Jailer 2 Heroine: రజనీకాంత్ 'జైలర్ 2'లో బాలీవుడ్ భామ.. విలన్ కూతురిగా!?
Rajinikanth Jailer 2 Update: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న 'జైలర్ 2'లో బాలీవుడ్ బ్యూటీ నటిస్తున్నారని కోలీవుడ్ ఖబర్. ఇంతకీ ఆమె ఎవరు? రోల్ ఏమిటి? వంటివి తెలుసా?

తమిళ ప్రేక్షకులకు వెయ్యి కోట్ల సినిమా తీరని కలగా మారింది. 'జైలర్'తో సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ సినిమాను 500 కోట్లు దాటించారు. ఆ మూవీ 600 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని రజనీ 'కూలీ', మణిరత్నం దర్శకత్వంలోని కమల్ హాసన్ 'థగ్ లైఫ్' 1000 కోట్లు కలెక్ట్ చేస్తాయని ఆశలు పెట్టుకున్నా నెరవేరలేదు. దాంతో 'జైలర్ 2' మీద తమిళ్ ఆడియన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడీ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెన్నై సినిమా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అది ఏమిటో తెలుసా?
'జైలర్ 2'లో విద్యా బాలన్!?
'జైలర్' సక్సెస్ తర్వాత సీక్వెల్ తీయడానికి స్క్రిప్ట్ రెడీ చేశారు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar). సినిమా అనౌన్స్ చేయడం కోసం ఓ స్పెషల్ వీడియో షూట్ చేశారు. రెగ్యులర్ షూట్ మొదలైంది అనుకోండి. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఇందులో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ నటిస్తున్నారట.
విద్యా బాలన్ పేరు చెబితే ఇండియా వైడ్ చాలా మందికి 'డర్టీ పిక్చర్' గుర్తుకు వస్తుంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాలో ఆవిడ అంతలా జీవించింది. కెరీర్ ప్రారంభంలో కమర్షియల్ గ్లామరస్ రోల్ చేసినా... ఆ తర్వాత రూటు మార్చారు విద్యా బాలన్. పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ మూవీలు చేస్తున్నారు. ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం ఆమెకు వచ్చింది.
'జైలర్ 2'లో బాలీవుడ్ సీనియర్ స్టార్ మిథున్ చక్రవర్తి విలన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయనకు కుమార్తెగా విద్యా బాలన్ కనిపిస్తారని తెలిసింది. కథలో ఆమె పాత్ర చాలా కీలకం అట. 'జైలర్'లో రజనీకాంత్ భార్యగా రమ్యకృష్ణ నటించారు. ఈ సీక్వెల్‌లో కూడా ఆమె క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ ఉన్న నటీనటులకు విద్యా బాలన్ వంటి స్ట్రాంగ్ పెర్ఫార్మన్స్ యాక్ట్రెస్ యాడ్ అయ్యారు.
Also Read: బాలకృష్ణకు జంటగా మరోసారి నయనతార... ఈసారి హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలో!
View this post on Instagram
తమిళంలో ఆల్రెడీ విద్యా బాలన్ ఒక సినిమా చేశారు. అజిత్ 'నెర్కొండ పార్వై'లో హీరో భార్యగా కనిపించారు. అయితే అది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాదు. అతిథి పాత్ర అని చెప్పవచ్చు. ఇప్పుడు 'జైలర్ 2'లో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు. ఇది ఆమె ప్రోపర్ తమిళ్ డెబ్యూ అని చెప్పవచ్చు. తెలుగులో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణకు జంటగా 'యన్.టి.ఆర్' బయోపిక్ చేశారు.
Also Read: చిరంజీవి - బాబీ కొల్లి సినిమాలో తమిళ్ హీరో... సేమ్ ఫార్ములా రిపీట్?
'జైలర్ 2' విషయానికి వస్తే... ఎస్.జె. సూర్య కీలక పాత్ర చేస్తున్నారు. ఇంకా యోగి బాబు, మిర్నా మీనన్, శివరాజ్ కుమార్, బాలకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. గోవాలో మరొక షెడ్యూల్ ప్లాన్ చేశారు. జనవరి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.





















