Mass Jathara Pre Release Event: రవితేజ కోసం సూర్య... 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్
Ravi Teja's Mass Jathara Update: మాస్ మహారాజా రవితేజ 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ & వెన్యూ ఫిక్స్ అయ్యాయి. దీనికి సూర్య ముఖ్య అతిథిగా రానున్నారు.

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కోసం కోలీవుడ్ స్టార్ - తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ స్పెషల్ ప్లేస్ సొంతం చేసుకున్న సూర్య శివకుమార్ (Suriya Sivakumar) వస్తున్నారు. వీళ్ళిద్దరినీ ఒక్క స్టేజిపై చూసే అవకాశం అభిమానులకు రాబోతోంది. అదీ ఎప్పుడంటే?
'మాస్ జాతర' వేడుకకు ముఖ్య అతిథిగా!
Mass Jathara Pre Release Event: అక్టోబర్ 31న 'మాస్ జాతర'ను విడుదల చేస్తామని ముందుగా అనౌన్స్ చేశారు. అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అక్టోబర్ 31వ తేదీన ప్రీమియర్స్ వేసి, నవంబర్ 1న సినిమాను విడుదల చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది? అనేది పక్కన పెడితే... ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ, గెస్ట్ డీటెయిల్స్ కన్ఫర్మ్ అయ్యాయి.
అక్టోబర్ 28న... అంటే మంగళవారం సాయంత్రం హైదరాబాద్ సిటీలోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు సూర్య ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
'మాస్ జాతర' సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న సినిమాను సైతం ఈ సంస్థలే ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
Also Read: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ లేటెస్ట్ డ్యాన్స్ రీల్... ఇన్‌స్టాలో వైరల్ వీడియో
View this post on Instagram
రవితేజ 75వ సినిమా... వింటేజ్ మాస్!
రవితేజకు 'మాస్ జాతర' 75వ సినిమా. వింటేజ్ మాస్ మహారాజాను గుర్తు చేసేలా సినిమాను తెరకెక్కించినట్టు చిత్ర బృందం చెబుతోంది. 'సామజవరగమన', 'వాల్తేరు వీరయ్య' వంటి సినిమాలకు రచయితగా పని చేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Also Read: రజనీకాంత్ 'జైలర్ 2'లో బాలీవుడ్ భామ.. విలన్ కూతురిగా!?
'మాస్ జాతర'లో రవితేజ సరసన శ్రీ లీల కథానాయికగా నటించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 'ధమాకా' తర్వాత ఈ ముగ్గురి కలయికలో చిత్రమిది. ఆల్రెడీ విడుదలైన పాటలు ఛార్ట్ బస్టర్లు అయ్యాయి. మూవీ మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేశాయి.





















