నటిస్తోంది. డిసెంబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
Also Read: టైమ్ ను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలని అనిపిస్తోంది - ‘ఖుషి’ ఈవెంట్‌లో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial