News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Kushi: ‘ఖుషి’ మ్యూజికల్‌ కాన్సెర్ట్‌ లో సమంత, విజయ్ రచ్చ-ఓ రేంజిలో ఆటాడేసుకుంటున్న నెటిజన్లు

హైదరాబాద్ లో ‘ఖుషి’ మ్యూజికల్‌ కాన్సెర్ట్‌ జోష్ ఫుల్ గా జరిగింది. విజయ్ దేవరకొండ, సమంత డ్యాన్స్ చేసి అలరించారు. అయితే, విజయ్ షర్ట్ తీసేసి మరీ డ్యాన్స్ చేయడం పట్ల నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సౌత్ క్వీన్ సమంత రూత్ ప్రభు జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఖుషి'. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ ప్రేమకథా చిత్రం సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా ‘ఖుషి’ ట్రైలర్  విడుదలై, ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో మ్యూజికల్‌ కాన్సెర్ట్‌ నిర్వహించారు మేకర్స్. ఈ మ్యూజికల్ కాన్సర్ట్ లో విజయ్ దేవరకొండ, సమంతతో పాటు చిత్రబృందం పాల్గొన్నది. విజయ్ కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

షర్ట్ తీసేసి రచ్చ చేసిన విజయ్

ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ, సమంత కలిసి చక్కటి డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. అయితే, సమంతతో డ్యాన్స్ చేసే ముందు విజయ్ షర్ట్ తీసేశాడు. ఆ తర్వాత సమంతను ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం వీరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్ లో విజయ్, సమంత హీరో, హీరోయిన్ల మాదిరి కాకుండా డ్యాన్సర్లలా చేశారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయినా, విజయ్ షర్ట్ తీసేయాల్సిన అవసరం ఏంటి? అని మండిపడుతున్నారు. మరికొంత మంది ఇది మ్యూజికల్ కాన్సర్టా? లేదంటే ప్రీ వెడ్డింగ్ షూటా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సమంత అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

విజయ్, సమంతపై నెటిజన్ల ట్రోలింగ్

‘లైగర్’ మూవీ సమయంలోనూ విజయ్ ఇలాగే ప్రవర్తిస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఆయన తీరుపై మండిపడ్డారు. ఆయనకు హీరోకు ఉండాల్సిన లక్షణాలు అస్సలు లేవన్నారు. ఈ సినిమా డిజాస్టర్ తర్వాత విజయ్ మారిపోయాడని అందరూ భావించారు. కానీ, తాజా ఈవెంట్ తో ఆయనలో ఏ మార్పు లేదని తేలిపోయింది. ఇక నాగ చైతన్య అభిమానులు సమంతపై ట్రోల్స్ చేస్తున్నారు. చైతన్యతో ఏనాడైనా ఇలా డ్యాన్స్ చేశావా? అంటూ విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో అంతా విజయ్, సమంత డ్యాన్స్ మీదే చర్చ నడుస్తోంది.   

ఇక ‘ఖుషి’ సినిమా నుంచి వచ్చిన టైటిల్ పోస్టర్, రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకున్నాయి. పాటలు అందరినీ అద్భుతంగా అలరించాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమా మీద మరిన్ని అంచనాలను పెంచింది. సమంత, విజయ్ మధ్య కెమిస్ట్రీ అందరినీ అలరించింది.  'మహానటి' తర్వాత సమంత -విజయ్ దేవరకొండ కలిసి 'ఖుషి' సినిమాలో నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'హృదయం' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తున్నారు. జి మురళి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేశారు.  పీటర్ హెయిన్ యాక్షన్ కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

Read Also: మయోసైటీస్‌తో సమంత ఎంతలా పోరాడిందో చెప్పలేను - ఆమె ముఖంలో నవ్వు చూడాలి, అదే నా కోరిక : విజయ్ దేవరకొండ

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 16 Aug 2023 12:13 PM (IST) Tags: Vijay Devarakonda Samantha Samantha Dance Performance Kushi 2023 Movie Kushi Musical Concert

ఇవి కూడా చూడండి

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?

'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!

'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!

Bigg Boss Season 7 Telugu: పుంజుకుంటున్న ప్రిన్స్, ఆ ఇద్దరికీ గండం - మతపరమైన వ్యాఖ్యలతో ఆ కంటెస్టెంట్ ఔట్?

Bigg Boss Season 7 Telugu: పుంజుకుంటున్న ప్రిన్స్, ఆ ఇద్దరికీ గండం - మతపరమైన వ్యాఖ్యలతో ఆ కంటెస్టెంట్ ఔట్?

ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?

ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?

Sai Pallavi: అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్

Sai Pallavi: అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్

టాప్ స్టోరీస్

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు

ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం