అన్వేషించండి

Samantha : టైమ్ ను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలని అనిపిస్తోంది - ‘ఖుషి’ ఈవెంట్‌లో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన తాజా చిత్రం ‘ఖుషి’. సెప్టెంబర్ 1న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ మ్యూజికల్‌ కాన్సెర్ట్‌ నిర్వహించారు. ఇందులో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం 'ఖుషి'. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో మ్యూజికల్‌ కాన్సెర్ట్‌ నిర్వహించారు మేకర్స్. ఈ మ్యూజికల్ కాన్సర్ట్ లో విజయ్ దేవరకొండ, సమంతతో పాటు చిత్ర బృందం పాల్గొన్నది. ఈ సందర్భంగా మాట్లాడిన సమంత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

టైమ్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలి అనిపిస్తోంది- సమంత

“ఈ సినిమా షూటింగ్ టైమ్ లో పాటలు విని ‘ఖుషి’ ఆల్బమ్ లవ్ లో పడిపోయాను. ఇక్కడ లైవ్ లో పాటలు వింటుంటే టైమ్ ను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి సెప్టెంబర్ 1న మీ అందరితో సినిమా చూడాలని అనిపిస్తోంది. మేమెప్పుడూ మీ అందరికీ నచ్చే సినిమా ఇవ్వాలని కోరుకుంటాం. ఈ సినిమాతో అలాంటి ప్రయత్నమే చేశాం. మైత్రీ ప్రొడ్యూసర్స్ నా ఫేవరేట్  ప్రొడ్యూసర్స్. నా ఫేవరేట్ హ్యూమన్ బీయింగ్స్ కూడా వాళ్లే. గత ఏడాదిగా నాకు వాళ్లు ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేను. నా కెరీర్ లో మెమొరబుల్ మూవీ ‘ఖుషి’ . ఇందులో నటించే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ శివ గారికి థాంక్స్.   ‘ఖుషి’ లో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వారి కాంట్రిబ్యూషన్ సినిమాకెంతో బలాన్నిచ్చింది. మీరు చూపించే ప్రేమ కోసం హెల్దీగా తిరిగి వస్తాను. బ్లాక్ బస్టర్ ఇస్తాను” అని చెప్పింది.

‘ఖుషి’ చూసి ఖుషి చేసుకుందాం- ఆనంద్ దేవరకొండ

సెప్టెంబర్ 1న ‘ఖుషి’ సినిమా చూసి ఖుషి చేసుకుందామని నటుడు ఆనంద్ దేవరకొండ అన్నారు. “‘ఖుషి’ మ్యూజిక్ కన్సర్ట్ లో ఒక ఆడియెన్ గా ఎంజాయ్ చేయాలని ఫ్యామిలీతో కలిసి వచ్చాను. ప్రేమంటే ఏంటో మా బేబీ సినిమాలోని డైలాగ్ ద్వారా చెబుతాను. ఎవరు లేకపోతే నీ జీవితం నీది కాదో అదే నిజమైన ప్రేమ. నా ముందు విజయ్, సమంత రూపంలో ఇద్దరు బ్యుటిఫుల్ యాక్టర్స్ ను చూస్తున్నా. సెప్టెంబర్ 1న థియేటర్స్ లో మస్త్ ఖుషి చేసుకుందాం” అన్నారు.

సినిమా చూశాక వారిని మర్చిపోలేరు- సినిమాటోగ్రాఫర్ మురళి

“తెలుగులో అందాల రాక్షసి సినిమా తర్వాత నేను చేస్తున్న మరో ప్రేమ కథా చిత్రమిది. రవి, నవీన్ లాంటి మంచి ప్రొడ్యూసర్స్ ను తొలిసారి చూస్తున్నా. రా రస్టిక్ మూవీస్ చేస్తున్న నాకు దర్శకుడు శివ గారు లవ్  స్టోరికి పనిచేసే అవకాశం ఇచ్చారు. ‘ఖుషి’ లో ఆరాధ్య, విప్లవ్ క్యారెక్టర్స్ లవబుల్ గా ఉంటాయి. సినిమా చూశాక వీళ్లిద్దరిని మీరు మర్చిపోలేరు. సెప్టెంబర్ 1న ఈ సినిమాను ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు” అని చెప్పారు.

15 రోజులు హోటల్ నుంచి బయటకు రాలేదు- హేషమ్ అబ్దుల్

“‘ఖుషి’ సినిమాకు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చేందుకు మైత్రీ సంస్థ నుంచి లభించిన సహకారం మర్చిపోలేను. ఈ సినిమా మ్యూజిక్ కోసం 15 రోజుల పాటు నేను, డైరెక్టర్ శివ గారు ఒక హోటల్ రూమ్ లో బయటకు రాకుండా లాక్ చేసుకుని ఉండిపోయాం. సెప్టెంబర్ 1న థియేటర్స్ లో లవ్ తో పాటు మ్యూజిక్ ను సెలబ్రేట్ చేసుకుందాం” అని సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ తెలిపారు.   

విజయ్, సమంత కలిసి మా సంస్థ నిర్మిస్తున్న సినిమాలో నటించడం ఆనందంగా ఉందని మైత్రీ సీఈవో చెర్రీ వెల్లడించారు. ‘ఖుషి’ సినిమా పెద్ద హిట్ అవుతుందిన నిర్మాత నవీన్ యెర్నేని ఆశాభావం వ్యక్తం చేశారు.  ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ స్థానంలో ‘ఖుషి’ చేరుతుందన్నారు.   తాము ఎంజాయ్ చేస్తూ ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో ‘ఖుషి’ ది బెస్ట్ అన్నారు మరో నిర్మాత వై రవి శంకర్. ఈ మ్యూజిక్ కన్సర్ట్ లో ‘ఖుషి’ సినిమాలోని బ్యూటిపుల్ సాంగ్స్ ను సింగర్స్ జావెద్ అలీ, సిధ్ శ్రీరామ్, మంజూష, చిన్మయి, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ పాడి ఆకట్టుకున్నారు. ‘ఖుషి’ టైటిల్ సాంగ్ లో విజయ్ దేవరకొండ, సమంత లైవ్ పర్ ఫార్మెన్స్ కు ఆడియెన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.  

Read Also: ‘ఖుషి’ మ్యూజికల్‌ కాన్సెర్ట్‌ లో సమంత, విజయ్ రచ్చ-ఓ రేంజిలో ఆటాడేసుకుంటున్న నెటిజన్లు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget